Sobhita Dhulipala Beauty and Fitness Tips : శోభిత ధూళిపాల.. మరికొద్ది గంటల్లో అక్కినేని కుటుంబానికి కోడలు కాబోతుంది. పెళ్లి తంతు ఫోటోల్లో చక్కటి గ్లోతో మెరిసిపోతున్న శోభిత తన స్కిన్​ కేర్, మేకప్, ఫిట్​నెస్​ విషయంలో చాలా భిన్నమైన రోటీన్​ని ఫాలో అవుతుంది. తన చర్మాన్ని సహజంగా ఉంచుకునేందుకు శోభిత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? మీరు కూడా ఆమెలాగా గ్లో అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు తెసుకుందాం. 


కాలేజ్ రోజుల్లో.. 


కాలేజ్ రోజుల్లో తాను అంత అందంగా ఉండేది కాదని.. దానివల్ల తనకి కాన్ఫిడెన్స్ తక్కువని శోభిత చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో తాను స్కిన్​కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదట. మేకప్ విషయంలో కూడా అంత అవగాహన లేదని శోభిత తెలిపింది. మోడల్​గా కెరీర్​ మొదలు పెట్టినప్పుడే మేకప్​ని వినియోగించినట్లు తెలిపింది. మొదట్లో వేరే వాళ్లు మేకప్ వేస్తుంటే తనకి ఎలా జడ్జ్ చేయాలో కూడా తెలిసేది కాదని.. తర్వాత రోజుల్లో మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. స్కిన్​ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నట్లు తెలిపింది. 


మేకప్ ట్రిక్స్


మేకప్​ ఎప్పుడూ ఎక్కువగా వేసుకోకూడదని.. తక్కువగా వేసుకోవడం వల్ల సహజంగా అందంగా కనిపిస్తామని తెలిపింది శోభిత. అందుకే ఆమె ఎక్కువ మేకప్ వేసుకోదట. లిప్​బామ్​ని రెగ్యూలర్​గా ఉపయోగిస్తుందట. టింట్ లిప్​బామ్​ని పెదాలకు అప్లై చేసి.. దానినే బుగ్గలకు, రెప్పలపై అప్లై చేస్తే మంచి లుక్​ వస్తుందంటూ ట్రిక్ చెప్పింది శోభిత. అలాగే మేకప్ తక్కువగా వేసుకుంటే స్కిన్ పాడవకుండా ఉంటుందని చెప్పుకొచ్చింది. 


స్కిన్​కేర్ టిప్స్


స్కిన్​ కేర్ విషయానికొస్తే తాను ఎక్కువ కెమికల్స్ జోలికి వెళ్లకుండా పచ్చిపాలను పలు రకాలుగా ఉపయోగించి.. ఇంట్లోనే స్కిన్​కేర్ తీసుకుంటానని తెలిపింది. ఒంటరిగా ఎక్కువగా ఉండడం వల్ల ఇంటిచిట్కాలతోనే స్కిన్​ని కాపాడుకుంటానని తెలిపింది. పచ్చిపాలను క్లెన్సర్​గా ఉపయోగిస్తానని.. ఇది డెడ్​ సెల్స్​ని దూరం చేసి.. ముఖాన్ని కాపాడడమే కాకుండా వృద్ధాప్యఛాయలు దూరం చేయడంలో హెల్ప్ చేస్తుందని తెలిపింది. 


పాలల్లో బియ్యం పిండి కలిపి దానిని ఎక్స్​ఫోలియేటర్​గా ఉపయోగిస్తుందట. దీనిలోని యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు.. యూవీ కిరణాల ఎఫెక్ట్ పడకుండా స్కిన్​ని రక్షించి.. స్కిన్​ టోన్​ని మెరుగుపరుస్తాయట. వారానికి రెండుసార్లు ఇది ఫాలో అవుతుందట.


ఫేస్ మాస్క్


గంధం పొడి, ముల్తాని మట్టి, పాలను కలిపి ఫేస్​ ప్యాక్​గా చేసి.. దానిని ముఖానికి అప్లై చేసి పావుగంట ఉంచుతుందట. దీనివల్ల పింపుల్స్ రాకుండా.. అలెర్జీలు రాకుండా ఉంటాయట. అలాగే ఈ ప్యాక్ హైపర్ పిగ్మంటేషన్​ను పోగొట్టి.. ఫ్రెష్​ ఫీల్​ని​ ఇస్తుందని తెలిపింది శోభిత. సన్​స్క్రీన్ కచ్చితంగా ఉపయోగిస్తుంది శోభిత. 


డస్కీ స్కిన్ గురించి.. 


గతంలో తన స్కిన్ టోన్ గురించి రిజెక్ట్ చేసేవారని శోభిత తెలిపింది. అయితే కాన్ఫిడెన్స్ అంటూ లేకుంటే.. ఎన్ని సర్జరీలు చేయించుకున్నా.. ఎంత అందంగా, తెల్లగా ఉన్నా వేస్టేనని తెలిపింది శోభిత. కాబట్టి తమకున్న స్కిన్​ టోన్​, లుక్​ని ఎప్పుడూ తక్కువగా చూడకుండా కాన్ఫిడెంట్​గా ఉండాలని చెప్పింది. 



జుట్టు విషయంలో.. 


శోభిత జుట్టు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కేవలం కొబ్బరి నూనెను అప్లై చేస్తానని తెలిపింది. షూటింగ్స్ లేకుంటే.. ఇంట్లోనే తలకు ఫుల్​గా నూనె పెట్టుకుంటానని.. ఇదే తన హెయిర్​ని కాపాడుతుందని తెలిపింది ఈ బోల్డ్ బేబి. 


వ్యాయామం


శోభిత మోడలింగ్ చేసే సమయంలో వ్యాయమం చేసేదట. అయితే తాను పెద్దగా జిమ్​కి వెళ్లనని చెప్పింది. యోగా చేస్తుందట. అలాగే డ్యాన్స్ ఎక్కువగా చేస్తానని.. ఇది తనని యాక్టివ్​గా, హెల్తీగా ఉంచుతుందని తెలిపింది. 


వారితో ఉంటే చాలు.. 


మనం ఎలా ఉన్నా జడ్జ్ చేయనివాళ్లు మనతో ఉంటే మనం బాగోలేమనే ఆలోచన రానే రాదంటుంది శోభిత. మనల్ని మనలా ఉండనిచ్చేవాళ్లు ఉంటే.. స్కిన్ తెలియకుండానే మంచి గ్లో అవుతుందంటూ మనసులో మాట బయటపెట్టింది శోభిత. 



Also Read : మగవాళ్లు జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని సప్లిమెంట్స్ కచ్చితంగా తీసుకోవాలట.. అవేంటంటే