High Blood Pressure Diet : బీపీ ఉంటే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డైట్​ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారు కొన్ని ఫుడ్స్​ జోలికి అస్సలు వెళ్లొద్దు అంటున్నారు నిపుణులు. అవి టేస్ట్​తో పాటు గుండె సమస్యలన్ని పెంచి పరిస్థితిని తీవ్రం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే అస్సలు తినకూడని పదార్థాలు ఏంటో.. తినాల్సిన ఫుడ్​ ఏంటో.. అవి బీపీని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చూసేద్దాం. 


చాట్ మసాల


బీపీ ఎక్కువగా ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాల్లో చాట్ మసాల ఒకటి. ఇది మీరు తినే ఫుడ్ రుచిని పెంచినా.. దీనిలో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఉప్పులోని సోడియం మీ కిడ్నీలను నెగిటివ్​గా ఇంపాక్ట్ చేస్తుంది. శరీరంలోని నీటిని నిలిచిపోయేలా చేసి.. బీపీని పెంచుతుంది. మూత్రపిండాలు, గుండె, మెదడుపై ప్రెజర్​ని పెంచుతుంది. 


పచ్చళ్లు


చాలామంది పచ్చళ్లను ఇష్టంగా తింటారు. కూర ఉన్నా.. సరే పచ్చడి వేసుకుని ఓ ముద్ద అయినా తింటారు. అయితే మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే కచ్చితంగా పచ్చడిని తినడం ఆపేయండి. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలని ఎక్కువ మొత్తంలో ఉప్పు వేస్తారు. దీనివల్ల ఎంతకాలమైన పచ్చడి తినడానికి రుచిగా ఉంటుంది. హై బీపీ ఉన్నవారు పచ్చడి ఎక్కువగా తింటే కిడ్నీలపై నెగిటివ్ ప్రభావం వస్తుంది. 


రెడ్ మీట్ 


మీకు రెడ్ మీట్ ఇష్టమా? వీలైనంత త్వరగా దానిని తినడం మానేయండి. చాలామంది గొర్రె, ఆవు, పోర్క్, మటన్​ను తింటారు. వాటివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రెగ్యులర్​గా తింటే గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. బీపీ పెరిగి.. హార్ట్ వాల్స్​ని దెబ్బతీస్తుంది. హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తీవ్రంగా పెరుగుతాయి. 


నట్స్


నట్స్ తింటే ఆరోగ్యానికి చాలామంచిది. కానీ కొందరు సాల్టెడ్ నట్స్​ని తింటారు. బాదం, హాజల్​నెట్​, వాల్​నట్​ వంటివాటిని సాల్టెడ్​గా కాకుండా నార్మల్​గా తీసుకుంటే మంచిది. 


ఫ్రోజెన్ ఫుడ్స్


చాలామంది ఫ్రోజెన్ చేసిన ఫుడ్​ని ఇష్టంగానూ.. రెగ్యులర్​గానూ తింటూ ఉంటారు. వీటితోపాటు క్యాన్డ్ ఫుడ్స్ కూడా బాగా తింటారు. ఇవి ఈజీగా అందుబాటులో ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యాన్ని నెగిటివ్​గా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మీరు హై బీపీతో ఇబ్బంది పడుతుంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. నగ్గెట్స్, గ్రీన్ పీస్, ఫ్రోజెన్ చికెన్ ఇలాంటివాటిని ప్రాసెస్ చేసే సమయంలో ఎక్కువ శాతం ఉప్పు వేస్తారు. దీనివల్ల వాటి లైఫ్​టైమ్ పెరుగుతుంది. కానీ బీపీ ఉన్నవారు ఈ ఉప్పు తింటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయి. 


మరి ఏ ఫుడ్స్ తినొచ్చంటే.. 


బీపీ ఉన్నవారు కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండడమే కాదు.. కొన్ని ఫుడ్స్​ని రెగ్యులర్​గా తీసుకుంటే మంచిది. ఇవి బీపీని కంట్రోల్ చేయడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. అలాంటి వాటిలో పచ్చిమిర్చి ఒకటి. వీటిలో పొటాషియం, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి హార్ట్​ రేట్​ని కంట్రోల్​లో ఉంచి.. బీపిని తగ్గిస్తాయి. 



ఆకు కూరల్లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును సమతుల్యం చేస్తాయి. పండ్లు రోజూ తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని ఫైబర్, బీటాకెరోటిన్ గుండె సమస్యలను దూరం చేయడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి వీటిని మీ డైట్​లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు వైద్యుల సలహాలు తీసుకుని డైట్ ప్లాన్ చేసుకుంటే మరీ మంచిది. 


Also Read : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట