Horoscope Today 23rd December 2024
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు డబ్బు సమస్యలు రావచ్చు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. కార్యాలయంలో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మపరిశీలనలో సమయాన్ని వెచ్చించండి.
వృషభ రాశి
వృషభ రాశి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో అనవసరమైన వ్యక్తులను కలవవలసి ఉంటుంది .
మిథున రాశి
మిథున రాశివారు ఈ రోజు కొందరికి ప్రేరణగా కనిపిస్తారు. ఉద్యోగం మారాలి అనుకుంటారు. పాత ఆలోచనలు వదిలేసి కొత్త ఆలోచనలు అలవర్చుకోండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Also Read: 2025 లో సూర్యగ్రహణం రోజే శని సంచారంలో మార్పు.. ఈ 3 రాశులవారికి అదృష్టం మామూలుగా ఉండదు!
కర్కాటక రాశి
భాగస్వామ్య పనులకు సమయం మంచిది. కార్పోరేట్ కంపెనీలలో పనిచేసే వ్యక్తులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ పని తీరు మెరుగుపడుతుంది. మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.
సింహ రాశి
ఈ రోజు మీరు డైలమాలో ఉంటారు. బాధ్యతల నుంచి పారిపోవద్దు. కుటుంబ విషయాలలో బయటి వ్యక్తుల అభిప్రాయం తీసుకోకండి. విద్యార్థులు ఓర్పుతో, విచక్షణతో ఉండడం చాలా ముఖ్యం. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
కన్యా రాశి
ఈ రోజు మీకు ఆర్థిక సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారం , వృత్తిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితికి సంబంధించి స్థిరత్వం ఉంటుంది. మీరు పై అధికారుల నుంచి మద్దతు పొందవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ నైపుణ్యంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు.
తులా రాశి
తులారాశి వారి జీవనశైలి మెరుగుపడుతుంది. ఏకాగ్రతతో శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయత పెరుగుతుంది. మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని పొందవచ్చు. సహోద్యోగి తప్పు చేసి ఉంటే, దానిని విస్మరించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో తమ సంబంధాన్ని మెరుగుపర్చుకుంటారు. మనసుపై ఉన్న భారం తొలగిపోతుంది. సాయంత్రం పూట అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఇంటర్వ్యూకి కాల్ రావచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోండి
ధనుస్సు రాశి
మీ జీవిత భాగస్వామి సలహాతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల చదువులో మంచి ఫలితాలను చూస్తారు. వ్యాపారంలో క్రమేణా పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. వైవాహిక సంబంధాలలో చాలా తీవ్రత ఉంటుంది. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
Also Read: 2024 డిసెంబర్ 23 to 29 ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారఫలాలు!
మకర రాశి
మకర రాశి వారు ప్రమోషన్ గురించి భయపడతారు. ఏదైనా సమస్య గురించి స్నేహితులతో మాట్లాడటం వలన వారు మీ మనోధైర్యాన్ని పెంచుతారు. ఉద్యోగులపై ఒత్తిడి ఉండవచ్చు. ఈ రోజు మీరు నవలలు, కథలు మొదలైనవాటిని చదవడంపై శ్రద్ధ పెడతారు.
కుంభ రాశి
కుంభరాశి వ్యక్తుల పనితీరు మెరుగుపడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరు మీకు నచ్చిన ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మీ కోర్కె నెరవేరుతుంది. డబ్బు విషయంలో అదృష్టవంతులు అవుతారు. రిస్క్ తీసుకోకండి.
మీన రాశి
మీన రాశివారు ఏదో ఒక విషయంపై ఈ రోజు ఒత్తిడికి లోనవుతారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు సంబంధించి ఓ ప్రణాళిక వేసుకుంటారు. అనుకోని వాదనలు ఉంటాయి. మీలక్ష్యంపై మీరు దృష్టి సారించండి. ఆర్థకి లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం.
Also Read: కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2025 - శని నుంచి విముక్తి , ఆర్థిక వృద్ధి, మానసిక ఆనందం ఉంటుంది కానీ..!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.