Vrishchik Rashifal 2025: వృశ్చిక రాశి వార్షిక జాతకం 2025 ప్రకారం కొత్త ఏడాది మీకు శుభం జరుగుతుంది. ఏడాది ఆరంబంలో గురుడు ఏడవ స్థానంలో సంచరిస్తాడు. మే వరకూ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది..భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉండొచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఐశ్వర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రేమ సంబంధాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. 


Also Read: అదృష్టం - దురదృష్టం.. 2025లో తులా రాశి వారు ఏవైపు తూగుతున్నారు!


ఈ ఏడాది ఈ రాశివారు కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు  పొందుతారు. బృహస్పతి ఏడో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో ఆనందం ఉంటుంది. పెళ్లికానివారికి వివాహ సూచనలున్నాయి. అదగే సమయంలో శని ప్రభావంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శని ప్రభావం నుంచి విముక్తి పొందాక..మానసిక సంతోషం పెరుగుతుంది.  


మార్చి 2025 కి ముందు శని నాలుగో స్థానంలో సంచరించి ఆ తర్వాత ఐదో స్థానానికి మారుతాడు. ఫలితంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది.ఉద్యోగం మారుతారు లేదంటే ఉన్న ఉద్యోగంలోనే మంచి జీతం, ప్రమోషన్ పొందుతారు. 


2025మే లో రాహువు, కేతులు నాలుగు, పది స్థానాల్లో సంచరించడంతో మీ కెరీర్ పై ప్రభావం పడుతుంది. కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన ప్రతిపనిలోనూ చికాకులు తప్పవు..ఎంతో ఓపిగ్గా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి.  


Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!


ఆర్థిక పరంగా ఈ ఏడాది బాగానే ఉంటుంది. ఆశించిన సొమ్మును పొదుపు చేయడంలో సక్సెస్ అవుతారు. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. గురువు ఎనిమిదో స్థానంలో సంచరించే సమయంలో విదేశాల నుంచి అనుకోని ప్రయోజనాలు పొందుతారు. 


ఈ రాశి వ్యాపారులకు ఏడాది ఆరంభంలో అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి ఏడో స్థానంలో సంచరించే సమయంలో వ్యాపారంలో పురోగతి సాధిస్తారు...స్నేహితులు, సన్నిహితులు, సహచరుల నుంచి సానుకూల ఫలితాలు పొందుతారు. అయితే బృహస్పతి ఎనిమిదో స్థానంలో సంచరించే సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు.  


వృశ్చిక రాశివారికి నూతన సంవత్సరం ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలున్నాయి. శని ఎనిమిదో స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది. అధిక రక్తపోటు, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో మానసిక, శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గురుడు స్థానం మారే సమయంలో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.


Also Read: కన్యారాశి వారికి కొత్త సంవత్సరం 2025 ఎలా ఉంటుంది.. ఏ రంగాల్లో సక్సెస్ అవుతారో తెలుసా!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.