Just In
జూన్ 10, 2025 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి!
Horoscope for June 10th 2025 : మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం, ధనానికి సంబంధించి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోండి.
2025 జూన్ 10 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 10th 2025
మేష రాశి (Aries) జూన్ 10, 2025
ఆనందకరమైన జీవితం కోసం మీ మొండి వైఖరిని పక్కన పెట్టండి, ఎందుకంటే ఇది సమయాన్ని వృధా చేస్తుంది. ఇతరులను ఆకట్టుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. మీ కుటుంబ సభ్యులు చిన్న విషయాలపై కొండంత రాద్ధాంతం చేయవచ్చు.
వృషభ రాశి (Taurus) జూన్ 10, 2025
మీ రోజు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక సంబంధాలు మధురంగా ఉంటాయి. రోజువారీ పనుల వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచించవచ్చు. కొత్త పనులు చేసే అవకాశాలను పొందుతారు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
మిథున రాశి (Gemini) జూన్ 10, 2025
మీరు ఏదైనా కొత్త ప్రణాళికను ఈ రోజు అమలు చేయొచ్చు. విజయం తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఎవరితోనూ వాగ్వాదానికి దిగకపోవడం మంచిది. ఉద్యోగం-వ్యాపారంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
కర్కాటక రాశి (Cancer) జూన్ 10, 2025
రోజంతా బిజిగా గడిపేస్తారు. కొత్త బాధ్యతను స్వీకరించడానికి వెనుకాడతారు. మీ బాధ్యతలు పెరగుతాయి. కొన్ని ప్రత్యేక పనులు నిలిచిపోవచ్చు. మీ ప్రయత్నాలలో ఏదో లోపం ఉంటుంది గుర్తించండి.
సింహ రాశి (Leo) జూన్ 10, 2025
ఈ రోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో ఏదైనా కొత్తగా ట్రై చేస్తారు..చేపట్టిన పని నెమ్మదిగానైనా పూర్తవుతుంది. వ్యాపారుల అడుగు ముందుకు పడుతుంది. ఆరోగ్యం బావుంటుంది.
కన్యా రాశి (Virgo) జూన్ 10, 2025
భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రవర్తన చుట్టుపక్కల వారిని గందరగోళానికి గురి చేస్తుంది. మీరు తక్షణ ఫలితాలను కోరుకుంటే, నిరాశ మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి.
తులా రాశి (Libra) జూన్ 10, 2025
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అధిక ఏకాగ్రత కారణంగా మీరు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఏకపక్ష ఆలోచన మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio) జూన్ 10, 2025
విద్యార్థులు, కళాకారులు, క్రీడాకారులకు ఈ రోజు మంచిది. ప్రభుత్వం నుంచి ప్రయోజనం ఉంటుంది. మనోబలం దృఢంగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలున్నాయి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 10, 2025
మీ కెరీర్ చుట్టూ ముసురుకున్న చికాకు నుంచి బయటపడే సమయం వచ్చింది. పురోగతికి ఎదురైన ఆటంకం తొలగిపోతుంది. కొత్త ఆర్థిక ఒప్పందం ఖరారు అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ బాధ్యతల భారం పెరుగుతుంది.
మకర రాశి (Capricorn) జూన్ 10, 2025
ఈ రోజు మీకు మంచి ఫలితాలున్నాయి. ఏదైనా భిన్నమైన పని చేయకుండా ఉండాలి. సంతానంతో కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా విషయాన్ని చర్చలు , శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి.
కుంభ రాశి (Aquarius) జూన్ 10, 2025
రోజు ప్రశాంతంగా గడుస్తుంది. ప్రత్యేకమైన పని లేదా సవాలు ఉండదు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు సానుకూలంగా ఉండండి. మీరు ఆచరణాత్మకం కాని వాటిని లక్ష్యంగా చేసుకున్నారు..చాలా కష్టపడాల్సి వస్తుంది.
మీన రాశి (Pisces) జూన్ 10, 2025
ఈ రోజు చేసిన దానధర్మాలు మీకు మానసిక శాంతిని కలిగిస్తాయి. బ్యాంకు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాగ్వాదాలు కుటుంబ సభ్యులతో విభేదాలకు దారి తీస్తాయి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.