2025 జూన్ 9 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 9th 2025
మేష రాశి (Aries) జూన్ 9, 2025
ఈ రోజు ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. కుటుంబ సభ్యులు , స్నేహితులతో సరదా సమయం స్పెండ్ చేస్తారు. ప్రేమలో ఉన్నవారు, వివాహితులకు సంతోష సమయం. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. సోదరుల సలహా, సూచనలు అవసరమయ్యేలా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృషభ రాశి (Taurus) జూన్ 9, 2025
ఈ రోజు మీ పురోగతి పెరుగుతుంది. మీలో అదనపు శక్తితో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కోపంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మీరు ఈ విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఉద్యోగంలో ఏదైనా సమస్య వస్తే, మీరు దాని నుంచి బయటపడతారు. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందవచ్చు, దీనివల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది.
మిథున రాశి (Gemini) జూన్ 9, 2025
ఈ రోజు మీకు కొంత ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. పిల్లల కెరీర్ గురించి కొంచెం ఆందోళన చెందుతారు. పని రంగంలో మీపై పని భారం పెరగవచ్చు. మీ పనుల్లో మీరు నిర్లక్ష్యం చేయకూడదు, లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. స్నేహితుడిని చాలా కాలం తర్వాత కలుస్తారు. మీరు వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పెండింగ్‌లో ఉన్న ఒప్పందాన్ని ఖరారు చేస్తే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి (Cancer) జూన్ 9, 2025
ఈ రోజు మీకు సమస్యలతో నిండి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మాటతీరు మీకు నచ్చకపోవచ్చు. ఏదైనా శారీరక బాధ ఉంటే కొంత ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి మీ మనస్సులో ఆందోళన ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులను అరికట్టాలి. పిల్లలకు ఏదైనా బహుమతి లభించడం వల్ల కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
సింహ రాశి (Leo) జూన్ 9, 2025
ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. పని ప్రదేశంలో ఓ సంఘటన వల్ల మీ గౌరవానికి భంగం కలుగుతుంది. వ్యాపారం చేసే వారికి రోజు బాగుంటుంది. కష్టపడితేనే ఫలితం సాధించగలరు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు మీరు ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేయాలనే కోరిక నెరవేర్చుకుంటారు.
కన్యా రాశి (Virgo) జూన్ 9, 2025
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. పెండింగ్‌లో ఉన్న పనుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. పాత స్నేహితులను కలుస్తారు. పనిచేసే ప్రదేశంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేయవచ్చు. రోజంతా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల పనులపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు..ఫలితంగా సమస్యలు పెరుగుతాయి. గతంలో తీసుకున్న మీ నిర్ణయం గురించి మీరు చింతిస్తారు.
తులా రాశి (Libra) జూన్ 9, 2025
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. గృహ జీవితం గడుపుతున్న వారికి సంతోషంగా ఉంటుంది.వాహనాన్ని వేగంగా నడపొద్దు...ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరగొచ్చు. ఆరోగ్యం బావుంటుంది.
వృశ్చిక రాశి (Scorpio) జూన్ 9, 2025
ఈ రోజు మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు ఈ మంచిది. భాగస్వామ్యంలో ఏదైనా పనిని ప్రారంభిస్తే సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లల వివాహంలో ఏదైనా ఆటంకం వస్తే బంధువులతో చర్చలుంటాయి. మీరు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు.
ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 9 June 2025
ఈ రోజు మీకు ఆనందం పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మంచిది. జీవిత భాగస్వామితో మీరు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే ఆలోచన చేస్తారు మరియు వారితో జరుగుతున్న వివాదాలను ముగించండి. మీరు మీ పాత స్నేహితుడిని చాలా కాలం తర్వాత కలుస్తారు, దీని కోసం మీరు ఎదురు చూస్తున్నారు, మీరు ఏదైనా పథకం నుంచి పూర్తి ప్రయోజనం పొందవచ్చు.
మకర రాశి (Capricorn) జూన్ 9, 2025
గడిచిన రోజు కన్నా ఈ రోజు బావుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీరు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. ఈ రోజు పని ప్రదేశంలో మిమ్మల్ని ప్రోత్సహించేవారి సంఖ్య పెరుగుతుంది. చిన్న విషయానికి ఒత్తిడికి గురవుతారు. మీరు చేసిన ఓ తప్పు కుటుంబ సభ్యుల ముందుకి రావొచ్చు.
కుంభ రాశి (Aquarius) జూన్ 9, 2025
వ్యాపారం చేస్తున్న వారికి కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని పనులకు సహచరుల నుంచి ఆటంకం ఉంటుంది.అనుకోని అతిథులు రావొచ్చు. రోజంతా ఆనందంగా ఉంటారు. సోదరులు, సోదరీమణుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. పాత స్నేహితుడిని కలుస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం సంతోషాన్నిస్తుంది.
మీన రాశి (Pisces) జూన్ 9, 2025
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారు మంచి లాభం పొందవచ్చు. మీ శక్తిని మంచి పనులకు ఉపయోగించండి. సమయాన్ని వృధా చేయవద్దు. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దవారిలో వాగ్వాదానికి దిగొద్దు. మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.