Horoscope Today 06th January  2024  - జనవరి 06 రాశిఫలాలు


మేష రాశి (Aries Horoscope Today) 


ఉద్యోగం కోసం వెతుకుతున్నవారి ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. చెవి, ముక్కు, గొంతుకి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఆహారంపై శ్రద్ధ వహించండి. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. 


వృషభ రాశి (Taurus  Horoscope Today)


ఈ రోజు మీరు ఏ పని ప్రారంభించినా పూర్తి శ్రద్ధతో పూర్తిచేయండి. పనిపట్ల అంకితభావం కనబర్చండి.  వ్యాపారులు నూతన ప్రణాళికలు అమలు చేయొచ్చు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు కలిసొస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.


మిథున రాశి (Gemini Horoscope Today) 


ఈ రోజు సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఏ పనిలోనూ రిస్క్ తీసుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు..ఇది మిమ్మల్ని తప్పుదార్లోకి తీసుకెళుతుంది. మీ మనస్సాక్షిని నమ్మనండి.  భవిష్యత్ పెట్టుబడులపై దృష్టి పెట్టండి. మీ కోసం లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీరు డబ్బుకు సంబంధించిన నిర్ణయాల గురించి గందరగోళంగా ఉంటే ఆర్థిక సలహాదారు నుంచి సలహాలను తీసుకోవడానికి ఆలోచించవద్దు.


Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  


ఈ రాశివారు ఒత్తిడి తగ్గించుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. కుటుంబానికి కేటాయించే సమయం పెరిగే కొద్దీ మీకు ప్రశాంతత లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారు మీ భావాలను వ్యక్తం చేసేందుకు ఈ రోజు మంచి రోజు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సాధారణ ఫలితాలున్నాయి. 


సింహ రాశి (Leo Horoscope Today)


కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి కొత్త సవాళ్లను స్వీకరించార్సిన రోజు ఇది. రిస్క్ తీసుకోవడానికి , మీ లక్ష్యాలను సాధించడానికి  వెనకడుగు వేయకండి.  మీరు చెప్పాలి అనుకున్న విషయం కాన్ఫిడెంట్ గా కమ్యూనికేట్ చేయండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ మనసు చెప్పిందే వినండి. ఆర్థికపరిస్థితి బావుంటుంది. 


కన్యా రాశి  (Virgo Horoscope Today) 


ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. నూతన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో సానుకూల ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు సమయం అనుకూలం. ఉద్యోగులు కొత్త బాధ్యతలు పొందుతారు కానీ కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. 


Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 


తులా రాశి (Libra Horoscope Today) 


మీ భాగస్వామితో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వృత్తిపరంగా వ్యవహరించండి. కార్యాలయంలో సవాళ్లను స్వీకరించంండి..మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ప్రయత్నించండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నచ్చని వ్యక్తులతో కలసి పని చేయాల్సిన అవసరం రావొచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. 


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 


ఆర్థిక విషయాలలో కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఇది ఉత్తమ సమయం. అందుకే డబ్బుకి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకునేందుకు భయపడొద్దు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇదే మంచి సమయం. ఖర్చులు పెట్టేముందు మీ ఆదాయన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. మీ జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. 


Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 


ప్రేమ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది మంచి సమయం. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో పుంజుకుంటారు...గతంలో పెట్టిన పెట్టుబడలులకు సంబంధించి ఇప్పుడు లాభాలొస్తాయి. ఉద్యోగులు, విద్యార్థులు మీ లక్ష్యాలపై దృష్టి సారించాలి. అనవసర ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. 


మకర రాశి (Capricorn Horoscope Today) 


జీవితంలో కొత్త సవాళ్లు అంగీకరించడానికి మంచి సమయం. మీరు కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలనుకుంటే లేదా మీ జీవితంలో కొత్తదాన్ని ప్రారంభించాలనుకుంటే ఇదే రైట్ టైమ్. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు పొందుతారు. 


కుంభ రాశి  (Aquarius Horoscope Today) 


ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఆర్థిక పరిస్థితి కొంత కాలం తర్వాత నెమ్మదిగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొన్ని  సృజనాత్మక ప్రాజెక్ట్‌లను చేపట్టడానికి సహోద్యోగులతో సమన్వయాన్ని కొనసాగించండి. ఈ రోజు మీరు మీ భాగస్వామి నుంచి సహాయం అందుకుంటారు. 


Also Read: ధనస్సులోకి శుక్రుడు, 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!


మీన రాశి (Pisces Horoscope Today) 


ఆరోగ్యం బాగుంటుంది. మీరు చాలా చురుకుగా ఉంటారు.  సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగం మారే సూచనలున్నాయి. నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చేయకపోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అభిప్రాయబేధాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అవే గాలివానగా మారుతాయి. జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి.


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.