ISRO Space Applications Centre Recruitment: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఆధ్వర్యంలోని 'స్పేస్ అప్లికేషన్ సెంటర్-అహ్మదాబాద్' ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో ఇంజినీర్/ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 


వివరాలు..


1) సైంటిస్ట్/ఇంజినీర్-SC: 08 పోస్టులు


విభాగం: అగ్రికల్చర్.


అర్హత: కనీసం 65 శాతం మార్కులతో ఎంఎస్సీ (అగ్రికల్చరల్ ఫిజిక్స్/ అగ్రికల్చరల్ మెటియోరాలజీ/ఆగ్రోనమీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 15.01.2024 నాటికి 18 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


2) సైంటిస్ట్/ఇంజినీర్-SC: 08 పోస్టులు 


విభాగం: అట్మాస్పియరిక్ సైన్సెస్, ఓషనోగ్రఫీ.


అర్హత: కనీసం 65 శాతం మార్కులతో ఎంఎస్సీ (ఫిజిక్స్/అట్మాస్పియరిక్ సైన్సెస్/మెటియోరాలజీ/ఓషన్ సైన్సెస్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 15.01.2024 నాటికి 18 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


3) సైంటిస్ట్/ఇంజినీర్-SC: 03 పోస్టులు


విభాగం: కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్.


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్). ఇమేజ్ ప్రాసెసింగ్/ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెకానిక్ లెర్నింగ్/కంప్యూటర్ విజన్ విభాగాల్లో స్పెషలైజేషన్ ఉండాలి. అయితే అంతకు ముందు 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 15.01.2024 నాటికి 18 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.750. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఫీజు మినహాయింపు కేటగిరీ కింద ఉన్నవారికి పరీక్ష సమయంలో మొత్తం ఫీజు రీఫండ్ అవుతుంది. ఇతరులకు రూ.500 తిరిగి చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.01.2024.


Notification


Online Application


Website



ALSO READ:


విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో 30 పీవో పోస్టులు, ఎంపిక ఇలా
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(VCBL), వివిధ బ్రాంచీల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 60 పీవో పోస్టులను భర్తీచేయనున్నారు.  కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 28 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ/ మెయిన్ పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ రాతపరీక్ష,  250 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కాకినాడ, తిరుపతిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...