SSC JE Final Results: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) జనవరి 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో మొత్తం 1374 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్-639, ఓబీసీ-298, ఎస్సీ-210, ఎస్టీ-98, ఈడబ్ల్యూఎస్-129 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది.
జూనియర్ ఇంజినీర్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
కటాఫ్ మార్కులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొదట 1324 పోస్టులకు నోటిఫికేషన్ జారీకాగా.. తర్వాత 50 పోస్టులను జతచేసింది. దీంతో పోస్టుల సంఖ్య 1374కి చేరింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులు భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పేపర్-1 పరీక్షలు అక్టోబర్ 9 నుంచి 11వ తేదీల్లో; పేపర్-2 పరీక్ష డిసెంబర్ 4న నిర్వహించారు. పేపర్-1, పేపర్-2 రాతపరీక్షల్లో అర్హత సాధించినవారికి డిసెంబరు 20 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా తుది ఎంపిక ఫలితాలను విడుదల చేసింది.
❂ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2023
ఖాళీల సంఖ్య: 1374
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్
విభాగాలవారీగా పోస్టులు:
విభాగం | పోస్టులు | పోస్టుల సంఖ్య |
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ | జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) | 486 |
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ | జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్) | 545 |
సెంట్రల్ వాటర్ కమిషన్ | జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్) | 211 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్‌మెంట్ & గంగా రెజువెనేషన్ | జూనియర్ ఇంజినీర్ (సివిల్) | 50 |
ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్ట్ | జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) | 21 |
మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్) | జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) | 47 |
నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ | జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) | 06 |
మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్‌వేస్ (అండమాన్ లక్షద్వీప్ హార్బర్ వర్క్స్) | జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) | 08 |
పరీక్ష విధానం ఇలా..
✦ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు.
✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.
✦ పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఇంటెలిజన్స్ & రీజనింగ్ విభాగం నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్) నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 2 గంటలు (ప్రత్యేక అవసరాలుగలవారికి 2 గంటల 40 నిమిషాలు). పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. పేపర్-1లో అర్హత సాధించినవారికి పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చరల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ఈ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
జేఈ పోస్టుల నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..