Auto Updates: దేశీయ కార్ల మార్కెట్లో మారుతి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మారుతికి సంబంధించిన చాలా కార్ల విషయంలో సేఫ్టీ పరమైన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు మారుతి కారును కొనుగోలు చేయాలి అనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
మారుతీ సుజుకి స్విఫ్ట్
మారుతి లాంచ్ చేసిన ఈ హ్యాచ్‌బ్యాక్ 2023లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. దీని సేఫ్టీ రేటింగ్ గురించి చెప్పాలంటే గ్లోబల్ NCAPలో దీనికి సింగిల్ స్టార్ రేటింగ్ మాత్రమే దక్కింది. సేఫ్టీ పరంగా ఇది చాలా తక్కువ. అయినప్పటికీ 2023లో దీనికి సంబంధించి 2,03,469 యూనిట్లు అమ్ముడుపోయాయి.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
దేశీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ పేరు కూడా ఉంది. భద్రతా రేటింగ్ పరంగా ఈ పాపులర్ కారు కూడా అద్భుతాలు చేయలేకపోయింది. క్రాష్ టెస్ట్‌లో కేవలం సింగిల్ స్టార్ రేటింగ్ మాత్రమే సాధించింది. కానీ మార్కెట్‌లో మాత్రం గతేడాది ఈ కారు 2,01,302 యూనిట్లు అమ్ముడుపోయాయి.
మారుతి సుజుకి ఆల్టో కే10
గతేడాది 1,27,169 యూనిట్ల విక్రయాలతో ఆల్టో కే10 తర్వాతి స్థానంలో ఉంది. ఈ కారు సెక్యూరిటీ రేటింగ్ గురించి చెప్పాలంటే పెద్దల భద్రతలో దీనికి రెండు స్టార్ల రేటింగ్, పిల్లల భద్రత రేటింగ్‌లో 0 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
అద్భుతమైన బ్రాండ్ విలువ
ఇప్పుడు భారతదేశంలో మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలే ఇందుకు కారణం. మనం జాగ్రత్తగా వెళ్లినా ఏ సమయంలో ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేం. అందుకే ప్రజలు సేఫ్టీ పరంగా మంచి రేటింగ్ ఉన్న కారును కోరుకుంటున్నారు. అయితే మారుతి సుజుకి వాహనాలపై వినియోగదారులకు ఉన్న నమ్మకం కారణంగా ఇది వినియోగదారులకు మొదటి ఆప్షన్‌గా మారింది. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి వాహనాలకు పోటీగా హ్యుందాయ్, మహీంద్రా, టాటా వంటి కంపెనీల వాహనాలు ఉన్నాయి.
మరోవైపు చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ ఆటోమేకర్ల జాబితాలో చేరాలనే ఆకాంక్షను కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. షావోమీ ఎస్‌యూ7 అనే పేరున్న సెడాన్ కారును తీసుకువచ్చింది. షావోమీ ఎస్‌యూ7 సెడాన్ కారు కంపెనీ తీసుకువస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మోడల్. అత్యంత ప్రజాదరణ పొందిన షావోమీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ కారులో ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల ధరల విషయంలో షావోమీ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. మరి కార్ల విషయంలో కంపెనీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!