Ayodhya Ram Mandir :  రామ జన్మభూమి అయోధ్యలో  శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న జరగబోతున్నప్పటికీ వారం ముందునుంచే సందడి మొదలుకానుంది. ఇందులో భాగంగా విగ్రహ పత్రిష్టాపనకు మూడు రోజుల ముందు ప్రపంచంలోనే అతిపెద్ద దీపం అయోధ్యలో వెలిగించనున్నారు....


Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 
 
రూ.7 కోట్ల బడ్జెట్
28 మీటర్ల పొడవు - వెడల్పు ఉన్న ఈ దీపాన్ని వెలిగించేందుకు 21 క్వింటాళ్ళ నూనె అవసరమవుతోంది. ఈ దీపం ఘనతను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రతువుకు దశరథ్ దీప్‌గా నామకరణం చేసిన ఆలయ ట్రస్ట్, దీపపాత్ర తయారీకి 100 పుణ్యక్షేత్రాల్లోని మట్టితో పాటు నదులు, సముద్రాల నుంచి పుణ్య జలాలు సేకరించారు. పాకిస్థాన్‌కు చెందిన హీంగ్లాజ్ నుంచి, నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి కూడా మట్టిని తెప్పించారు. పురాణాలను అధ్యయనం చేసి...త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తోన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమిద తయారీ కోసం 108 మంది కళాకారులు శ్రమిస్తుండగా...7 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. దీపం వత్తి తయారీకి 1.25 క్వింటాళ్ళ పత్తిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీపం తయారీకి వినియోగించే అధునాతన యంత్రం కోల్‌కతా నుంచి తెప్పించారు.


Also Read: అయోధ్య 'రామయ్య' విగ్రహం ఇదే - 'రామ్ లల్లా'ను చెక్కిన శిల్పి ఎవరో తెలుసా.?


తులసివాడి
త్రేతాయుగంలో శ్రీరాముడు తన కుటుంబంతో కలిసి తులసివాడిలో పూజలు చేసేవాడని చెబుతారు. సరయూ ఒడ్డున స్నానమాచరించి ఆ తర్వాత తులసివాడిలో పూజలు నిర్వహించేవాడు. అందుకే ఆ ప్రదేశాన్ని రామ్ ఘాట్ అని అంటారు. ప్రభుత్వ పత్రాల్లో కూడా ఈ పేరుతోనే ఉంది. ఈ ప్రదేశంలోనే అతిపెద్ద దీపాన్ని వెలిగించనున్నారు...


Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!


జనవరి 16 నుంచి 22 వరకూ అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ పూర్తి షెడ్యూల్‌ ఇదే



  • జనవరి 15 మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది

  • జనవరి 16 శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు మొదలవుతాయి

  • జనవరి 17 విగ్రహాల ఊరేగింపుతో పాటూ సరయు నదినుంచి నీటిని కలశాలతో తీసుకెళ్తారు

  • జనవరి 18 మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, విఘ్నహర్త గణేశ పూజ, మార్తిక పూజ వంటి ఆచారాలతో పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది.

  • జనవరి 19 రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది

  • జనవరి 20 వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో రామమందిరం గర్భగుడిని పవిత్రం చేస్తారు..వాస్తు శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు

  • జనవరి 21 యజ్ఞం సందర్భంగా.. ప్రత్యేక పూజలు హవనాల మధ్య శ్రీరామ చంద్రుడికి 125 కలశాలతో దివ్య స్నానం

  • జనవరి 22 ప్రధాన ఘట్టమైన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు

  • ప్రాణ ప్రతిష్ఠా ముహూర్తం - జనవరి 22 మధ్యాహ్నం  12:29 నుంచి  12:30:32 PM వరకు...