Venus Transit in Sagittarius 2024: జనవరి 19న శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. 2023 డిసెంబరు 25 నుంచి వృశ్చిరాశిలో ఉన్న శుక్రుడు 2024 జనవరి 19న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు.  ఫిబ్రవరి 12 వరకూ శుక్రుడు ఇదే రాశిలో సంచరిస్తాడు.  ధనస్సులో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. కొన్ని రాశులవారి జీవితాల్లో పెద్ద కుదుపు వచ్చే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకూ ...శుక్ర సంచారం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకోండి.


మేష రాశి
ధనస్సు రాశిలో శుక్రుడి సంచారం సమయంలో ఈ రాశివారు ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ ప్లేస్ మారాల్సి రావొచ్చు. వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంలో స్నేహితుల నుంచి సహకారం అందుతుంది


వృషభ రాశి
కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి దారులు సుగమం అవుతాయి. మీరు అధికారుల నుంచి మద్దతు పొందుతారు.  ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.


Also Read: ఈ రాశులవారిపై దేవగురువు అనుగ్రహం, అప్పులుండవ్ ఇక ఆదాయమే!


మిథున రాశి
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. మతపరమైన కార్యక్రమాలలో బిజీగా ఉండవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. వాహన నిర్వహణ, వస్త్రధారణ తదితర ఖర్చులు పెరగవచ్చు 


కర్కాటక రాశి
శుక్రుడు ధనస్సు రాశిలో సంచరించే సమయంలో ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది. మార్చి 18 నుంచి కొంత ప్రశాంతత రావొచ్చు.  కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులుకు శుభసమయం. 


సింహ రాశి
శుక్రుడి సంచారం సింహరాశివారికి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. రాజకీయ నాయకుడిని కలుస్తారు. స్నేహితులతో కలసి పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 


Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!


కన్యా రాశి 
మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు కూడా అవకాశాలు ఉండవచ్చు. పని పరిధి పెరుగుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి.


తులా రాశి 
శుక్ర సంచారం సమయంలో మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఉన్నత విద్య లేదా విద్యా పని కోసం వేరే ప్రదేశానికి వెళ్లవచ్చు. కుటుంబం నుంచి అవసరమైన సమయంలో మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. పనిలో పెరుగుదల ఉండవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది.


Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 


వృశ్చిక రాశి
ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. పని పరిధి పెరుగుతుంది కానీ మీరు కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. విద్యార్థులు చదువునుంచి ఇతర విషయాలవైపు మళ్లే ప్రమాదం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.


ధనుస్సు  రాశి
ఈ రాశివారికి శుక్రుడి సంచారం సమయంలో ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. తోబుట్టువుల నుంచి సహకారం పొందుతారు. మేధోపరమైన పనిలో బిజీగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయ వనరులు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.


మకర రాశి
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు కలిసొచ్చే సమయం ఇది కానీ పని పెరుగుతుంది, కార్యాలయంలో మార్పు ఉండవచ్చు. ఆస్తి ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


కుంభ రాశి
కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ ఆదాయం కూడా పెరుగుతుంది. 


మీన రాశి
కుటుంబ సమస్యల పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో సంతోషం తగ్గుతుంది. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంటుంది. ఆదాయంతో పాటూ ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి. ధనస్సు రాశిలో శుక్రుడి సంచారం మీకు అంతగా కలసిరాదు..చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.


Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోవాలి అనుకుంటారెందుకు!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.