Upcoming Hero Motocorp Bike: హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 స్ఫూర్తితో తయారు కానున్న బైక్ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీ పడేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమవుతోంది. అయితే త్వరలో విడుదల కాబోతున్న ఈ హీరో బైక్ అధికారిక పేరు, వివరాలు తెలియరాలేదు. కంపెనీ ఇప్పటికే 'హరికేన్', 'హరికేన్ 440', 'హీరో నైట్‌స్టర్ 440' వంటి పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. వీటిలో హార్లే డేవిడ్‌సన్ X440 ఆధారిత మోటార్‌సైకిల్ 2024 జనవరి చివరిలో జరిగే హీరో వరల్డ్ ఈవెంట్‌లో తొలిసారిగా విడుదల కానుంది.
ఫీచర్లు ఇలా...
దీని ఇంజిన్ అదే ప్లాట్‌ఫారమ్‌లో రూపొందిన దాని ట్రాన్స్‌మిషన్ ఎక్స్440 మాదిరిగానే ఉండవచ్చు. ఎక్స్440 కాకుండా హీరో కొత్త బైక్ ప్రత్యేక డిజైన్‌తో వస్తుంది. ఇది రెట్రో థీమ్ సర్క్యులర్ హెడ్‌ల్యాంప్‌లు, బార్ ఎండ్ మిర్రర్స్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, వెడల్పాటి హ్యాండిల్‌బార్లు, స్పోర్టీ ఎగ్జాస్ట్ పైపులు, ఎక్స్440 వంటి వృత్తాకార ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చని భావిస్తున్నారు.
ధర ఎంత ఉండవచ్చు?
త్వరలో రానున్న హీరో మోటార్‌సైకిల్ అంచనా ధర దాదాపు రూ. రెండు లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా. అధికారికంగా లాంచ్ అయిన తర్వాత ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీతో పాటు ట్రయంఫ్ స్పీడ్ 400, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400ఎక్స్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
హీరో ప్లాన్ ఏంటి?
హీరో మోటోకార్ప్ తన రాబోయే ప్రీమియం మోటార్‌సైకిళ్లను వ్యూహాత్మకంగా రెండు విభాగాలుగా విభజించింది. అవే కోర్ ప్రీమియం, అప్పర్ ప్రీమియం. ప్రీమియం రేంజ్‌లోని హీరో 440 బైక్ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా కంపెనీ స్ట్రాటజీలో సులభంగా ఫిక్స్ అవుతుంది. ఈ కొత్త లైనప్‌తో హీరో మోటోకార్ప్ పోటీ ఎక్కువగా ఉన్న భారత మార్కెట్లో దూకుడును ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది.
గతేడాది జూలైలో హార్లే డేవిడ్సన్ అత్యంత సరసమైన బైక్ హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440ని లాంచ్ చేసింది. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బైక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది హార్లే డేవిడ్‌సన్ లాంచ్ చేసిన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా బైక్. దీన్ని హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో డెవలప్ చేశారు.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!