Jupiter's transit into Taurus 2024 : బృహస్పతిని... శ్రేయస్సు, జ్ఞానం, ఆధ్యాత్మికత, జ్యోతిష్యం, గౌరవం , ప్రతిష్టకు కారకుడిగా జ్యోతిష్య శాస్త్రం పరిగణిస్తుంది. గురు గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా రాశులపై ప్రభావం పడుతుంది.  2013 ఏప్రిల్ 15న మేషరాశిలో ప్రవేశించిన బృహస్పతి  సెప్టెంబరు 4  నుంచి 2024 జనవరి 3 వరకు వక్రంలో సంచరించాడు. ఇక వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.  గురు గ్రహం రాశిమారిన ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొందరికి ప్రతికూల ఫలితాలనిస్తుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం ఈ రాశులవారికి బాగా కలిసొస్తుంది. 


మేష రాశి (Aries)
బృహస్పతి సంచారం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. ఉద్యోగంలో మార్పులుంటాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇధే శుభసమయం. మీ ఆర్థిక స్థితి కూడా మునుపటి కంటే బలంగా ఉంటుంది. సంపదకు నూతన మార్గాలు కనిపిస్తాయి. 2024 లో మేష రాశి వారు అన్ని సౌకర్యాలను అనుభవిస్తారు. 


Also Read: 2024 లో మొదటి కాలాష్టమి, ఈ సాయంత్రం చాలా ప్రధానం!


వృషభ రాశి (Taurus )
శ్రేయస్సుకు కారకుడైన బృహస్పతి ప్రవేశం ఈ రాశివారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. ఖర్చులు కూడా పెరగుతాయి కాబట్టి  మీ బడ్జెట్‌ను గుర్తుంచుకోండి. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదం. వైవాహిక జీవితం బావుంటుంది.


మిథున రాశి (Gemini)
వృషభ రాశిలో బృహస్పతి సంచారం కారణంగా మిథున రాశి వారికి 2024 అద్భుతంగా కలిసొస్తుంది. చేపట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ మనస్సు ఆధ్యాత్మికతలో నిమగ్నమై ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ఈ సమయంలో, అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది.


Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోవాలి అనుకుంటారెందుకు!


సింహ రాశి (Leo)
బృహస్పతి చలనం సింహరాశివారికి లాభదాయకం. అదృష్టం తోడుండటంవల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. మతపరమైన లేదంటే ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల కోరికలు సులువుగా నెరవేరతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు. మీ ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా ముగుస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 


Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 


కన్యా రాశి (Virgo)
 వృషభరాశిలో బృహస్పతి ప్రవేశం వల్ల కన్యారాశివారికి కలిసొస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కెరీర్‌లో ప్రమోషన్ పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. పిల్లల వైపునుంచి శుభవార్తలు వింటారు.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించనంతగా మెరుగుపడుతుంది. 2024 సంవత్సరంలో మీరు మీ కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. పాత అప్పుల నుంచి  ఉపశమనం పొందే అవకాశం ఉంది.


ధనస్సు రాశి  (Sagittarius)
బృహస్పతి సంచారం ధనస్సు రాశివారికి బిగ్ రిలీఫ్. గతేడాది ఎదుర్కొన్న కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. గురు గ్రహం బలంగా ఉండడం వల్ల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా అనుకూల ఫలితాలున్నాయి. పనులను ప్రణాళిక ప్రకారం సకాలంలో పూర్తిచేస్తారు. మధ్యలో ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. తల్లిదండ్రుల ధనం నుంచి ప్రయోజనం ఉంది. ప్రేమ సంబంధాలు కలిసొత్తాయి. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది.



గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.