Stock Market Today, 04 January 2024: గ్లోబల్ మార్కెట్లలో బలహీనత కంటిన్యూ అవుతోంది, ఆ ప్రభావం ఈ రోజు (గురువారం, 04 జనవరి 2024) కూడా ఇండియన్‌ మార్కెట్ల మీద కనిపించొచ్చు. ఫలితంగా, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ గురువారం కన్సాలిడేట్‌ కావచ్చు. 


ఆసియా మార్కెట్లలో... సుదీర్ఘ విరామం తర్వాత ట్రేడ్‌ ప్రారంభించిన జపాన్‌ నికాయ్‌, 2 శాతం నష్టపోయింది. హాంగ్ సెంగ్ ఫ్లాట్‌గా ఉంది, ASX 200 & కోస్పి 0.8 శాతం వరకు పడిపోయాయి.


బుధవారం, USలో S&P 500 0.8 శాతం, డౌ జోన్స్‌ 0.76 శాతం, నాస్‌డాక్ 1.18 శాతం క్షీణించాయి. అమెరికాలో ఈ సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గొచ్చని ఫెడ్ మినిట్స్ సూచిస్తున్నా, ఎప్పటికి తగ్గుతాయన్న సమయాన్ని మాత్రం నిర్దిష్టంగా చెప్పలేకపోయాయి.


మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర 3% పెరిగి 78 డాలర్లకు చేరుకుంది.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 23 పాయింట్లు లేదా 0.11% గ్రీన్‌ కలర్‌లో 21,603 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


వేదాంత: 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో, లాంజిగర్ రిఫైనరీలో అల్యూమినా ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 6% పెరిగి 470ktకి చేరుకుంది. అల్యూమినియం ఉత్పత్తి కూడా 6% YoY పెరిగింది. దీంతోపాటు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.3,400 కోట్లను సమీకరించింది. మరో వార్తలో, వేదాంత రిసోర్సెస్ నాలుగు సిరీస్‌ల బాండ్ల రీకన్‌స్ట్రక్షన్‌ కోసం బాండ్ హోల్డర్ల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందుకుంది.


అదానీ పోర్ట్స్: నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 5,000 కోట్ల వరకు నిధులను సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.


జియో ఫైనాన్షియల్ సర్వీసెస్: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్‌రాక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ బిజినెస్‌ ప్రారంభించేందుకు సెబీకి పేపర్లు సబ్మిట్‌ చేశాయి.


NTPC: వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌కు ముందు, గుజరాత్ ప్రభుత్వంతో రూ. 1.5 ట్రిలియన్ విలువైన ప్రాజెక్టుల కోసం అవగాహన ఒప్పందంపై (ఎంఓయు) NTPC సంతకం చేసింది.


పవర్ గ్రిడ్, టొరెంట్ పవర్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్: ఈ కంపెనీలు కూడా గుజరాత్ ప్రభుత్వంతో వరుసగా రూ.15,000 కోట్లు, రూ.47,350 కోట్లు, రూ.8,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.


అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ: మహబూబ్‌నగర్ జిల్లాలో, రూ.9,500 కోట్లతో అమర రాజా గ్రూపునకు చెందిన అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ గిగాఫ్యాక్టరీ, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


లార్సెన్ అండ్ టూబ్రో: L&T ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తన చివరి షేర్‌ను కూడా అమ్మేసింది. 


RVNL: రాబోయే ఐదేళ్లలో, మల్టీ-మోడల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు రూ.35,000 కోట్ల వరకు ఆర్థిక సాయం చేయడానికి RECతో MOU కుదుర్చుకుంది.


ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా: ట్రాయ్ డేటా ప్రకారం, 2023 అక్టోబర్‌లో, భారతి ఎయిర్‌టెల్ 1.2 మిలియన్ యాక్టివ్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది, గత 17 నెలల్లో ఇదే అత్యధికం. రిలయన్స్ జియో 1.8 మిలియన్ యాక్టివ్ సబ్‌స్క్రైబర్లను యాడ్‌ చేసుకుంది. వొడాఫోన్ ఐడియా దాదాపు 1.4 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పోస్టాఫీస్‌లోనూ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవచ్చు, రూ.50 లక్షల కవరేజ్‌!