Horoscope Today 04th January 2024 - జనవరి 04 రాశిఫలాలు
మేష రాశి (Aries Horoscope Today)
ఆర్థికంగా బాగానే ఉంటారు. మీ వృత్తి జీవితంలో భావోద్వేగాలు మీపై ఆధిపత్యం చేయకుండా జాగ్రత్తపడండి. ఈ రోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలను తొందరపడి తీసుకోకపోవడమే మంచిది. ముఖ్యమైన విషయాలను వాయిదా వేయడమే మంచిది. పూర్తి అంకితభావంతో పనిచేయండి. సాయంత్రం ప్రశాంతంగా సాగిపోతుంది. కార్యాలయపనిలో బిజిగా ఉంటారు.
వృషభ రాశి (Taurus Horoscope Today)
పని ఒత్తిడి ఉంటుంది. భవిష్యత్ కోసం నూతన నిర్ణయాలు తీసుకునేందుకు మంచి సమయం. కెరీర్ పరంగా మంచి రోజు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మిథున రాశి (Gemini Horoscope Today)
ఈ రాశి ఉద్యోగులు సీనియర్లతో కలిసి కొత్త ప్రాజెక్ట్ పని ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. విధి నిర్వహణ - వ్యక్తిగత బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. మీ భావాలను భాగస్వామితో పంచుకోవడం కొంత ఉపశమనం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది.
Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి!
కర్కాటక రాశి (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను చిరునవ్వుతో అధిగమించాలి. ఆర్థిక విషయాలపై శ్రద్ధ పెడితే చాలా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ కలలు నెరవేర్చుకునేందుకు సరైన ప్రణాళికలు వేసుకోండి. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
సింహ రాశి (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. మీ కృషి , అంకితభావానికి పెద్ద మొత్తంలో ప్రతిఫలం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి వెనకడుగు వేయవద్దు. వైవాహిక జీవితం బావుంటుంది.
కన్యా రాశి (Virgo Horoscope Today)
కన్యా రాశి వారికి జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి. కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక , శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సమయాన్ని వెచ్చించండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయాన్ని చూస్తారు.
Also Read: రాశి మారుతున్న గ్రహాల రాకుమారుడు - ఈ రాశులవారికి శుభసమయం!
తులా రాశి (Libra Horoscope Today)
తులా రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు నడకకు వెళ్ళవచ్చు. కుటుంబానికి సమయం కేటాయించాలి. కార్యాలయ వ్యవహారాలను ఇంటిపై రుద్దొద్దు. నూతన పెట్టుబడులు పెట్టడం సరికాదు. కొందరికి రాజకీయ లబ్ధి చేకూరుతుంది.
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
మీ వ్యక్తిగత, వృత్తి జీవితంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చేయాలి అనుకున్న పనుల విషయంలో ముందుకు సాగడానికి భయపడొద్దు. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిన చోట ఆలోచన వద్దు. పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు కాస్త విరామం అవసరం. ఆరోగ్యకరమైన పానీయాలను స్వీకరించండి. ఆర్థిక విషయాల్లో తెలివిగా ఉండడం ముఖ్యం.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
ధనుస్సు రాశి వారికి వారి కెరీర్‌లో కొన్ని కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మీ భాగస్వామిని సంప్రదించండి. పని ఒత్తిడి ఉంటుంది కానీ అధిగమిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.
మకర రాశి (Capricorn Horoscope Today)
ఈ రోజు మీరు పనిపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముందుకు సాగడానికి భయపడకండి. చేపట్టిన పనిని అడ్డంకులు ఎదురైనా కానీ పూర్తిచేసేందుకు వెనక్కు తగ్గవద్దు. సీనియర్లతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికపరంగా అదృష్టవంతులు అవుతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు.
కుంభ రాశి (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు చాలా అదృష్టం కలిసొస్తుంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. వ్యాపారం చేసే వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే రోజిది. ఆర్థిక పరిస్థితిలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు. మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకుంటే ఇదే మంచి సమయం. రోజంతా బిజీబిజీగా ఉంటారు.
Also Read: త్రిగ్రాహి యోగం, ఈ 4 రాశులవారికి ధనలాభం - ఉద్యోగంలో ప్రమోషన్!
మీన రాశి (Pisces Horoscope Today)
ఈ రోజు మీ కెరీర్లో కీలకమైన మార్పు రాబోతోంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉదయం కొంత డల్ గా ఉన్నప్పటికీ సాయంత్రానికి సమస్యలకు పరిష్కారం దొరికినట్టు అనిపిస్తుంది. కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం అందుతుంది. ఏదో బాధ మీ మనసులో ఉండిపోతుంది..
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.