Budh Gochar 2024: గ్రహాల రాకుమారుడైన బుధుడు జనవరి 09 ఉదయం 6 గంటల 50 నిముషాలకు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 1 వరకు బుధుడు ఈ రాశిలో ఉంటాడు. బధుడి సంచారం అనుకూల దిశలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి శారీరకంగా బలంగా లేకపోయినా మానసికంగా చాలా బలంగా ఉంటారు. పదునైన తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రత్యర్థులకు చెక్ పెట్టడంలో సిద్ధహస్తులు. మరి బుధుడి సంచారం ఏ రాశులవారిని మానసికంగా స్ట్రాంగ్ ఉంచుతుందో ఏ రాశులవారిని మానసికంగా వీక్ చేస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి (Aries)
ధనస్సు రాశిలో బుధుడి సంచారం మేషరాశివారికి మంచి ఫలితాలను అందిస్తోంది. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ స్వభావాన్ని మార్చుకోవడం, ఇతరుల వైపునుంచి ఆలోచించడం వల్ల మీ జీవితంలో పురోగతిని పొందుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మార్కెటింగ్ రంగానికి చెందిన వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించలేరు.
వృషభ రాశి ( Taurus)
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు టైమ్ కలిసొస్తుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు పెళ్లిదిశగా అడుగేయాలి అనుకుంటే మంచి టైమే ఇది.
మిథున రాశి ( Gemini)
బుధుడి సంచారం మీకు కెరీర్ పరంగా మంచి ఫలితాలను ఇస్తుంది కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకతప్పదు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులలో భాగం కావొచ్చు. అకస్మాత్తుగా డబ్బు కలసివస్తుంది. షేర్ మార్కెట్ లేదా ఆస్తిలో పెట్టుబడి పెడితే బాగానే కలిసొస్తుంది. స్నేహితుడు లేదా బంధువుల నుంచి శుభవార్త వింటారు. భూమి లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు.
Also Read: ఆత్మలు మాత్రమే ప్రవేశించే ఆలయం - పొరపాటున కూడా ఎవ్వరూ లోపల అడుగుపెట్టరు!
కర్కాటక రాశి (Cancer)
విదేశీ వనరుల నుంచి ప్రయోజనాలు పొందుతారు లేదా గుడ్ న్యూస్ వింటారు. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఈ టైమ్ కలిసొస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. అహంకారం పక్కనపెడితే మరింత సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
సింహ రాశి (Leo)
బధుడి సంచారం సింహరాశివారికి అంత అనకూల ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ సమయంలో ఆర్థికంగా నష్టపోతారు. నూతన పెట్టుబడులకు ప్లాన్ చేస్తే దానిని కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా మీ ఖర్చులపై నియంత్రణ ఉంచండి లేదంటే మీరు ఆర్థిక సంక్షోభానికి గురవుతారు. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో మీరు మాట్లాడే ఏ మాట అయినా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. సీనియర్ ఉద్యోగి లేదా సహోద్యోగితో వివాదం తలెత్తవచ్చు. అలాంటి సమయంలో మీ పనితో సమాధానం చెప్పడం మంచిది.
Also Read: త్రిగ్రాహి యోగం, ఈ 4 రాశులవారికి ధనలాభం - ఉద్యోగంలో ప్రమోషన్!
కన్యా రాశి (Virgo)
ధనస్సు రాశిలో బుధుడి సంచారం కన్యారాశివారికి శుభాన్ని అందిస్తుంది. ఆలోచనలో మార్పులు వస్తాయి..మరింత జ్ఞానం పెంచుకుంటారు. ఉద్యోగులకు కలిసొచ్చే సమయం. ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయవనరులు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆశక్తి చూపిస్తారు.
తులా రాశి (Libra)
ధనస్సు రాశిలో బుధుడు సంచరించే సమయంలో తులా రాశివారి వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది. ఇల్లు మారాలి అనుకున్నా, నూతన గృహం కోసం ఆలోచిస్తున్నా మంచి జరుగుతుంది. కుటుంబానికి దూరంగా ఉండేవారు త్వరలో కుటుంబం దగ్గరకు చేరుకుంటారు. మీలో ఉన్న నిర్ణయాత్మక సామర్థ్యం మిమ్మల్ని గొప్పగా నిలబెడుతుంది. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. ఏ విషయంలో అయినా స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉండండి. ఎవరినీ నొప్పించని పదాలను మాత్రమే ఉపయోగించండి.
వృశ్చిక రాశి (Scorpio)
బుధుడు ధనస్సులో ఉండే సమయం మీకు అనుకూలం. మీరు మీ లక్ష్యం వైపు మీ దృష్టిని అందించగలుగుతారు . విజయానికి కొత్త ప్రమాణాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. మీ జీవితంలో చాలా కొత్త మార్పులు వస్తాయి. కొత్త విషయాలను కూడా స్వీకరించవచ్చు . టెలికమ్యూనికేషన్, మార్కెటింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి కారణం లేకుండా ఒత్తిడి తీసుకోవద్దు. మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు.
Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!
ధనుస్సు రాశి (Sagittarius)
బుధుడి సంచారం మీ రాశిలోనే. ఈ ఫలితంగా ఉద్యోగులకు గుడ్ టైమ్ ప్రారంభమవుతుంది. ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు వ్యాపారంలో నాలుగు రెట్లు ఎక్కువ లాభపడతారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. చిన్న చిన్నవ్యాధులను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. రాబోయే అన్ని పరిస్థితులలో ఓపికతో పని చేయండి. గత తప్పుల నుంచి పాఠం నేర్చుకునేందుకు ప్రయత్నించండి.
మకర రాశి (Capricorn)
మీ గౌరవం , హోదా పెరుగుతుంది. రాజకీయాలు, పోలీసు, ఆసుపత్రి మొదలైన సామాజిక సేవా సంస్థలలో పనిచేసే వారికి విజయావకాశాలు ఉన్నాయి. మీరు మీ మనస్సును స్థిరంగా ఉంచుకోవడం ద్వారా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తే, మీరు ప్రతి పరిస్థితిలో విజయం సాధించగలుగుతారు. మీలో ఎలాంటి అహంకారం లేదా మొండితనం రానివ్వకండి. మీ జీవితంలో వచ్చే ప్రతి మంచి మరియు చెడు పరిస్థితులలో మీ కుటుంబం మరియు స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
Also Read: మేషరాశి నుంచి మీనరాశి వరకూ నూతన సంవత్సరం 2024 వార్షిక ఫలితాలు!
కుంభ రాశి (Aquarius)
ఉన్నత విద్య కోసం విదేశాలలో చదవాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న విద్యార్థుల కల ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ప్రత్యేకంగా ఆకర్షితులవుతారు. మీరు మీ జీవిత భాగస్వామి, భాగస్వామి లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. చిన్న విషయాలపై వివాదాలు తలెత్తవచ్చు మరియు ఇది మీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే అంచుకు కూడా తీసుకురావచ్చు. అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనిలో ప్రశంసలు అందుకుంటారు. శత్రువుల ఎత్తును చిత్తు చేస్తారు.
మీన రాశి (Pisces)
బుధుడి సంచారం మీన రాశివారికి మంచి ఫలితాలనే ఇస్తుంది. కుటుంబంలో కొంత ప్రశాంతత ఉంటుంది. ప్రేమ సంబంధాలు కలిసొస్తాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. వ్యాపార భాగస్వామి ద్వారా ఆర్థికంగా లాభపడతారు. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. ఆస్తులు విక్రయించాలి అనుకుంటే కలిసొచ్చే సమయమే ఇది. అనుకున్న పనులన్నీ పూర్తిచేయగలుగుతారు.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.