మార్చి 24 సోమవారం రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీరు ఆధ్యాత్మికతపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు. వైవాహిక జీవితంలో వివాదసూచనలున్నాయి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. తొందరగా అలసిపోతారు. ఇతరుల లోపాలను వెతికే కన్నా మీ పనిపై మీరు శ్రద్ధ వహించండి. ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృషభ రాశి

ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. మీ పని శైలి మెరుగుపడుతుంది. వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. చాలా కాలంగా ఆపివేయబడిన పని  ఈ రోజు పూర్తిచేస్తారు. మీకు శుభవార్త వింటారు.(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మిథున రాశి

ఈ రోజు మీరు శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఫీల్డ్‌లో మీ ఆధిపత్యం పెరుగుతుంది. తప్పుడు ఆలోచనలు మనసులోకి రానివ్వవద్దు.  వ్యాపారాన్ని పెంచడానికి  అప్పులు చేయాల్సి వస్తుంది. వివాదాస్పద విషయాల్లో చిక్కుకుంటారు. ఆహారంలో స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి. (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కర్కాటక రాశి

ఈ రోజు మీ మనస్సు కొంత విచారంగా ఉండవచ్చు. పరిస్థితులు కొంతవరకు ప్రతికూలంగా ఉండవచ్చు. మీ లోపాలను అందరి ముందు అంగీకరించాల్సిన అవసరం లేదు. పిల్లల ప్రవర్తన కారణంగా కొంత అసంతృప్తి ఉంటుంది.  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)   

సింహ రాశి నూతన  ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు పనిచేసే ప్రదేశంలో వాతావరణం బాగుంటుంది. రాజకీయాల్లో ఉండేవారు తమ ప్రత్యర్థులతో సమావేశాల్లో పాల్గొనాల్సి వస్తుంది. సహాయం చేసే విషయంలో వెనక్కు తగ్గొద్దు. మీ వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నది అవుతుంది. (సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కన్యా రాశి

వ్యాపారంలో మంచి లాభాలు సాధించే అవకాశాలున్నాయి. నూతన ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టవచ్చు. సబార్డినేట్ ఉద్యోగులు మీతో సంతోషంగా ఉంటారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు మారుమూల ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. ( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

తులా రాశి

ఈ రోజు మీకు చాలా శుభ ఫలితాలుంటాయ్. ఆర్థిక  సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఏ విషయంలోనూ ఇతరులపై పూర్తిగా ఆధారపడటం సముచితం కాదు. మీ నైపుణ్యం, సామర్ధ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి. మీ జీవిత భాగస్వామి సలహాతో పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. (తులారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృశ్చిక రాశి

ఈ రోజు బోధనా పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు. మీ నైపుణ్య అభివృద్ధిని మరింత పెంచుకుంటారు.   కుటుంబ ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. మీ గౌరవం పెరుగుతుంది. నూతన ఆస్తిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ( మీ రాశి ఉగాది 2025 ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)

ధనస్సు రాశి

ఈ రోజు మీ శత్రువులు మీపై దూకుడుగా ఉంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో వాదన పెట్టుకోవద్దు. అనుకోని చికాకులుంటాయి. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త. (ఉగాది పంచాంగం 2025 ధనస్సు రాశి ఫలితాల  కోసం ఈ లింక్ క్లిక్ చేయండి )

మకర రాశి

వ్యాపారం పెద్ద డబ్బుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఉన్నతాధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగుల పదోన్నతి పొందే అవకాశం ఉంది. సాయంత్రం బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. (ఉగాది పంచాంగం 2025 మకర రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కుంభ రాశి

రచనలతో బిజీగా ఉంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది కానీ సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఆధ్యాత్మిక విషయాల్లో భావోద్వేగంతో ఉంటారు. 

మీన రాశి

ఈ రోజు మీ పనులు ఆలస్యం అవుతాయి కానీ పూర్తవుతాయి. వ్యాపారంలో మీ బాధ్యత పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి.ఈ రోజు మీరు సమస్యల నుంచి బయటపడతారు. 

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.