మార్చి 19 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు కుటుంబ విషయాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో నిర్ణయించిన లక్ష్యాలను సులభంగా సాధించగలరు. ఆగిపోయిన ప్రభుత్వ పనులను ఈ రోజు పరిష్కరించుకుంటారు. కొన్ని ప్రతికూల పరిస్థితులు  ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి.( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృషభ రాశి

ఈ రాశి నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనైతిక  విషయాలవైపు అడుగులు వేయొద్దు. (వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మిథున రాశి

వైవాహిక జీవితంలో పరస్పరం గౌరవం అవసరం. విద్యార్థులు కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు.  పోటీ పరీక్షలలో ఉత్తమ విజయాన్ని పొందుతారు. స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు చేకూరే అవకాశం ఉంది. శాతియుతంగా ఆలోచించి సమస్యలు పరిష్కరించుకోండి. (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కర్కాటక రాశి

ఈ రోజు ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నతాధికారులు మీ పనిలో జోక్యం చేసుకుంటారు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఏదో విషయంలో కోపం, అసహనం ఉంటుంది. ఆగోపోయిన చెల్లింపులు తిరిగి పొందుతారు. (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)   

సింహ రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. సమస్యలు ఉన్నప్పటికీ  సమయం ప్రకారం పూర్తవుతాయి. మీరు ఉన్నత సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు.  (సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కన్యా రాశి ఈ రోజు కార్యాలయంలో పని యొక్క ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది. మీరు మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నించండి. ఒక చిన్న తప్పు పెద్దదిగా మారుతుంది. సహోద్యోగుల మధ్య సంఘర్షణకు అవకాశం ఉంది. మానసిక సందిగ్ధతలను తొలగించడంలో మీరు విజయవంతమవుతారు. ( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

తులా రాశి

ఈ రాశివారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు.  మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు.  మీ సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగిస్తుంది.స్నేహితుల అవసరాలను కూడా పట్టించుకోండి. 

వృశ్చిక రాశి

ఈ రోజు మీ కృషికి అర్ధవంతమైన ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చేసిన పనికి వెంటనే ప్రయోజనం రావాలని ఆశించవద్దు. విద్యార్థులు మరింత కష్టపడాల్సిందే. చట్టపరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. శుభకార్యాలకోసం ఖర్చు చేస్తారు.  

ధనుస్సు  రాశి

ఈ రోజు పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటారు. కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీడియా , రచన పనులతో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు మంచిది. ఈ రోజు మీరు వ్యాపారం పరంగా అదృష్టవంతులు.

మకర రాశి

ఈ రోజు మీకు అంతా మంచే జరుగుతుంది. ఆదాయం వ్యయం మధ్య సమన్వయం ఉంటుంది.  పరిశోధన పనులు పూర్తిచేస్తారు. ఆత్మపరిశీలన కోసం రోజు మంచిది. ఇంటి సభ్యుల మధ్య సామరస్యం ఉండేలా చూసుకోండి. మహిళలు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

కుంభ రాశి

ఈ రోజు మీరున్న మార్గంలో నూతన మార్పులు వస్తాయి. క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సులభం. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వవద్దు. పిల్లల కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచండి

మీన రాశి

పనిలో ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రేమ వ్యవహారాలలో కొంత ప్రతికూలత ఉంటుంది. తెలియని వ్యక్తులతో వివాదం చేయవద్దు.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.