Sunita Williams Returns: 9 నెలలకుపైగా అంతరిక్ష వాసం పూర్తి చేసుకున్‌న  వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు ఈ ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో భఊమిపైకి తిరిగొచ్చారు. స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌తో పాటు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ భూమిపైకి  మీదకు వచ్చారు.  


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ను భూమిపైకి తీసుకొచ్చే దృశ్యాలను నాసా లైవ్ కవరేజ్‌ చేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15కు వీళ్ల రిటర్న్ జర్నీ ప్రారంభమైంది. దాదాపు ఇరవై గంటలుు ప్రయాణించిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ఫ్లోరిడా తీర ప్రాంతంలో స్ప్లాష్ డౌన్ అయింది.  


సునీతా విలియమ్స్, విల్ బుచ్ మోర్‌తోపాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ పేర్లు నిక్ హేగ్, రష్యా కాస్మానాట్ అలెగ్జాండర్ గోర్భునోవ్ సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ మధ్యే ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన క్రూ 10కు బాధ్యతలు అప్పగించి ఈ క్రూ9 తిరుగుపయనమైంది. 


సునీతా విలియమ్స్‌ క్యాప్సూల్స్‌ ఫ్లోరిడా తీర ప్రాంతంలో స్ప్లాష్ డౌన్ అయిన తర్వాత వారిని సురక్షితంగా నాసా కేంద్రానికి తరలించారు. నాసా టెక్నీషియన్స్ స్విమ్మర్స్ నలుగురు ఆస్ట్రోనాట్స్‌ను ప్రక్రియ పూర్తి చేశారు. 


సునీతా విలియమ్స్ ఈ పర్యటనలో అనేక రికార్డులు నెలకొల్పారు. 9 సార్లు, 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్‌వాక్స్ చేసిన రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. 


భూమిపైకి వచ్చిన సునీత విలియమ్స్‌ టీమ్‌కు ప్రజలంతా శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్‌ను ప్రశంసిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అంతా ఇదే టాపిక్‌పై స్పందిస్తున్నారు. 


అమెరికాలోనే సునీతా విలియమ్స్ పుట్టి పెరిగారు. సునీత తండ్రి పేరు దీపక్ పాండ్యా. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఝులాసన్‌కు చెందినవారు. డాక్టర్ అయిన దీపక్ పాండ్యా అహ్మదాబాద్‌లో డాక్టర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి అమెరికాలో ఉన్న సోదరిడి వద్దకు వెళ్లిపోయారు. అక్కడ స్లోవెనియన్ సంతతికి చెందిన ఉర్సులిన్ బోనీని పెళ్లి చేసుకున్నారు. వారికి ఉన్న ముగ్గురు సంతానంలో సునీతా విలియమ్స్ ఒకరు. 


సునీతా విలియమ్స్ 1965లో ఓహాయోలో జన్మించారు. ఆమెను భారతీయ సంప్రదాయాలతో పెంచారు. అందుకే భారత్‌తో సునీత విలియమ్స్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది.  2007, 2013లో రెండుసార్లు తమ పూర్వికుల గ్రామాన్ని సందర్శించారు.  


స్విమ్మింగ్ అంటే సునీతకు చాలా ఆసక్తి అందులో చాలా పతకాలు గెలుచుకున్నారు. ముందు పశువైద్యురాలు కావాలని అనుకున్నారు. కోరుకున్న కాలేజీలో సీటు రాకపోవడంతో యూఎస్ నేవల్ అకాడమీలో 1983లో చేరారు. 1989లో ట్రైనీ పైలట్‌గా నేవీలో చేరి 30 వేర్వేరు రకాల విమానాలు నడిపారు. తర్వాత నాసాకు దరఖాస్తు చేసుకొని 1998లో నీ వ్యోమగామిగా ఎంపికయ్యారు.


2006 డిసెంబర్ 9న తొలిసారి స్పేస్‌లో అడుగు పెట్టారు. 2007 జూన్ 22న తిరిగి భూమిపైకి చేరుకున్నారు. 2012 జులై 15న రెండోసారి స్పేస్‌కు వెళ్లిన నవంబర్ 19న తిరిగి వచ్చారు. ఇప్పుడు మూడోసారి 2024 జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లి చిక్కుకుపోయారు. ఈసారి తిరిగి వచ్చేసరికి 9 నెలలు పట్టింది.