Horoscope Today 7th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి
దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రోజు మంచిరోజు కాదు. స్నేహితులతో సరదాగా సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబానికి సమయం కేటాయించండి. 


వృషభ రాశి
ఈ రోజు మీరు ఏం చేసినా సక్సెస్ అవుతారు.ఉద్యోగులకు మంచి అవకాశాలు తలుపుతడతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. వివాహితులకు అనుకూలంగా ఉంటుంది.


మిధున రాశి
ఈ రోజు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇంకొంత కాలం వేచి చూడడం మంచిది. తీర్థయాత్రకు వెళ్లే అవకాసం ఉంది. స్తిరాస్థుల కొనుగోలుకు సంబంధించి మీ సన్నిహితులతో సంప్రదింపులు జరపడం మంచిది. 


కర్కాటక రాశి
ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఇంట్లో పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దు. పనులు వాయిదా వేయొద్దు, బద్ధకం వీడాలి. రోజంతా బిజీగా ఉంటారు. స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే మీ జీవిత భాగస్వామికి మద్దతు ఇవ్వగలరు


Also Read: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!


సింహ రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మంచి సంబంధాలను పెంచుకోండి. కార్యాలయంలో సహోద్యోగులతో స్నేహంగా మెలగండి. పనిలో ఆటంకాలు ఉండొచ్చు. ఇంట్లో పెద్దల ఆగ్రహానికి గురవుతారు. కొంతమందితో విభేదాలుంటాయి. 


కన్యా రాశి
కన్యారాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండొచ్చు.


తులా రాశి
మరింత ఆశావహంగా మారడానికి మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకోండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపిస్తుంది.  భయం, అసూయ, అసహ్యం  లాంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. మీ చేతినుంచి డబ్బు ఈజీగా బయటకు పోయినా మళ్లీ సంపాదించగల సత్తా మీకుంది. 


వృశ్చిక రాశి 
ఈ రోజు మీకు మంచి రోజు. మునుపటి కన్నా కాస్తంత మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆలోచనలు మీ మనస్సులోకి వస్తాయి.  ఏదైనా పనిలో మీ స్నేహితుల అభిప్రాయాన్ని తీసుకోవడం ప్రభావవంతంగా ఉంటుంది. విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి రోజు.


ధనుస్సు రాశి
మీరు మీ కృషితో కెరీర్లో ముందుకు సాగుతారు. ఈ రోజు మీరు ప్రయాణం చేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్య అకస్మాత్తుగా ముగుస్తుంది.


Also Read: ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది


మకర రాశి 
ధ్యానం, యోగా మీ శారీరక, మానసిక ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. ఖర్చు చేసేటప్పుడు మీ ఆలోచన ప్రకారం ఖర్చు చేయడం మంచిది. ఇంటి అలంకరణపై దృష్టి సారిస్తారు. ఏక పక్ష ప్రేమ మిమ్మల్ని నిరాశపరుస్తుంది. 


కుంభ రాశి
ఈ రోజు మీ రోజు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. రోజు ప్రారంభంలో కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి  పూర్తి మద్దతు పొందుతారు. కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మంచి రోజు


మీన రాశి
ఈ రోజు అనవసరమైన ఒత్తిడికి లోనుకాకండి. ప్రేమికులను కలవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. శత్రువులు ఆందోళన చెందుతారు. ఆస్తి లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడులు, ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు.


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి