Chanakya Neeti Telugu: అసమాన ప్రతిభతో మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన ఘనత ఆచార్య చాణక్యుడిది. దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగా మన్ననలందుకున్న కౌటిల్యుడు…జీవితానికి సంబంధించిన చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవారి, మగవారికి సంబంధించి చాణక్యుడు చెప్పిన ప్రతి మాటా తరాలు గడిచినా నిలిచిపోయేలా ఉంటుంది. అయితే చాణక్యుడికి స్త్రీలంటే చాలా చిన్నచూపు ఉందంటారంతా. తన నీతిశాస్త్రంలో ప్రస్తావించిన కొన్ని విషయాలే అందుకు కారణం. కానీ స్త్రీ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే గౌరవాన్ని పొందుతుందో తన నీతీశాస్త్రంలో వివరించాడు
ముఖ్యంగా స్త్రీలు నాయకులుగా ఎదగాలంటే ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను ఫాలో అయితే ఎదుటి వారిది ఎలాంటి మనస్తత్వం అయినా గుర్తించవచ్చంటారు. ముఖ్యంగా మహిళలకు ఉండే మూడు లక్షణాలు ఆమెను ఉన్నతంగా నిలబెడతాయన్నాడు. అలాంటి లక్షణాలున్న భార్య దొరికితే ఆ పురుషులు అదృష్టవంతులే. అలాంటి వారితో జీవన పయనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది
Also Read: ఇలాంటి పనులు చేస్తే మీరు ఎన్నిపూజలు చేసినా ప్రయోజనం ఉండదన్న చాణక్యుడు
వినయం-దయ
వినయం-దయ అనే రెండు లక్షణాలున్న స్త్రీకి సమాజంలో గౌరవం లభించడమే కాకుండా తన కుటుంబానికి సరైన దిశను ఇస్తుంది.
ఇలాంటి మహిళ కుటుంబంలో ఉన్న బంధాలన్నీ సవ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. అదేవిధంగా పిల్లలకు మంచి విలువలు నేర్పించడం ద్వారా వారిని మెరుగైన దారిలో నడిపించి సమాజానికి మంచి పౌరులను అందిస్తుంది.
మతాన్ని అనుసరించడం
ఏదో ఒక మతాన్ని అనుసరించే స్త్రీ..మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకుంటుంది. అలాంటి స్త్రీ ధోరణి ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది. సానుకూల ధోరణి ఉన్న స్త్రీ ఎప్పుడూ తన విధుల నుంచి తప్పుకోదు. అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది. అలాంటి స్త్రీ కుటుంబం మాత్రమే కాకుండా అనేక తరాలను తన నడవడికతో ప్రభావితం చేస్తుంది.
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
సంపద
చాణక్య నీతి ప్రకారం సంపదను నిజమైన స్నేహితుడిగా అభివర్ణించాడు చాణక్యుడు. సంపదను నిల్వ చేసే అలవాటున్న స్త్రీ, ఆమె మొత్తం కుటుంబానికి రక్షకురాలు అవుతుంది. సంపదను నిల్వచేసే అలవాటున్న ప్రతి స్త్రీ...సమయానికి ముందే పరిస్థితులను అంచనా వేయగల సామర్థ్యం ఆమెకు ఉంటుంది. అలాంటి మహిళ భార్యగా దొరికితే ఎటువంటి వారైనా సంక్షోభ సమయాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతారు.
ఈ లక్షణాలున్న స్త్రీ కేవలం కుటుంబానికే కాదు..సమాజానికి కూడా మంచి చేస్తుంది..మంచి నాయకురాలిగా ఎదుగుతుంది . ఒక వ్యక్తి భౌతిక సంపద ద్వారా పూర్తి ఉత్తముడు కాలేడని, కేవలం సంపద, హోదా అతని ఖ్యాతిని పెంచలేవంటాడు చాణక్యుడు. ఈ సంపద కన్నా, ఎన్ని చేతులు ఆ వ్యక్తిని ఆశీర్వదించాయి అన్న దాని మీదే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం బయటపడుతుంది అని తన అర్ధశాస్త్రంలో చెప్పాడు.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి