సీఎం జగన్ మదనపల్లె పర్యటన నేడు
సీఎం వైఎస్‌ జగన్‌ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నేడు పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను విడుదల చేయనున్నారు సీఎం. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు మదనపల్లె బీటీ కాలేజ్‌ గ్రౌండ్స్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి టిప్పు సుల్తాన్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను విడుదల చేయనున్నారు. కార్యక్రమం అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో చంద్రబాబు పర్యటన:
టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడురోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుండి బయలుదేరనున్న చంద్రబాబు మధ్యాహ్నం 12:30 కి ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజయరాయి గ్రామం చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 కు ధర్మాజీ గూడెం చేరుకుని ధర్మాజీగూడెం, మట్టంపాలెం, లింగపాలెం గ్రామాల నేతలు, ప్రజలతో కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు చింతలపూడి చేరుకుని అక్కడ 7 గంటల వరకూ రోడ్ షో నిర్వహిస్తారు. తరువాత చింతలపూడిలోని బోసు బొమ్మ సెంటర్లో జరిగే పబ్లిక్ మీటింగ్ లో 8:30 వరకూ పాల్గొంటారు. అది ముగిశాక రాత్రి 10:30కు కొయ్యలగూడెం మండలం నరసన్న పాలెం విలేజ్ చేరుకుని అక్కడి దండమూడి రామలక్ష్మి ఫంక్షన్ హాల్ వద్ద నైట్ హాల్ట్ చెయ్యనున్నారు.


రాజమండ్రిలో రెండో రోజు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు
రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో రెండో రోజు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పలువురు మంత్రులు పాల్గొననున్నారు.


విశాఖలో ఫుల్ డ్రెస్ నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4 న జరిగే నేవీ డే కోసం గత వారం రోజులుగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో నేవీ యుద్ద విన్యాసాలు, బ్యాండ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు ఫుల్ డ్రెస్ పెరేడ్ జరగనుంది.


* నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఆనంద నిలయానికి బంగారు తాపడం, వైకుంఠ ద్వార దర్శనంపై పాలకమండలి నిర్ణయాలు తీసుకోనుంది. 


* ఏపీ నూతన సీఎస్‌గా నేడు జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. 


* కాకినాడ జిల్లాలో నేడు సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.