తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 7 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 2023 మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.  


పోస్టుల వివరాలు..


➨ గెజిటెడ్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 25


1) టెక్నికల్ అసిస్టెంట్ - హైడ్రోజియోలజీ: 07 పోస్టులు
అర్హత: జియోలజీ/ అప్లయిడ్ జియోలజీ/హైడ్రోజియోలజీ విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ (లేదా) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ధన్‌బాద్ నుంచి డిప్లొమా అసోసియేట్‌షిప్ (అప్లయిడ్ జియోలజీ) ఉండాలి.
జీతం: రూ.51,320 - రూ.1,27,310.


2) టెక్నికల్ అసిస్టెంట్ - హైడ్రోలజీ: 05 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్). జియోలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. (లేదా) ఎంఎస్సీ (హైడ్రోలజీ) రెండేళ్ల కోర్సు చేసి ఉండాలి.
జీతం: రూ.51,320 - రూ.1,27,310.


3) టెక్నికల్ అసిస్టెంట్ - జియోఫిజిక్స్: 08 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ - జియోఫిజిక్స్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
జీతం: రూ.51,320 - రూ.1,27,310.


4) ల్యాబ్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: సైన్స్ డిగ్రీ. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
జీతం: రూ.32,810 - రూ.96,890.


5) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు
అర్హత: బీఎస్సీ (జియోలజీ/మ్యాథమెటిక్స్). 
జీతం: రూ.32,810 - రూ.96,890.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 01.07.2004 - 02.07.1978 మధ్య జన్మించి ఉండాలి. 


ఫీజు వివరాలు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నవారు పరీక్ష ఫీజు చెల్లించాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు - 150 మార్కులు, పేపర్-2 వాటర్ రిసోర్సెస్ నుంచి 150 ప్రశ్నలు - 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 తెలుగు, ఇంగ్లిష్‌లో; పేపర్-2 కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.  



పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే.



ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.12.2022.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.12.2022.


Notification


Website 


Also Read:


తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.  ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్!
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించి అడ్మిట్ కార్డులను పోలీసు నియామక మండలి నవంబర్ 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 3 వరకు ఈ అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్‌లో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు.
ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...