ఏపీలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేసింది. దీని ద్వారా మొత్తం 1,458 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్/ ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
* సీనియర్ రెసిడెంట్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 1,458
అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్/ ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ప్రభుత్వ మెడికల్ & డెంటల్ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్ రూ.85,000; రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీ(పీజీ) రూ.70,000; రెసిడెంట్ డెంటిస్ట్ (పీజీ) రూ.65,000 ఉంటుంది.
సర్వీసు కాలం: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.500, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250.
ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 10.12.2022.
Also Read:
ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Navy Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
ఏపీలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ పాసై, డిగ్రీ చదువుతూ ఉండాలి. ఈ ఉద్యోగాల భర్తీకి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిసెంబరు 14న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు 2023 జనవరి 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...