Astro Tips: వస్తు మార్పిడి, వస్తువులు అరువు నిత్యం జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. అయితే అత్యవసం అయినా కొన్నివస్తువులు అస్సలు అరువు తీసుకోవద్దంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అలా చేస్తే వాటివల్ల తాత్కాలికంగా మీ అవసరం తీరినప్పటికీ..ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలా తీసుకోకూడని వస్తువులేంటంటే...
పెన్ లేదా పెన్సిల్
విద్యార్థులు, ఉద్యోగులు సహా చాలామందికి పెన్ అత్యవసరమైన వస్తువు. ఇప్పటికీ చాలామంది జేబులో పెన్ లేకుండా బయట అడుగుపెట్టరు. అయితే ఎప్పుడైనా పెన్సిల్ లేదా పెన్ను లేనప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా పక్కవారిని అడిగేస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మంచిదికాదంట. ఎవరి కలమూ అరువు తీసుకోకూడదంటారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఎందుకంటే ఇది జీవితం పురోగతిని తగ్గిస్తుంది. మత విశ్వాసం ప్రకారం చిత్రగుప్తుడు తన కలంతో జీవితంలోని కష్టాలు మరియు ఆనందాలను వ్రాస్తాడు..అందుకే కలం తీసుకోవడం ద్వారా ఎదుటి వారికష్టాలను మీరు తీసుకున్నట్టే అంటారు
Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?
ఉంగరం
దాదాపు 80 శాతం మంది చేతికి ఏదో ఒక ఉంగరం ఉంటుంది. కొందరైతే స్టైలిష్ గా పెట్టుకునే ఉంగరాలతో పాటూ గ్రహస్థితి ప్రకారం స్టోన్స్ ఉన్న ఉంగరాలను కూడా ధరిస్తారు. అయితే వాస్తవానికి ఉంగరం కూడా ఒకరి వేలి నుంచి తీసుకుని ధరించకూడదు అంటారు. మరీ ముఖ్యంగా స్టోన్స్ ఉన్న ఉంగరాలు అస్సలే తీసుకోకుడదట. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నిపుణలు చెబుతారు
Also Read: ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది
దువ్వెన
అబ్బాయిలైతే జేబులో, అమ్మాయిలైతే హ్యాండ్ బ్యాగులో దువ్వెన పెట్టుకోవడం సహజం. కార్యాలయాల్లో అయినా, బయట అయినా, ఏదైనా శుభకార్యాలకు వెళ్లినప్పుడైనా పక్కవారి దువ్వెన ఠక్కున తీసుకుని వాడేస్తారు. అయితే మీరు ఉపయోగించిన దువ్వెనను ఎవరికీ ఇవ్వకూడదు, వేరేవాళ్లు ఉపయోగించిన దువ్వెన అడగకూడదు. అలా చేయడం వల్ల మీ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందట.
దుస్తులు
ఆహా...ఈ అలవాటు చాలామందికి ఉందండోయ్. ముఖ్యంగా మహిళలకు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు వైద్యశాస్త్రం ప్రకారం కూడా ఒకరు వినియోగించిన దుస్తులు మరొకరు వినియోగించరాదు. మీరు వేసుకున్న దుస్తులు వేరొకరు వేసుకుంటే మీకు అదృష్టం దూరమవుతుందట.
వాచ్
కొంతమందికి స్నేహితులు లేదా పరిచయస్తుల నుంచి వాచ్ తీసుకుని పెట్టుకుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సమయం అనేది ఓ వ్యక్తి మంచి, చెడు సమయాలకు సంబంధించినది. మీరు ఒక వ్యక్తి నుంచి గడియారం తీసుకుంటే వారి బ్యాడ్ టైమ్ ని కూడా అడిగి తీసుకుంటున్నట్టే అంటారు పండితులు. అందుకే వేరొకరి గడియారం వినియోగించడం సరికాదంటారు..
చెప్పులు
చెప్పులు అరువు తీసుకోవడం కాదు కానీ..ఊరికే అలా వేసేసుకుంటారు. ఇంట్లోంచి బయటకు అలా వెళ్లి వద్దాం అనుకున్నప్పుడు ఎదురుగా కనిపించనవి సరిపోతే చాలు వేసేసుకుంటారు. వాస్తవానికి చెప్పులు కూడా వేరేవారివి వేసుకోరాదు, వేరేవారికి ఇవ్వరాదు. ఇలా చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని చెబుతారు..
ఇంకా చెప్పాలంటే యజ్ఞోపవీతం, అలంకార సామగ్రి, పూలు ఇలా ఒకరు వినియోగించినవి మరొకరు వినియోగించరాదు..
నోట్: కొన్న పుస్తకాలు,జ్యోతిష్యశాస్త్ర నిపుణుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది.. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి