Horoscope Today 16th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి
ఊహించని ఖర్చులు మీపై ఆర్థిక భారాన్ని మోపుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండువు. (2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)


వృషభ రాశి
ఈ రోజు మీరు చేయాలనుకున్న పని చేసితీరుతారు. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు...అవి మీకు నష్టం చేస్తాయి.  అకస్మాత్తుగా మీ మనస్సులో ఏదో ఆలోచన వస్తుంది..అది మీకు మంచే చేస్తుంది. ( 2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)


మిథున రాశి
ఈ రోజు మీకు కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. రోజువారీ పనులపై ఆసక్తి చూపించరు. కొంత బద్ధకంగా ఉంటారు. పిల్లలతో గొడవలు జరిగే అవకాశం ఉంది.  (2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)


కర్కాటక రాశి
శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుదల ఉంటుంది. అవసరమైన కొనుగోళ్లను సులభతరం చేస్తుంది. మీ పిల్లల బహుమతి పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం మీకు ఆహ్లాదకరమైన అనుభవం. (2023  కర్కాటక  రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
  
సింహ రాశి
కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. వ్యాపారం బాగా సాగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. (2023  సింహ  రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)


కన్యా రాశి
ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. ఆగిపోయిన పనులలో మీరు స్నేహితుడి మద్దతు పొందుతారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి..వాటిని సంపూర్ణంగా నిర్వర్తిస్తారు. గతంలో మీరు చేసిన శుభకార్యాల ప్రయోజనం ఇప్పుడు పొందుతారు. ( 2023 కన్యాారాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


తులా రాశి
ఆరోగ్యం బావుంటుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. స్పష్టమైన అవగాహన ద్వారా మాత్రమే మీరు మీ జీవిత భాగస్వామికి భావోద్వేగ మద్దతు ఇవ్వగలరు.


వృశ్చిక రాశి
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే స్నేహితుల సహాయం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. అప్పులు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. అనవసర ప్రయాణాలు చేయడం కష్టమవుతుంది.


Also Read: మహాభారతానికి సంబంధించిన ఈ 10 ప్రదేశాలు ఇప్పుడెలా ఉన్నాయంటే!


ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మంచిరోజు. అనుకోకుండా స్నేహితుడిని కలుస్తారు.కొత్తపనిని ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం.   ప్రణాళికలు అమలుచేస్తే దీర్ఘకాలంగా ప్రయోజనం పొందుతారు. 


మకర రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులకు మంచి రోజు...అయినప్పటికీ సరైన సలహాలు తీసుకుని మాత్రమే పెట్టండి. ఇంట్లో సమస్యలు మీ మనసుపై ఆధిపత్యం చూపిస్తాయి,చేసే పనులపై ఆ ప్రభావం పడుతుంది. 


Also Read: మహాభారతం ప్రకారం విజయం, సంతోషం కోసం నిత్యం ఈ నాలుగు పాటించాలి


కుంభ రాశి
ఈ రోజు మీరు చెడు పనులు వేగంగా చేస్తారు.ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగులకు పనిప్రదేశంలో కొన్ని మార్పులుంటాయి. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. మీ సహోద్యోగుల కారణంగా మీరు బాధపడతారు. 


మీన రాశి
ఈ రోజు మీరు మీ శక్తిని మంచి పనులు చేయాల్సి రావొచ్చు. ప్రభుత్వోద్యోగులు లాభాలు పొందుతారు. విద్యాపరమైన పని పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. కానీ విద్యార్థులకు సమయం కొంచెం అనుకూలంగా ఉంటుంది.