Vrishabha Rasi Ugadi Panchangam 2025 April to 2026 March : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి మాస ఫలితాలు...
వృషభ రాశి ( కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర మొదటి 2 పాదాలు)
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 1 అవమానం : 3
ఏప్రిల్ 2025
ఈనెలలో మొదటి రెండు వారాలు యోగదాయకంగా ఉంటుంది. అన్ని రంగాలవారికీ లాభమే. చేసే వృత్తివ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చివరి రెండు వారాలు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అనుకోని ఖర్చులుంటాయి. ఆరోగ్యం సహకరించదు. విరోధాలుంటాయి. శత్రువుల వల్ల భయం ఉంటుంది.
మే 2025
విశ్వావసు నామ సంవత్సరం మే నెలలో వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. అకారణ విరోధాలు, మనఃస్థిమితం ఉండదు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. నెల ఆరంభంలో కన్నా చివర్లో దూరప్రయాణాలుంటాయి. అన్నింటా విజయం సాధిస్తారు
జూన్ 2025
ఈ నెల మీకు కొంత చికాకుగానే ఉంటుంది. గాయాలు, వాహనప్రమాదాలు, కుటుంబంలో సమస్యలు, అనుకోని ఖర్చులుంటాయి. నెల మధ్యలో పరిస్థితులు సర్దుమణుగుతాయి. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
Also Read: వృషభ రాశి ఉగాది ఫలితాలు - ఈ ఏడాది మీ ప్రతి అడుగు బ్లాక్ బస్టరే ..పట్టిందల్లా బంగారమే!
జూలై 2025
వృషభ రాశివారికి జూలైలో గ్రహాల అనుకూల సంచారంవల్ల అన్నిరంగాలవారికి అనుకూలమే. ఆదాయంబాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
ఆగష్టు 2025
ఈ నెలలోనూ మంచి ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. వాన సౌఖ్యం ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు.
సెప్టెంబర్ 2025
సెప్టెంబర్ అన్ని విధాలుగా కలిసొస్తుంది. అన్ని రంగాలవారికీ లాభమే. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. సమస్యలన్నీ తీరిపోతాయి.
Also Read: ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ విశ్వావసు నామ సంవత్సర మేష రాశి నెలవారీ ఫలితాలు!
అక్టోబర్ 2025
గ్రహాల అనుకూల సంచారం కారణంగా అన్ని రంగాలవారికి మంచి ఫలితాలుంటాయి. చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో సంతోషం ఉంటుంది. సంతానం ద్వారా లాభపడతారు.
నవంబర్ 2025
అన్నింటా మీదే పైచేయి అవుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. స్నేహితులను కలుస్తారు. తల్లి కుటుంబం నుంచి సూతకం ఉండొచ్చు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ శక్తి సామర్థ్యాల వల్ల కొన్ని పనులు పూర్తిచేస్తారు.
డిసెంబర్ 2025
గడిచిన నెలల కన్నా ఈ నెలలో కొంత అనుకూలత తగ్గుతుంది. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఆర్థిక సమస్యలుంటాయి. నమ్మినవారే మోసం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక శ్రమ ఉంటుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. 8వ స్థానంలో కుజుడి ప్రభావం వల్ల ఊహించని సంఘటనలు జరుగుతాయి.
జనవరి 2026
నూతన సంవత్సరంలో ఆరంభం వృషభ రాశివారికి ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అయితే బంధుమిత్రులతో విరోధాలుంటాయి.అష్టమ గ్రహ సంచారం చికాకులు కలిగిస్తుంది.
ఫిబ్రవరి 2026
ఈ నెలలో శారీరకశ్రమ అధికమైనా ఆదాయం బాగుంటుంది. అకాలభోజనం, క్షణం తీరికలేకుండా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేసేస్తారు. ఇల్లు మారటం తప్పదు. ఉద్యోగులకు శుభసమయం.
మార్చి 2026
ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారంతో మీ మాటకు తిరుగుండదు. పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. నూతన వ్యవహారాలు కలిసొస్తాయి. ఆదాయం ,ఆరోగ్యం, సంతోషం అన్నీ బావుంటాయి. అనుకోని ధనం చేతికందుతుంది.
Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!
మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు