Ugadi Panchangam In Telugu 2025 April to 2026 March :  శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయంటే.. 


కర్కాటక రాశి ( పునర్వసు ఆఖరి పాదం, పుష్యమి, ఆశ్లేష )
ఆదాయం : 8 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 7 అవమానం : 3


ఏప్రిల్ 2025


కర్కాటక రాశివారికి ఈ నెలలో అన్ని రంగాలవారికి బావుంటుంది. వృత్తి , ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారి కల ఫలిస్తుంది. 
 
మే 2025


మే నెలలో కర్కాటక రాశివారికి అన్నివిధాలుగా యోగకాలం అనే చెప్పాలి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 


జూన్ 2025


జూన్ నెల ఆరంభంలో అనుకూల ఫలితాలుంటాయి కానీ ద్వితీయార్థం చికాకులు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, అనుకోని విరోధాలు, సంతానం కారణంగా ఇబ్బందులు, చెడు వార్తలు వినడం జరుగుతుంది. 


మేష రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


జూలై 2025


జూలైలోనూ గ్రహ సంచారం మీకు అనుకూల ఫలితాలను ఇవ్వడం లేదు. వాహన ప్రమాద సూచనలున్నాయి. ఆరోగ్యం సరిగా ఉండదు. చేసే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులుంటాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. నమ్మిన వారివల్ల మోసపోతారు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కానీ...ఆత్మస్థైర్యంలో అన్నింటినీ ఎదుర్కొంటారు. 


ఆగష్టు 2025
 
ఈ నెల నుంచి కర్కాటక రాశివారికి మంచి రోజులు మొదలవుతాయి. మీరున్న రంగంలో రాణిస్తారు. ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి.


సెప్టెంబర్ 2025


గ్రహాల అనుకూల సంచారంతో ఈ నెలలో మీకు అంతా మంచే జరుగుతుంది.  వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో ఆశించిన లాభం పొందుతారు. శత్రువులే మిత్రులవుతారు. అధికారుల వల్ల సహాయ సహకారాలుంటాయి.  


వృషభ రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


అక్టోబర్ 2025
 
ఈ నెలలో ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు.  


నవంబర్ 2025


నవంబరు నెల కర్కాటక రాశివారికి ఆర్థికంగా బావుంటుంది. ఉత్సాహంగా, ధైర్యంగా అడుగేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ కీర్తి పెరుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులకు మీరిచ్చే సలహాలు పనికొస్తాయి.  


మిథున రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


డిశంబర్ 2025


ఈ నెలలో మీరు ధైర్యంగా దూసుకెళ్తారు. ప్రయాణాల్లో లాభపడతారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వాహనం కొనుగోలలు చేస్తారు. కుటుంబంలో మీ మాటకు తిరుగుండదు. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. 


జనవరి 2026
 
కొత్త ఏడాది ఆరంభం కర్కాటక రాశివారికి అదిరిపోతుంది. ఏ పని ప్రారంభించినా అవలీలగా పూర్తిచేసేస్తారు. నూతనవస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల కలుస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలుంటాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో లాభపడతారు. 
 
ఫిబ్రవరి 2026


ఈ నెల కూడా అన్ని రంగాలవారికి అనుకూలమే. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నప్పటికీ అనుకున్నవి పూర్తవుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలుంటాయి. కోపం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కంగారుపడతారు.
 
మార్చి 2026


గడిచిన నెలల కన్నా మార్చి 2026లో కర్కాటక రాశివారికి గ్రహసంచారం బాలేదు. శారీరక శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సోమరితనంగా వ్యవహరిస్తారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు.


గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.