Happy Diwali 2023 Wishes In Telugu: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారంతా. దీపావళి గురించి పురాణకథనాల విషయానికొస్తే భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లిచేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీమహావిష్ణువుని శరణువేడుతారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని కూడా మరో కథనం. ఈ  పండుగను కొన్ని ప్రాంతాల్లో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకూ ఐదురోజుల పాటూ సెలబ్రేట్ చేసుకుంటారు.  ఈ వెలుగులపండుగ దీపావళి శుభాకాంక్షలు తెలుగులో ఇలా చెప్పండి!


Also Read: దీపాల పండుగా లేదా పటాకులు పేల్చే పండుగా - బాణసంచా కాల్చడం ఎప్పటి నుంచి మొదలైంది!


చీకట్లను తరిమేసే దీపావళి మీ జీవితంలో కొత్తవెలుగు తీసుకురావాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని ఆశిస్తూ
దీపావళి శుభాకాంక్షలు


సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం 
మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ
దీపావళి శుభాకాంక్షలు


ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకట్లను పారద్రోలినట్టే 
మీ జీవితంలో ఒక్కో మార్పుని ఆహ్వానిస్తూ కొత్త జీవీతాన్ని నిర్మించుకోవాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


చీకట్లను తరిమేసే వెలుగుల ప్రపంచానికి స్వాగతం పలుకుదాం
మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకుని వెలుగువైపు పయనిద్దాం
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


Also Read : దీపావళి రోజు పూజించాల్సిన దక్షిణావర్తి శంఖం విశిష్టత ఏంటో తెలుసా!


ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ 
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ 
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్
దీపావళి శుభాకాంక్షలు


నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ 
దీపావళి శుభాకాంక్షలు


Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!


ఈ దీపావళి మీకు అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలు తీసుకురావాలి
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


అష్టఐశ్వర్యాల నెలవు..ఆనందాల కొలువు
సర్వదా మీకు శుభాలు కలుగు 
Happy Diwali 2023


దీప శోభతో మెరిసే ముంగిళ్లు..సిరి సంపదలతో వర్ధిల్లును మీ ఇల్లు
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


ఈ దీపావళి మీజీవితంలో కాంతి, ఆనందం,మాధుర్యాన్ని నింపాలి
దీపావళి శుభాకాంక్షలు


దీపావళి కాంతి మీ జీవితంలో ఆనందాన్ని ప్రకాశింపజేయాలి
దీపావళి శుభాకాంక్షలు


Also Read : దీపావళికి దీపాలు వెలిగించేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే!


అజ్ఞానం అనే అంధకారాన్ని తరిమేసి 
జ్ఞానం అనే వెలుగుకి ఆహ్వానం పలకండి
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


చీకటి నుంచి వెలుగుకి..
అజ్ఞానం నుంచి జ్ఞానానికి..
ఓటమి నుంచి గెలుపుకి..
గమనంలో వెలుగులు పంచే చిరుదివ్వెల కాంతులు
మీ జీవితంలో నిరంతరం ప్రసరించాలని కోరుకుంటూ 
Happy Diwali 2023


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


దీపాల వెలుగులా మీ ప్రేమ వ్యాప్తి చెందాలి
తొలగే చీకటిలా ద్వేషం నశించిపోవాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు