Diwali Diyas 2023: భారతీయ సంస్కృతిలో దీపానికున్న ప్రత్యేకతే వేరు. దేవాలయం అయినా, ఇళ్లలో అయినా పూజ దీపంతోపే ప్రారంభిస్తాం. ఇంట్లో ఎలాంటి శుభాకార్యం జరిగినా దీపాన్ని వెలిగించటం హిందూ సంప్రదాయంలో భాగం. అంత విశిష్టత ఉన్నదీపాన్ని ఒకటో రెండో కాకుండా ఇల్లంతా నింపేసే పండుగ దీపావళి. అజ్ఞానాన్ని పారద్రోలి వెలిగించే జ్ఞాన జ్యోతి అది...


శ్లోకం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్‌
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్‌ ఘోరాద్దివ్య జ్యోతిర్నమోస్తుతే॥


మూడు వత్తులను నూనెలో తడిపి అగ్నితో వెలిగించిన శుభప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. ఈ దీపాన్ని పరమాత్మకి భక్తితో సమర్పిస్తున్నాను. అతి భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను' అని పైన శ్లోకం అర్థం.


Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!


దీపావళి అంటే..!
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. 'అజ్ఙానం'అనే చీకటిని తొలగించి 'జ్ఙానం'అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడమే దీపావళి ఆంతర్యం. 'దీపం' అంటే త్రిమూర్తి స్వరూపం. ఇందులో మూడు రంగుల కాంతులు ఉంటాయి. 
'ఎర్రని' కాంతి బ్రహ్మదేవునికి
'నీలి' కాంతి శ్రీమహావిష్ణువుకి
'తెల్లని' కాంతి పరమేశ్వరుడికి ప్రతీక
సాధారణంగా అమావాస్య రోజు రాత్రి చీకటి మయంగా ఉంటుంది. ఈ వెలుగులతో చీకట్లను పారద్రోలినట్టే.. మనలో ఉండే అజ్ఞానాన్ని తరిమికొట్టడమే దీని వెనుకున్న ఉద్దేశం. దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని అందుకే అమ్మవారికి దీపాలతో ఆహ్వానం పలుకుతారని చెబుతారు. 


దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన శ్లోకం
దీపం సర్వతమోపహం
దీపో హరతుమే పాపం
దీపలక్ష్మీ నమోస్తుతే..


Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!


దీపం వెలిగించేటప్పడు చేయకూడని పొరపాట్లు



  • దీపం సాక్షాత్తు దేవతా స్వరూపం. అందుకే ప్రమిదకు గంధం,కుంకుమ బొట్టు, పూలు పెట్టి నమస్కరించి అక్షతలు వేసి పూజిస్తారు

  • దీపారాధన చేయటానికి వెండి, ఇత్తడి ప్రమిదలకు కన్నా మట్టి ప్రమిదలే మంచిది. ఎందుకంటే లోహం వెడక్కడంతో భూమి వేడెక్కుతుంది... మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి. ఇళ్లల్లో పూజకు కూడా వెండి,ఇత్తడి ప్రమిదలు వాడొచ్చు కానీ స్టీలు కుందులు వాడరాదు

  • దీపంలో అందంగా కనిపించాలని ఎన్ని వత్తులంటే అన్ని వేయరాదు. మూడు వత్తులైనా, రెండు వత్తులైనా కలపి దీపం వెలిగించాలి

  • దీపం అనగానే నూనెతో వెలిగిస్తుంటారు. కానీ నువ్వుల నూనె, ఆవునెయ్యిని వినియోగించడం చాలా మంచిది. ఒకవేళ ఆ రెండూ ఎక్కువగా లేనప్పుడు అందుబాటులో ఉన్న నూనెతో దీపం వెలిగించి అందులో రెండు చుక్కలు నెయ్యి వేసినా మంచిదే అంటారు పండితులు

  • దీపం ఐశ్వర్యాన్నిస్తుంది. త్రిలోకాధిపత్యంతో పాటు సర్వ సంపదలు కోల్పోయిన దేవేంద్రుడు దీపావళి రోజు దీపారాధన చేసిన తర్వాత అన్నీ తిరిగి పొందాడని పురాణాల్లో చెబుతారు.  అందుకే దీపావళిరోజు దీపాలు పెట్టిన ఇంట లక్ష్మీదేవి కొవులుతీరుతుందని విశ్వసిస్తారు.


Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!


“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
  దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”
దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా  ధూపం- దీపం- నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు. అందుకే పండుగలు, ప్రత్యేక రోజుల్లోనే కాదు ఇంట్లో నిత్యం దీపం వెలిగించడం ప్రధానం...


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!