Diwali Dhanteras Yama deepam 2023 Date timings: ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య దైవం ధన్వంతరి. ధనత్రయోదశితోనే  దీపావళి పండుగ మెుదలవుతుంది.  ఈ పండుగ రోజు 'యమదీపం' వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, అపమృత్యు దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. దీనికి సంబంధించి ఓ పురాణ కథ ఉంది.

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

యమధర్మరాజుకి ప్రత్యేక పూజ

పూర్వం ‘హిమ’ అనే రాజుకు లేక లేక ఓ కొడుకు పుడతాడు. వివాహమైన నాలుగో రోజే ఆ రాకుమారుడు మరణిస్తాడని పండితులు చెబుతారు. అందుకే కుమారుడికి పెళ్లిచేయకూడదని మహారాజు అనుకుంటాడు. కానీ కాలక్రమంలో ఒక రాజకుమారి వరించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అయితే వివాహ సమయంలో కూడా ఆ రాకుమారిని అందరూ హెచ్చరిస్తారు. పెళ్లైన వెంటనే వైధవ్యం తప్పదని నచ్చచెబుతారు. కానీ తాను వరించినవ్యక్తినే పెళ్లిచేసుకుంటానని..తన భర్తని తానే కాపాడుకుంటానని ధీమాగా చెబుతుంది. పెళ్లి జరిగిన నాలుగో రోజు అది.  ఆ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. రాకుమారుడి గది ముందు  బంగారు నగలు, ఇతర ఆభరణాలను రాశులుగా పోసి దీపాలు వెలిగిస్తుంది. లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో స్తుతిస్తూ గానం చేస్తుంటుంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడు. అయితే నగల మీద పడిన దీపకాంతి వల్ల ఆయన కళ్లు చెదురుతాయి. యువరాణి పాటలకు మైమరచిపోయి ఉండిపోతాడు. అప్పటికే మృత్యు ఘడియలు దాటిపోవడంతో యముడు శూన్య హస్తాలతో వెనుతిరిగి వెళ్లిపోయాడని చెబుతారు. అప్పటి నుంచీ ధన త్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం...ఇంటి బయట దీపాలు వెలిగించడం చేస్తుంటారని చెబుతారు. 

Also Read: ధనత్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయాలా!

మృత్యుదోషం తొలగించేందుకే

మృత్యుదోషం తొలగి పోయేందుకు, పరిపూర్ణ ఆయుష్షు కోసం ధనత్రయోదశి రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో కానీ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో కానీ నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వెలిగించి దీపారాధన చేస్తారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు కాబట్టి..ఇంటి ఆవరణంలో దక్షిణం వైపు ధాన్యపు రాశి మీద ఈ దీపాలు వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల యముడు శాంతిస్తాడని అకాల మరణం దరి చేరనీయడమని విశ్వసిస్తారు.

Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!

యమదీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం

 'మృత్యునాం దండపాశాభయం కాలేన్ శ్యామయ సఃత్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మామ్'

ధన త్రయోదశి రోజు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని పెద్దలు చెబుతుంటారు. వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని అంటుంటారు. ఇలా యమదీపారాధాన చేసిన వారింట అపమృత్యు దోషాలు తొలిగిపోతాయని విశ్వాసం. ఈ ఏడాది నవంబరు 11 శనివారం ధన త్రయోదశి వచ్చింది...