స్వప్నకు కడుపు ఉందని ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ కు ఫోన్ చేసి బెదిరిస్తుంది రుద్రాణి. భయపడిన డాక్టర్ మీకేం కావాలో చెప్పండి చేస్తాను అని బతిమాలుతుంది.
రుద్రాణి: స్వప్నకు కడుపు లేదని ఇప్పుడు మా ఇంటికి వచ్చి అందరి ముందు చెప్పాలి.
డాక్టర్ : మేడం మీ గొడవల్లోకి నన్ను లాగకండి ప్లీజ్ . నేను వద్దని స్వప్నకు చెప్పాను కానీ బలవంతం చేసింది.
రుద్రాణి : ఆలోచించడానికి నీ దగ్గర అవకాశం లేదు. ఆగడానికి నా దగ్గర టైం లేదు. నువ్వొచ్చి అందరి ముందు నిజం బయటపెడితే నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకోవచ్చు. కాదు అంటే నీ విషయం బయట పెట్టి నిన్ను డాక్టర్ వృత్తికి దూరం చేస్తాను.
డాక్టర్ : ప్లీజ్ మేడం అలా చేయకండి మా ఫ్యామిలీ పరువు పోతుంది. మీరు చెప్పినట్లే చేస్తాను.
రుద్రాణి : శభాష్ మంచి నిర్ణయం తీసుకున్నావు.. పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. ఇప్పుడా డాక్టర్ వచ్చి నిజం బయట పెడితే అందరి ముఖాలు ఎలా ఉంటాయో చూడాలి.
రాహుల్ : అందరి గురించి మనకెందుకు మామ్ ఆ స్వప్నని ఇంట్లోంచి తరిమేస్తే చాలు.
సీమంతం ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అనామిక ఫోన్ వచ్చిందని ఫంక్షన్ నుంచి వెళ్లిపోతుంది. రుద్రాణి, రాహుల్ లోపలికి వస్తారు.
బామ్మ : అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి దిష్టి తీయమ్మ.
కనకం : అలాగే పిన్ని గారు నా కూతురు సీమంతం ఇంత ఘనంగా జరుగుతుంటే.. ఆ సంతోషం తట్టుకోలేకపోతున్నాను.
రుద్రాణి : ఇదేం చూశావు కనకం ఇంకాసేపట్లో నేనివ్వబోయే గిఫ్ట్ చూస్తే ఏకంగా కళ్లు తిరిగి పడిపోతావు.
ధాన్యలక్ష్మీ : కళ్లు తిరిగేంత కానుక ఏమై ఉంటుందో..
రుద్రాణి : వెయిట్ అండ్ సీ..
బామ్మ : అమ్మ స్వప్న కూర్చుని చాలా సేపయింది. లేచి అటు ఇటు నడువు అమ్మ..
డాక్టర్ అక్కడికి వస్తుంది.
రుద్రాణి : స్వప్న నీ సీమంతానికి ఎవరు వచ్చారో చూడు.
అనగానే డాక్టర్ ను చూసి స్వప్న, కావ్య షాక్ అవుతారు. రుద్రాణి వెంటనే డాక్టర్‌ను వెంటబెట్టుకుని స్వప్న దగ్గరకు వెళ్లి కడుపు లేదని నిరూపిస్తుంది. ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. దీంతో అపర్ణ కనకం కుటుంబాన్ని తిడుతుంది. కనకం బాధపడుతుంది.
రుద్రాణి : ఇంత చేసిన ఈ తల్లి కాని తల్లి నాకు ఎప్పటికీ కోడలు కాలేదు.
రాహుల్ : నాకు భార్య కాలేదు. నన్ను మా అమ్మను ఇంత భ్రమలో పెట్టి నా పక్కలో ఉంటూ నన్నే మాయ చేసిందంటే నాకెప్పటికీ భార్య కాలేదు. స్వప్నను చూసినప్పుడల్లా ఆమె నాకు చేసిన మోసమే గుర్తుకు వస్తుంది. మమ్మీ బయటికి గెంటేయ్.
అనగానే రుద్రాణి స్వప్నను బయటికి వెళ్లమని చెప్తుంది. వెళ్లకపోతే బయటికి ఈడ్చుకుంటూ తీసుకువెళ్తుంది.
స్వప్న : వదలండి.. కావ్య రావే ఇంత జరుగుతుంటే ఇంకా నోరు విప్పకుండా చూస్తూ ఉంటావేంటే. నా భర్త నా అత్త నన్ను గెంటేస్తుంటే చూస్తూ మౌనంగా ఉన్నావేంటి. నీ మాట నమ్మి నేను ఇంతదాకా తెచ్చుకుంటే నీకేం సంబంధం లేనట్లు ఉంటావేంటే? నా కాపురం కూలిపోయేటట్లు ఉందే ఇప్పటికైనా నిజం బయటపెట్టి నీకు దండం పెడతా..
రాజ్ : ఏంటి కొత్త నాటకం మధ్యలో కావ్యను లాగుతున్నావేంటి.. నీ తప్పుకు కావ్యకు సంబంధం ఏంటి?
స్వప్న : ఉంది సంబంధం ఉంది. నేను కడుపుతో ఉన్నట్లు అబద్దం చెప్పమన్నదే ఈ కావ్య
రాజ్ : ఏం మాట్లాడుతున్నావ్ స్వప్న నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కావ్య మీద నిందలు వేస్తే నేను నమ్మను.
అనగానే స్వప్న కోపంగా రాజ్‌ను చూస్తూ కావ్య చెప్పినందుకే తాను ఈ నాటకం ఆడాల్సి వచ్చిందని చెప్తుంది. దీంతో రుద్రాణి అక్కాచెల్లెల్లు ఇద్దరు కలిసి నాటకం ఆడి మా ఇంటి పరువు తీశారు కదే అని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్ ముగుస్తుంది.