సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పబ్లిసిటీ సంపాదించుకుంది బాలీవుడ్ అందాల భామ. మీడియా కన్నా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది ఆ నటి. ఎప్పుడూ వివాదాలు ఆ నటి చుట్టూ తిరుగుతుంటాయి. ఇంతకీ ఆ నటి ఎవరో అనుకుంటున్నారా? మరోవరో కాదు విచిత్రమైన వేషధారణతో ఫోటో షూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరించే బాలీవుడ్ అందాల భామ, బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్.
సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. చిత్ర విచ్రితమైన వేషధారణతో ఫోటోలు, వీడియోలు షూట్ చేసి.. ఎప్పటికప్పుడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఉర్ఫీ జావేద్. అయితే కొన్నిసార్లు ఆమె పోస్టులు పలు వివాదానికి దారి తీస్తుంటాయి. ఎవరో ఒకరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమెకు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ లు కూడా ఇస్తుంటారు. అయితే తాజాగా ఈ బిగ్ బాస్ భామ చేసిన ఒక సోషల్ పోస్ట్ పలు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. చంపేస్తామనే బెదరింపుల దాకా వివాదం రాజుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు డిలీట్ చేయకపోతే.. చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
విచిత్ర వేషధారణతో ట్రెండింగ్లో నిలిచే మోడల్, నటి ఉర్ఫీ జావేద్. నిత్యం ఏదో ఒక విచిత్రమైన డ్రెస్తో ఫోటోషూట్ చేసి వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం ఆమెకు అలవాటు. అలా తాజాగా ‘భూల్ భులయ్య’లోని చోటా పండిత్ క్యారెక్టర్ డ్రెస్ ధరించి.. ఫోటోషూట్ చేసింది. అంతేకాదు అదే గెటప్ లో ఓ పార్టీకి కూడా హాజరైంది ఉర్ఫీ. దీంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఉర్ఫీ జావేద్‌ను చంపేస్తామని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి.
విచిత్ర ఫ్యాషన్ల తో విమర్శలకు కేంద్రబిందువుగా మారే ఉర్పీకి చోటా పండిత్ గెటప్ లేనిపోని తలనొప్పిని తెచ్చిపెట్టింది. చోటా పండిత్ గెటప్ లో ఓ ప్రైవేటు పార్టీకి హాజరవ్వడం పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉర్ఫీ జావేద్ వేష ధారణ తమ మతాన్ని కించపరిచేలా ఉందని.. ఆమె ఇలాగే కంటిన్యూ చేస్తే ఆమెను చంపేస్తామని కొంతమంది నుంచి ఉర్ఫీ జావేద్‌కు బెదరింపులు వచ్చినట్లు ఆమె స్వయంగా తెలిపారు. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయాలని, లేదంటే చంపడం తమకు పెద్ద పనే కాదంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారట. అయితే ఉర్ఫీకి ఇలాంటి బెదిరింపులు రావడం మామూలే.
Also Read : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? మరి, హల్దీ & మెహందీ టైమింగ్స్?