నామినేషన్స్ వేడిలో ఉన్న కంటెస్టెంట్స్‌కు.. కాస్త చల్లబడే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్‌లో అమ్మాయిలకు పని నుంచి విశ్రాంతి కల్పించాలనే కెప్టెన్‌గా గౌతమ్ నిర్ణయాన్ని సమర్దిస్తూ.. మేల్ కంటెస్టెంట్స్‌కు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రోజంతా ఫిమేల్ కంటెస్టెంట్‌కు ఏ పనులు చెప్పకుండా.. బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసి, వారికి వడ్డించి.. రాణుల్లా చూసుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో శోభా, టేస్టీ తేజా ఈ అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నారు. రతిక, అశ్విని, ప్రియాంక, శోభాలకు తేజా, పల్లవి ప్రశాంత్‌లు బ్రేక్ ఫాస్ట్ తినిపిస్తూ కనిపించారు. 


శోభాకు స్నానం కూడా చేయిస్తానన్న తేజా


ఈ టాస్క్‌ను టేస్టీ తేజా, శోభా శెట్టి బాగా వాడుకున్నారు. శోభాను కాళ్లు కింద పెట్టనివ్వకుండా ఎత్తుకుని వాష్ ఏరియాకు తీసుకెళ్లాడు తేజా. ‘‘భార్యకు హెల్త్ బాగోలేదనుకో భర్తగా నువ్వు ఏం చేస్తావ్?’’ అని తేజాను అడిగింది శోభా. ‘‘ఆ మాట అన్నావు కదా చాలు. మా పెళ్లికి మీరు రావాలి బిగ్ బాస్’’ అంటూ  ఇందుకు తేజా ఆమె పళ్లు తోమాడు. ఈ సందర్భంగా తేజా ‘‘బిగ్ బాస్ బజర్ కాస్త లేటుగా కొట్టండి. తర్వాత స్నానం కూడా ఉంటుంది’’ అని అన్నాడు. దీంతో అక్కడే ఉన్న రతిక గట్టిగా నవ్వింది. చూస్తుంటే.. ప్రేక్షకులకు కూడా ఈ ఎపిసోడ్ కాస్త ఉపశమనంగా ఉండవచ్చు.



వాడీ వేడిగా నామినేషన్స్: శివాజీ ఈ నామినేషన్లలో కూడా అమర్‌దీప్‌నే టార్గెట్ చేసుకున్నాడు. తనని నామినేట్ చేశాడనే కారణంతో శోభాశెట్టి.. అర్జున్‌తో ఫైట్ చేసింది. మరోవైపు రతిక-శోభాశెట్టి కూడా తిట్టుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో‌లో గౌతమ్, అశ్వినీల నామినేషన్స్ చూపించారు. మిగతావారితో పోల్చితే గౌతమ్ నామినేషన్ చాలా డీసెంట్‌గా స్ట్రైట్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. ‘‘టాస్క్ పెర్‌ఫార్మెన్స్, హౌస్‌మేట్స్‌తో కలుపుగోలుతనంలో నువ్వు అప్‌ టు మార్క్ కనిపించలేదు’’ అని గౌతమ్ అన్నాడు. ఇందుకు రతిక స్పందిస్తూ.. ‘‘అందరితో సరిగ్గా లేనా?’’ అని ప్రశ్నించింది. గౌతమ్ స్పందిస్తూ.. ‘‘ఒక సైడుకు గాలి ఎక్కువ మల్లింది’’ అని అన్నాడు. ఆ మాటకు రతిక.. యావర్ వైపు చూడటంతో ‘‘గుమ్మడికాయ దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లు ఉంది ఇది’’ అని అన్నాడు.


సింక్, ఫ్లోట్ టాస్క్‌ విషయంలో గౌతమ్.. అమర్‌దీప్‌ను నామినేట్ చేశాడు. ‘‘నేను సంచాలకుడిగా ఉన్నా మానిప్యులేట్ చేశావు’’ అని అన్నాడు. ‘‘నిన్ను సంచాలకుడిగా సెలక్ట్ చేసుకుందే మేము’’ అని అమర్ అన్నాడు. ‘‘అయితే, మానిప్యులేట్ చేసి గేమ్ గెలిపించాలా? వెళ్లి కొట్టించుకో పోవయ్యా’’ అని గౌతమ్ పేర్కొన్నాడు. ఆ తర్వాత అశ్వినీ నామినేట్ చూస్తూ.. యావర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈ సందర్భంగా ‘‘నీకు తెలుగు అర్థమవుతుందా?’’ అని ప్రశ్నించింది. దీంతో యావర్ అర్థం కావడం లేదు అన్నట్లు.. తలను అడ్డంగా ఊపాడు. ‘‘ఎందుకు వచ్చావు మరి?’’ అని అశ్వినీ అంది. ఆగ్రహానికి గురైన యావర్ ‘‘ఎందుకు వచ్చావ్ అని అంటే మీనింగ్ ఏమిటీ.. అలా అనడం కరెక్టా?’’ అని ప్రశ్నించాడు. దానికి అశ్వినీ స్పందిస్తూ.. ‘‘నేను బిగ్ బాస్‌కు ఎందుకు వచ్చావ్ అని అనలేదు. ఒక ఆడపిల్లను చేసి ఇక్కడ ఆడుకుంటున్నావు. అది కూడా నాకు అర్థమవుతోంది. నువ్వు నన్ను కెలికేవ్.. నేను నిన్ను కెలికా’’ అని అంది. ‘‘నాకు కూడా ఇష్టమే అది.. చెయ్’’ అని యావర్ అన్నాడు. ఇద్దరు కాసేపు సిల్లీగా వెక్కిరించుకున్నారు. ‘‘నువ్వు అస్సలు నా మైండ్‌లోనే లేవు. నేను వేరేవారిని నామినేట్ చేద్దాం అనుకున్నా’’ అని అశ్వినీ అంది. దానికి యావర్ ‘‘అంటే ఇది రివేంజా’’ అని అన్నాడు. ఇందుకు అశ్వినీ ‘‘యస్.. ఇది రివేంజ్’’ అని తెలిపాడు. 


Also Read: రసవత్తరంగా బిగ్​బాస్ సీజన్ 7 నామినేషన్స్.. ఇక్కడ కూడా గ్రూప్​గా వస్తున్న సీరియల్ బ్యాచ్