బిగ్​బాస్​ సీజన్ 7 తొమ్మిదో వారంలో నామినేషన్ ప్రక్రియ హాట్​గా మొదలైంది. ఆద్యంత రసవత్తరంగా సాగే ఈ నామినేషన్స్​ కోసం బిగ్​బాస్​ ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్​గా ఎదురు చూస్తారు. సోమవారం భీమ్లానాయక్​ పాటతో బిగ్​బాస్ ఎపిసోడ్​ ప్రారంభించారు. కంటెస్టెంట్లు అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ వేశారు. సాంగ్ అయిన తర్వాత బెడ్​ రూమ్​లో శోభ, ప్రియాంక, అమర్​ దీప్​ ముచ్చట్లు పెట్టారు. యావర్​ గురించి ప్రియాంక, శోభకు కంప్లైంట్ చేశాడు. కనీసం కామన్​సెన్స్​ లేదు యావర్​కి అంటూ కామెంట్​ చేశాడు. దానిని శోభ, ప్రియాంక ఇద్దరూ సమర్థించారు. 


ఈ వీక్ ఆడవాళ్లకు సెలవు..


అనంతరం కెప్టెన్​ డెప్యూటీలుగా శోభ, రతికను గౌతమ్ ఎంచుకున్నాడు. ఉమెన్స్​ అందరికీ డెడికేట్ చేస్తూ.. ఈ వారం అంతా ఉమెన్ వీక్ సెలబ్రేట్ చేయాలంటూ.. ఈ వారం అమ్మాయిలకు వర్క్​ నుంచి కంప్లీట్ హాలీడే ఇద్దామంటూ గౌతమ్ తెలిపాడు. ఆ లెక్కలో ప్రియాంక ఒక్కదానికే హాలీడే ఇవ్వాలని అర్జున్ తెలుపగా.. మిగిలినవారు ఎవరూ చేయట్లేదంటూ తేజ చెప్పాడు. రోజూ లైట్స్ ఆపేసిన తర్వాత.. ఆ రోజు బాగా కష్టపడిన వ్యక్తికి.. కష్టజీవి అని.. తక్కువ పని చేసిన వ్యక్తికి పని దొంగ అని బిరుదులిస్తామని వెల్లడించాడు. బెడ్స్​ గురించి కూడా గౌతమ్ కంటెస్టెంట్లకు సూచనలు చేశాడు. 


అమర్​, తేజను నామినేట్ చేసిన ప్రశాంత్


సాయంత్రం 4.45 నిముషాలకు అసలైన నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. బిగ్ బాస్ ఇంట్లో ఉండేందుకు అనర్హులని భావించే ఇద్దరిని డ్రాగన్ స్నేక్ దగ్గరికి తీసుకెళ్లి నామినేట్ చేయాలని సూచించారు. ప్రశాంత్ నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు. కెప్టెన్సీ రేస్​నుంచి తనను తీసేశాడు అంటూ అమర్​ను నామినేట్ చేశాడు. హీటెడ్ ఆర్గ్యూమెంట్ తర్వాత.. నేను ఇక్కడున్నంత వరకు కెప్టెన్ అయినవాడిని మళ్లీ కెప్టెన్ కానివ్వనంటూ అమర్ తెలిపాడు. అనంతరం తేజను ప్రశాంత్ నామినేట్ చేశాడు. ప్రశాంత్​కు క్లారిటీ ఇస్తూ.. బిగ్​బాస్​కు కెప్టెన్​ కంటెండర్లను మీరే డైరక్ట్​గా కెప్టెన్ చేయండి. మాకు ఈ పంచాయితీలు పెట్టొద్దు అంటూ తేజ ఉచిత సలహా ఇచ్చాడు.


చిల్లర నామినేషన్స్ చేయను అన్న శివాజీ..


ప్రియాంక రతికను నామినేట్ చేసింది. గతవారం నువ్వు ఏమి ఆడలేదు అని ప్రియాంక తెలుపగా.. ఈ వారం ఆడిన గేమ్ చూసి నామినేషన్ చేయాలని రతిక తెలిపింది. తన సెకండ్ నామినేషన్ భోళేకు వేసింది. గతవారం కెప్టెన్సీ రేస్​ నుంచి నన్ను తీసేసిన రీజన్ నాకు నచ్చలేదని తెలిపింది. తర్వాత అర్జున్ శోభ, అమర్​దీప్​ను ఫౌల్​ గేమ్ ఆడారంటూ నామినేట్ చేశాడు. అనంతరం శివాజీ అమర్​దీప్​ను  తన నామినేషన్​కు తీసుకున్నాడు. లాస్ట్​ టైమ్​ నామినేషన్​ ప్రశాంత్​ని నన్ను నామినేషన్ చేశాను. ఇది నా గేమ్ ప్లాన్ అన్నావు. అని శివాజీ అనగా.. అమర్ దానిని సమర్థించుకోగా.. నేను అబద్ధం చెప్పి.. చిల్లర నామినేషన్ చేయను అంటూ శివాజీ బదులు ఇచ్చాడు. దాని తర్వాత ఆ బూతుమాట నాకు నచ్చలేదు. అంతే తప్పితే మరేమి లేదు. ఇంకోటి నువ్వు ఇంట్లో మామూలుగా ఉంటావు. కానీ నామినేషన్​కు వచ్చేసరికి విపరీతంగా, మామూలుగా కాకుండా నోరు జారుతుంటావు. 


నీ నామినేషన్ వల్ల మంచి ప్లేయర్ వెళ్లిపోయాడు


ఇక్కడ ప్రతివాళ్లకి మాట్లాడటం వచ్చు ఇక్కడ. నువ్వెంటంటే అన్ని డబుల్ మీనింగ్స్ మాట్లాడుతుంటావ్.. ఎవడ్రా ప్రశాంత్​ నాకు? అని చెప్తుండగా.. నేను మీ గురించి చెప్పలేదని అమర్ తెలిపాడు. తమ్ముడు నాకు తెలియదా అంటూ రివర్స్​లో శివాజీ అడిగాడు. నాకు అర్థం కాదా? నువ్వు ధర్మంగా చెప్పు.. నీకిష్టమైన వాళ్లు అంటావు? అనగా లోపల ఉండేది నేను.. ఇక్కడ గేమ్ ఆడుతున్నాను అని అమర్ బదులిచ్చాడు. అందరూ ఇక్కడ గేమ్​నే ఆడుతారు. గేమ్స్​కి కూడా ఎథిక్స్ ఉంటాయని శివాజీ తెలిపాడు. మీరు నన్ను బయట చూడటం వల్ల నేను మీకు అర్థం కాలేదని అమర్ చెప్పాడు. నీ పాయింట్ బలంగా చెప్పు.. అంతేకానీ అరవకు అంటూ శివాజీ హితబోధ చేశాడు. నామినేటివ్ వైబ్స్.. నో పాజిటివ్ వైబ్స్ నీ వల్ల ఒక మంచి ప్లేయర్ వెళ్లిపోయాడని నాకు అనిపించింది. అందుకే నామినేట్ చేస్తున్నాను అని తెలుపగా.. ఆయనే కావాలని.. అడిగి నామినేషన్ వేయించుకున్నారని తేజ తెలిపాడు. 


సింగిల్​గా ఆడాల్సినప్పుడు కూడా గ్రూప్​గానే ఆడుతున్నారు..


రతిక నామినేషన్​కి వచ్చి ప్రియాంకను నామినేట్ చేసింది. మీరు గ్రూప్​గా ఆడాలని డిసైడ్ అయ్యారు అంటూ రతిక తెలిపింది. మేము గ్రూప్​గా ఆడలేదని ప్రియాంక తెలిపింది. సింగిల్​ గేమ్​లో గ్రూప్​గా ఎలా ఆడతాము అంటూ ప్రియాంక ప్రశ్నించగా.. మీరు సింగిల్​గా ఆడాల్సిన గేమ్​లో కూడా గ్రూప్​గా ఆడారని రతిక తెలిపింది. శోభ ఫౌల్​ గేమ్​ ఆడావంటూ ఆమెని నామినేట్ చేసింది. అమర్​ని లేపి.. రతిక నీకు హెల్ప్ చేసిందా లేదా అంటూ శోభ ప్రశ్నించింది. మధ్యలో ప్రియాంక మాట్లాడగా.. నువ్వు ఆగమ్మ.. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడవు.. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ దూరుతావు అంటూ రతిక కామెంట్ చేసింది. నేను ఎక్కడ కావాలో అక్కడ దూరుతాను నా ఇష్టమంటూ ప్రియాంక రిప్లై ఇచ్చింది. అనంతరం శోభా, రతిక మధ్య హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరిగింది. 


మరోసారి సేఫ్ నామినేషన్స్ చేసిన తేజ


తేజ ఎప్పటిలాగానే సేఫ్ నామినేషన్స్ చేశాడు. అర్జున్​ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. వచ్చి మూడు వారాలు అవుతుంది. నువ్వు ఇప్పటివరకు నామినేషన్​లో లేవు అనగా.. ఇంట్లోని సభ్యులంతా నవ్వేశారు. మూడో వారాలు ఆడావు. మూడో వారం కెప్టెన్ అయ్యావు. మొత్తం 8 వారాలు అయ్యాయి. ఆట ఇంకా రసవత్తరంగా మారాలని నిన్ను నామినేట్ చేస్తున్నానని తెలిపాడు. ఈ రీజన్ తప్పా ఇంకో రీజన్ లేదన్న.. నువ్వు ఓకె అంటే నామినేషన్​కి వెళ్లు అన్నాడు. నీకు పోటీ ఉండొద్దు.. స్ట్రాంగ్ ప్లేయర్ బయటకు వెళ్లిపోవాలనుకుంటున్నావ్ అని అర్జున్ బదులిచ్చాడు. నువ్వు ఓకే అంటేనే వెళ్లు.. లేకుంటే వద్దని బతిమాలాడు. దానిని యాక్సెప్ట్ చేసి అర్జున్ నామినేట్ అయ్యాడు. తర్వాత రతికను నామినేట్ చేశాడు. మొదటివారం చూసిన రతికను మళ్లీ చూడాలనుకుంటున్నాను అనగా.. చూడాలనుకుంటున్నాను రతిక అంటే సపరేట్​గా టీవీ పెట్టుకుని చూస్తావా? అంటూ రతిక ప్రశ్నించింది. లాస్ట్ వీక్ ఆడలేదు.. ఈ విషయాన్ని నాగ్​సార్​ ముందు కూడా ఒప్పుకున్నావు. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను అని తెలిపాడు. నన్ను నామినేట్ చేసిన పాయింట్ నాకు నచ్చలేదు రతిక నామినేట్ కాను అని తెలిపి.. చివరికి చేసేదేమి లేక నామినేట్ అయింది.


మళ్లీ నోరుజారిన అమర్


భోళే.. ప్రియాంకను, అమర్​ను నామినేట్ చేశాడు. ప్రశాంత్​, శివాజీల దగ్గర మీరు ఇలా బీహేవ్ చేయరు.. మా దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీరు ఇలా ఉండరు. మా మీద రివేంజ్ తీర్చుకుంటున్నారు మీరు అని అమర్ ఫైర్ అయ్యాడు. రివేంజ్ అంటూ నీ రేంజ్​ని తగ్గించుకోకు అమర్ అంటూ భోళే తెలిపాడు. తర్వాత మీరు ఏమి పీకారు అని.. మీ డప్పు మీరు కొట్టుకుంటారని అమర్ హేళన చేశాడు. నేను ఆడియన్​గా ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు తప్పు చేయలేదు. ఎన్నిసార్లు ఒప్పుకున్నావ్ తప్పు చేశాను అని.. ఈ సారి బాగా ఆడుతా.. ఈసారి బాగా ఆడుతా అని ఒక్కసారైనా ఆడావా? అంటూ భోళే ప్రశ్నించగా.. నేను ఎవరిదగ్గర తప్పు చేశానని ఒప్పుకున్నాను అంటూ అమర్ ఫైర్ అయ్యాడు. మీరు చాలా గొప్ప సూపర్ స్టార్.. మీతో, మీ ఫ్యాన్స్​తో మేము పెట్టుకోలేము.. ఏదో పిల్లనాకొడుకుని సార్.. వదిలేయండి అంటూ వెటకారంగా మాట్లాడాడు. 


అవును నాతో సరిగ్గా మాట్లాడలేక నువ్వు బూతు మాట్లాడావు.. అంటూ భోళే అమర్​ను నిలదీశాడు. అది బూతు కాదు. నేను సారీ చెప్పాను.. అయినా కూడా అది బూతే అంటున్నారు అనగా.. ప్రియాంక అలా మాట్లాడకు అని వారించింది. లాస్ట్​ వీక్​ ఇదే అయ్యింది. నీ నోరు కంట్రోల్​లో పెట్టుకో అంటూ అమర్​ని హెచ్చరించింది. అది బూతు కాదని అమర్ చెప్తూ.. ఒక్కసారి దొరికితే చాలు.. వేసేసుకుంటారు.. ఏదో నన్ను ఉద్దరిస్తున్నట్లు ఫీల్ అవుతారు అనగా.. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. మిగిలినవారి నామినేషన్స్​ మరో ఎపిసోడ్​లో టెలికాస్ట్​ కానున్నాయి.


Also Read : మరోసారి సిల్లీ నామినేషన్స్ చేసిన తేజ.. ప్రశాంత్, అమర్​దీప్​ మధ్య ఆరని చిచ్చు