‘బిగ్ బాస్’ సీజన్ 7లో నామినేషన్ల పర్వం సాగుతోంది. ఎప్పటిలాగానే ప్రియాంక-భోలే మధ్య మాటల యుద్ధం సాగింది. శివాజీ ఈ నామినేషన్లలో కూడా అమర్‌దీప్‌నే టార్గెట్ చేసుకున్నాడు. తనని నామినేట్ చేశాడనే కారణంతో శోభాశెట్టి.. అర్జున్‌తో ఫైట్ చేసింది. మరోవైపు రతిక-శోభాశెట్టి కూడా తిట్టుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో‌లో గౌతమ్, అశ్వినీల నామినేషన్స్ చూపించారు. మిగతావారితో పోల్చితే గౌతమ్ నామినేషన్ చాలా డీసెంట్‌గా స్ట్రైట్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. 


‘‘టాస్క్ పెర్‌ఫార్మెన్స్, హౌస్‌మేట్స్‌తో కలుపుగోలుతనంలో నువ్వు అప్‌ టు మార్క్ కనిపించలేదు’’ అని గౌతమ్ అన్నాడు. ఇందుకు రతిక స్పందిస్తూ.. ‘‘అందరితో సరిగ్గా లేనా?’’ అని ప్రశ్నించింది. గౌతమ్ స్పందిస్తూ.. ‘‘ఒక సైడుకు గాలి ఎక్కువ మల్లింది’’ అని అన్నాడు. ఆ మాటకు రతిక.. యావర్ వైపు చూడటంతో ‘‘గుమ్మడికాయ దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లు ఉంది ఇది’’ అని అన్నాడు. సింక్, ఫ్లోట్ టాస్క్‌ విషయంలో గౌతమ్.. అమర్‌దీప్‌ను నామినేట్ చేశాడు. ‘‘నేను సంచాలకుడిగా ఉన్నా మానిప్యులేట్ చేశావు’’ అని అన్నాడు. ‘‘నిన్ను సంచాలకుడిగా సెలక్ట్ చేసుకుందే మేము’’ అని అమర్ అన్నాడు. ‘‘అయితే, మానిప్యులేట్ చేసి గేమ్ గెలిపించాలా? వెళ్లి కొట్టించుకో పోవయ్యా’’ అని గౌతమ్ పేర్కొన్నాడు. 


ఆ తర్వాత అశ్వినీ నామినేట్ చూస్తూ.. యావర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈ సందర్భంగా ‘‘నీకు తెలుగు అర్థమవుతుందా?’’ అని ప్రశ్నించింది. దీంతో యావర్ అర్థం కావడం లేదు అన్నట్లు.. తలను అడ్డంగా ఊపాడు. ‘‘ఎందుకు వచ్చావు మరి?’’ అని అశ్వినీ అంది. ఆగ్రహానికి గురైన యావర్ ‘‘ఎందుకు వచ్చావ్ అని అంటే మీనింగ్ ఏమిటీ.. అలా అనడం కరెక్టా?’’ అని ప్రశ్నించాడు. దానికి అశ్వినీ స్పందిస్తూ.. ‘‘నేను బిగ్ బాస్‌కు ఎందుకు వచ్చావ్ అని అనలేదు. ఒక ఆడపిల్లను చేసి ఇక్కడ ఆడుకుంటున్నావు. అది కూడా నాకు అర్థమవుతోంది. నువ్వు నన్ను కెలికేవ్.. నేను నిన్ను కెలికా’’ అని అంది. ‘‘నాకు కూడా ఇష్టమే అది.. చెయ్’’ అని యావర్ అన్నాడు. ఇద్దరు కాసేపు సిల్లీగా వెక్కిరించుకున్నారు. ‘‘నువ్వు అస్సలు నా మైండ్‌లోనే లేవు. నేను వేరేవారిని నామినేట్ చేద్దాం అనుకున్నా’’ అని అశ్వినీ అంది. దానికి యావర్ ‘‘అంటే ఇది రివేంజా’’ అని అన్నాడు. ఇందుకు అశ్వినీ ‘‘యస్.. ఇది రివేంజ్’’ అని తెలిపాడు. 



ఇంతకు ముందు యావర్.. నువ్వు పౌల్ గేమ్ ఆడావంటూ శోభా శెట్టిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత అశ్వినీ నామినేట్ చేశాడు. అంతా గ్రూపుగా ఆడుతున్నారంటూ నాగార్జున చూపించిన వీడియో గురించి ప్రస్తావిస్తూ శోభాశెట్టిని నామినేట్ చేసింది రతిక. ఆ తర్వాత భోలే-అమర్ దీప్‌ల మధ్య పెద్ద గొడవే జరిగింది. ‘‘బిగ్ బాస్ హౌస్‌లో నువ్వు ఏం సాధించావు నువ్వు? బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నావు’’ అంటూ అని భోలే ప్రశ్నించాడు. ‘‘అవును.. నేను ఇక్కడ బ్యాడ్ బాయ్‌నే. మీకు ఏమైనా ప్రాబ్లమా?’’ అని అడిగాడు. మొత్తానికి ఈ వారం అర్జున్, యావర్, శోభా, రతిక, అమర్ దీప్‌‌, అశ్వినీలకు నామినేషన్స్ గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది. అయితే, పల్లవి ప్రశాంత్, శివాజీ మాత్రం సేఫ్ జోన్‌లో ఉన్నారు.



Also Read వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? మరి, హల్దీ & మెహందీ టైమింగ్స్?