Diwali 2023 Shani Dosha Nivaran Deepam: ఉపవాసాలు, నోములు, పూజలు, ఉపవాసాలు, అభిషేకాలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయా అంటే...తొలగిపోవు కానీ కొంత ఉపశమనం మాత్రం తప్పకుండా లభిస్తుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.ముఖ్యంగా ఏ గ్రహ సంచారం ఎలా ఉన్నా శనిగ్రహానికి జడవని వారుండరు. అందుకే శనివారం రోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆలయాలకు వెళతారు, నవగ్రహాలకు నూనెతో అభిషేకం చేస్తారు, దానాలిస్తారు, జపాలు చేస్తారు..ఇంకా ఎన్నో రెమిడీస్ పాటిస్తారు.
Also Read: దీపావళి సాయంత్రం లక్ష్మీ పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి!
ఏలినాటి శని అంటే!
ఏల్నాటి శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం, చికాకులు, ధన నష్టం, విరోధులు పెరగడం, తొందరపాటు మాటలు, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో పనిభారం ఉంటాయి.
అర్ధాష్టమ శని
అర్ధాష్టమ శనిదోషం వల్ల ప్రమాదాలు జరగడం, జ్ఞాపకశక్తి తగ్గడం, పెద్దల గురించి ఆందోళన, ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు ఉంటాయి.
అష్టమ శని
మీ రాశి నుంచి 8వ స్థానంలో శని సంచారాన్ని అష్టమ శని అంటారు. అష్టమ శని వల్ల ఆయుఃప్రమాణం తగ్గడం, ఆనారోగ్య సమస్యలు ,చికాకులు ఆందోళ ఉంటాయి.
Also Read: వెలుగులపండుగ దీపావళి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
శని నుంచి తప్పించుకోవడం సాధ్యమయ్యే పనేనా!
- హిరణ్యకశిపుడు మహా బలశాలి. అంత బలమైన రాక్షసుడు శనిదోషం వల్ల మరణించాడు
- త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిందీ శనిదోష ఫలితమే. ఈ దోష నివారణ అనంతరం వానరులతో స్నేహం ఏర్పడి రావణుడిపై విజయం సాధించాడు.
- నలమహారాజు శనిదోషం వల్ల నల్లటి రూపం పొంది ఏడేళ్లు వంటవాడిగా జీవితం సాగించాడు
- ద్వాపర యుగంలో పాండవులు ఈ శనిదోషం వల్ల 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి అడవుల వెంట తిరిగారు
- పరమేశ్వరుడు కూడా ఈ శనికి భయపడి చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడు
అంటే శనికి ఎవ్వరూ అతీతులు కాదు. కానీ కొన్ని దోష నివారణలు చేయడం ద్వారా రాబోయే ముప్పు నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. వాటిలో ముఖ్యమైనది దీపావళి రోజు పెట్టే నువ్వుల దీపం..
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
నువ్వుల దీపం ఎలా వెలిగించాలి?
దీపావళి రోజు ఉదయాన్నే తలంటుపోసుకుని, పరిశుభ్రమైన దుస్తులు ధరించి.. దేవుడి దగ్గర కూర్చుని మూడు గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి వస్త్రంతో మూటలా కట్టాలి. ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానపెట్టాలి. అది అలా పక్కన పెట్టేసి ఉంచాలి. దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీపూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర దివ్వ కొడతారు. దివ్వ కొట్టి (ఈ పద్దతి కొన్ని ప్రాంతాల వారికి ఉంది కొన్ని ప్రాంతాల వారికి లేదు) ఇంట్లోకి వచ్చాక బయట దీపాలు పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టిపడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగిస్తారు. కొందరు దీపాలను తీసుకొచ్చి ఇంటిముందు వెలిగించే ముందు నువ్వుల దీపం వెలిగిస్తే..ఇంకొందరు బాణసంచా కాల్చడం పూర్తైన తర్వాత ఇక ఇంట్లోకి వెళ్లిపోవడమే అనే సమయంలో ఈ నువ్వుల దీపాన్ని వెలిగిస్తారు.
Also Read: దీపాల పండుగా లేదా పటాకులు పేల్చే పండుగా - బాణసంచా కాల్చడం ఎప్పటి నుంచి మొదలైంది!
ఎక్కడ వెలిగించాలి?
నువ్వుల దీపాన్ని ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట ఉంచాలి. నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోవాలి. మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకూ దీపం వెలిగేలా కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెబుతారు. కొందరు ఇంటి ముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శనిదీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు. అంటే శనని తరిమికొట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నామని అర్థం వచ్చేలా. అయితే శనిదీపం ఎప్పుడు పెట్టినా మంచిదే... దీపాల వరుసతో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ చివర్లో కానీ వెలిగించడం ఉత్తమం.
Also Read : దీపావళి రోజు పూజించాల్సిన దక్షిణావర్తి శంఖం విశిష్టత ఏంటో తెలుసా!