Bigg Boss 7 Telugu Full Episode: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం టాస్కులు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్ అంతా గర్జించే పులులు, వీర సింహాలు అనే టీమ్స్‌గా విడిపోయారు. అయితే, ఈ ఆట మొత్తం శివాజీ vs గౌతమ్ అన్నట్లుగా సాగుతోంది. శివాజీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌తో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆయనకు అపోజిట్ టీమ్‌లో ఉన్న గౌతమ్ వేస్తున్న ఎత్తులు నచ్చకపోవడంతో అతడిని టార్గెట్ చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నాడు. చివరికి గౌతమ్ టీమ్‌లో ఉన్నాడనే కారణంతో యావర్, రతికాలపై కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. వారిని కూడా తన మాటలలో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న బాల్స్‌ను కాపాడటం కోసం ఫెయిర్ గేమ్ ఆడాలంటూ అందరికీ రూల్స్ పెడుతున్నాడు. దీంతో వాటిని దొంగిలించాలని ప్రయత్నించేవారు కాస్తా.. వెనకడుగు వేస్తున్నారు. అయితే, కేవలం గౌతమ్ ఒక్కడే శివాజీ మాటలను లెక్క చేయడం లేదు. ఇదే ఇప్పుడు గౌతమ్‌కు మైనస్‌గా మారే అవకాశం ఉంది. 


అందరి టార్గెట్ గౌతమ్


⦿ కెప్టెన్‌గా ఉన్న గౌతమ్.. అమ్మాయిలకు ఈ వీక్ అంతా విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇది మేల్ కంటెస్టెంట్స్‌కు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా శివాజీకి ఈ రూల్ నచ్చలేదు. ఈ సందర్భంగా ఆయన గౌతమ్ కెప్టెన్సీపై కామెంట్లు చేస్తున్నాడు. గౌతమ్‌ను అనవసరంగా కెప్టెన్ చేశామని శివాజీ, అర్జున్ వ్యాఖ్యానించారు.
⦿ గౌతమ్ కెప్టెన్సీ పిల్లతనం, పిల్లల యవ్వారంగా ఉందని శివాజీ అన్నాడు. బయట నుంచి ఆట చూసి వచ్చిన అర్జున్ కూడా శివాజీ తరహాలోనే మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అమర్‌కు బయట పెద్దగా ఆడియన్స్ మద్దతు లేదనే కారణంతో.. అతడిని దూరం పెడుతున్నాడు. అర్జున్ గౌతమ్‌తో మాట్లాడుతూ.. ‘‘వాడిని దూరంగా పెడుతున్నా.. అన్నయ్యా అంటూ వస్తున్నాడు’’ అని కామెంట్స్ చేశాడు.
⦿ వీరసింహం టీమ్‌ను గౌతమ్ ముందు ఉండి నడిపిస్తున్నాడు. దీంతో అవతలి టీమ్‌కు టార్గెట్ అయ్యాడు. డెడ్ బోర్డ్ వేసినందుకు పల్లవి ప్రశాంత్‌, బాల్స్ దొంగతనంపై వాగ్వాదం చేసినందుకు శివాజీ గౌతమ్‌ను టార్గెట్ చేసుకున్నాడు. 
⦿ అలాగే, ఆటగాడిని ఎదుటి టీమ్‌తో మార్చుకొనే అవకాశం వచ్చినప్పుడు.. భోలేను సెలక్ట్ చేసుకున్నాడు. దీంతో భోలే కూడా హర్ట్ అయ్యాడు. గౌతమ్‌ను టార్గెట్ చేసుకున్నాడు. మొత్తానికి వచ్చే వారం గౌతమ్‌కు నామినేషన్లు గట్టిగానే పడేలా ఉన్నాయ్. 


పెత్తందారులపై అశ్వినీ ఆగ్రహం


హౌస్‌లో తనని డామినేట్ చేస్తున్న వ్యక్తుల గురించి అశ్వినీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భోలేతో మాట్లాడుతూ.. ‘‘వారంతా ఏమనుకుంటున్నారు? వాళ్లు ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్లా? మేము ఏమో ఎల్‌కేజీ కూడా చదువుకోలేదు. వేలి ముద్రగాళ్లం అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు ఒక్కొక్కడు. ఏమనుకుంటున్నారో ఏమో ఒకొక్క నా కొడుకు. ఒకొక్కడు 10వ క్లాస్ పాస్ అయ్యాడో లేదో. ఇక్కడ మనిషిని జడ్జ్ చేయడానికి రైట్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ వారికి అధికారం ఎవరు ఇచ్చారు?’’ అని అంది. దీంతో భోలే కలుగజేసుకుని.. ‘‘వారంతా ఇక్కడ హౌస్‌మేట్స్. వారికి మెచ్యురిటీ లేదు’’ అని భోలే ఆమెకు సర్దిచెప్పాడు. 


గౌతమ్‌తో ఫైట్ - యావర్‌, రతికాలను ఎలిమినేట్ చేయాలన్నా శివాజీ


⦿ తన దగ్గర ఉన్న బాల్స్‌ను కాపాడుకొనేందుకు ‘ఫెయిర్’ గేమ్ అస్త్రాన్ని సంధించాడు శివాజీ. అంతేగాక న్యాయంగా ఆడనివాళ్లను ఎలిమినేట్ చేయండి అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. చివరికి తన శిష్యుడు యావర్‌ను కూడా ఎలిమినేట్ చేయాలనడం గమనార్హం. 
⦿ బాల్స్ టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్.. మీ దగ్గర ఉన్న బాల్స్‌ను జాగ్రత్తగా కాపాడుకోండని గర్జించే పులుల టీమ్‌కు చెప్పాడు. దీంతో వీర సింహాలు టీమ్ వాళ్లు తన దగ్గర నుంచి బాల్స్ లాక్కుంటారనే కారణంతో మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. దీంతో గౌతమ్.. ఆట అంటే ఇదే కదా.. ఆయన కాపాడుకోమన్నారంటే అర్థం అదే కదా. మీరు మా నుంచి బాల్స్‌ను కాపాడుకోవాలి. మా ప్రయత్నం మేం చేస్తాం. మీకు గేమ్ అర్థం కాలేదు అని అన్నాడు. 
⦿ దానికి శివాజీ స్పందిస్తూ.. ‘‘నువ్వు డాక్టర్‌వి అలా మాట్లాడకూడదు’’ అని అన్నాడు. ‘‘ఇది గేమ్. నేను మీ పర్శనల్ వస్తువులు దొబ్బేస్తే అది దొంగతనం. బిగ్ బాస్ సూట్ కేసుల్లో ఎందుకు దాయొద్దు అన్నాడో అర్థం చేసుకోండి’’ అని తెలిపాడు. ‘‘అయితే, తీసుకోండి నా బాల్స్ వదిలేస్తా. గేమ్‌లు, స్ట్రాటజీలు నాకు నేర్పుతున్నాడు’’ అని వ్యాఖ్యానించాడు. 
⦿ దీంతో తేజా కలుగజేసుకుని ‘‘బాల్ ఒక్కటీ తీసుకోవద్దు గౌతమ్. శనివారం నాగార్జునను అడుగుతా. తీసుకోవచ్చు అంటే వచ్చే వారం నుంచి చూద్దాం. శనివారం దీనిపై క్లారిటీ తెచ్చు కుందాం’’ అని అన్నాడు తేజ. దీనికి శివాజీ స్పందిస్తూ.. ‘‘దానికి క్లారిటీ తెచ్చుకుని మగాడివో కావో నిరూపించుకో’’ అన్నాడు. 
⦿ ఆ తర్వాతి రోజు ఉదయం.. యావర్, రతికాలు కూడా బాల్స్ తీసేందుకు ప్రయత్నిస్తుంటే.. ఎవరైతే ఫెయిర్ గేమ్ ఆడరో వారిని ఎలిమినేట్ చెయ్యండి అని కెమేరాలకు చెప్పాడు శివాజీ. యావర్, రతికాలను కూడా ఎలిమినేట్ చేయాలన్నాడు. 
⦿ అయితే, దీన్ని యావర్ సీరియస్‌గా తీసుకున్నాడు. ‘‘ఇది గేమ్ కదా.. దానికే ఆయన ఎలిమినేట్ చెయ్యాలని ఎందుకు చెబుతున్నారు. నాకు నచ్చలేదు’’ అని యావర్, రతికాతో (Bigg Boss Rathika) అన్నాడు. అయితే, రతికా మాత్రం ఏమంటే ఏమవుతుందా అనే జాగ్రత్తతో ఆ విషయం మీ స్పందించలేదు. 
⦿ అయితే, ఆ తర్వాత ఈ గేమ్ ఊహించని మలుపులు తిరిగింది. చివరికి గౌతమ్ టీమ్ వీర సింహాలే టాస్కుల్లో గెలిచారు. వారి టీమ్ సభ్యులంతా కెప్టెన్సీ కంటెండర్‌లుగా ఎంపికయ్యారు. 


Also Read: శివాజీ టీమ్‌కు పెద్ద షాక్ - కెప్టెన్సీ ఛాన్స్ వీరికే, ‘బిగ్ బాస్’ పెద్ద ఫిటింగే పెట్టాడుగా!