‘బిగ్ బాస్’ సీజన్ 7‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా హౌస్‌మేట్స్ అంతా గర్జించే పులులు, వీర సింహాలు అనే టీమ్స్‌గా విడిపోయి.. పోటీ పడుతున్నారు. శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, అర్జున్, పల్లవి ప్రశాంత్, అశ్వినీ గర్జించే పులులు టీమ్‌లో, శోభాశెట్టి, యావర్, గౌతమ్, తేజా, రతిక, భోలే.. వీర సింహాలు టీమ్‌లో ఉన్నారు. అయితే, ఓ గేమ్‌లో వీర సింహాలు గెలవడంతో బిగ్ బాస్ ఒక పోటీదారుడిని ప్రత్యర్థి టీమ్‌తో స్వాప్ చేసుకొనే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో తమ టీమ్‌లోని భోలేను గర్జించే పులలకు అప్పగించి.. అర్జున్‌ను తీసుకున్నారు. అలా గర్చించే పులులు మొదట పల్లవి ప్రశాంత్‌ను, ఆ తర్వాత అర్జున్‌ను పోగొట్టుకున్నారు. 


శోభాకు కెప్టెన్సీ ఛాన్స్.. శివాజీ, భోలే గేమ్ ఛేంజర్స్


చివరి టాస్క్‌లో వీర సింహాలు టీమ్ పైచేయి సాధించింది. ఈ సందర్భంగా వారు ప్రత్యర్థి గర్జించే పులులు టీమ్‌తో బాల్స్‌ను స్వాప్ చేసుకొనే అవకాశం ఛాన్స్ లభించడంతో.. గేమ్ మొత్తం తారుమారయ్యింది. గౌతమ్, అర్జున్, శోభా, యావర్, రతిక, తేజా‌.. కెప్టెన్సీ కంటెండర్‌లుగా నిలబడే ఛాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం వీరిలో గౌతమ్ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అర్జున్, యావర్‌కు కూడా ఒకసారి కెప్టెన్‌గా చేశారు. ఇక మిగిలింది శోభా, టేస్టీ తేజా, రతిక రోజ్ మాత్రమే. అవతలి టీమ్‌లో ఉన్న శివాజీ, భోలేలు తప్పకుండా శోభా, టేస్టీ తేజాలను పక్కన పెట్టేస్తారు. గౌతమ్ ఇప్పటికే బాల్స్ టాస్క్ విషయంలో శివాజీతో గొడవపడ్డాడు. దీంతో అతడిని అస్సలు కెప్టెన్‌గా ఎంచుకోడు. తన శిష్యుడు యావర్ లేదా రతికాలనే ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. అశ్వినీ ఇప్పటికే యావర్, రతికాలకు వ్యతిరేకంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఫేవరెట్ శోభా మాత్రమే. దీంతో ఆమె తప్పకుండా శోభాను కెప్టెన్ కావాలని కోరుకొనే అవకాశం ఉంది. అలాగే ప్రియాంక, అమర్ దీప్‌లు కూడా సైతం శోభానే ఎంపిక చేసుకోవచ్చు. మరోవైపు పల్లవి ప్రశాంత్ కూడా యావర్‌నే ఎంపిక చేసుకుంటాడు. అలా యావర్‌కు ముగ్గురి సపోర్ట్, శోభాకు మరో ముగ్గురి సపోర్ట్ లభించే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ సారి కూడా భోలే, శివాజీ, ప్రశాంత్‌లే గేమ్ ఛేంజర్స్ కానున్నారు. వీరిలో ఏ ఒక్కరు రతికాను లేదా టేస్టీ తేజాను ఎంపిక చేసుకున్నా శోభా లీడ్‌లో ఉండే అవకాశం ఉంది. 


బ్యాడ్ లక్ అంటూ శివాజీ గోల


ఊహించని రీతిలో ‘బిగ్ బాస్’ బాల్స్ స్వాప్ చేసుకోవాలనడంతో గర్జించే పులుల టీమ్ నిరాశకు గురయ్యారు. కష్టపడి ఓడిపోయామనే బాధ వారిని వెంటాడింది. ముఖ్యంగా శివాజీ తన మాటలతో ప్రత్యర్థి టీమ్‌‌కు తూట్లు పొడుస్తున్నాడు. యాక్సెప్ట్ చేయాల్సిందేనంటూనే.. అన్యాయంగా మీరు గెలిచారంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈసారి తప్పకుండా కెప్టెన్ కావాలనే టార్గెట్‌తో ఉన్న శివాజీ.. టాస్క్‌లో ఓడిపోవడంతో తన ఫీలింగ్స్‌ను ‘జనాలు’కు చూపించే ప్రయత్నం చేశాడు. మా టీమ్ అన్యాయంగా ఓడిపోయిందంటూ పదే పదే చెప్పడం ద్వారా ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు. అంతేకాదు.. ఒక వేళ బిగ్ బాస్ కెప్టెన్‌ను ఎంపిక చేసే ఛాన్స్ ప్రత్యర్థి టీమ్‌కు ఇచ్చినట్లయితే శివాజీ మరోసారి తన బుర్రకు పనిచెప్పడం ఖాయం.