బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ ని వీర సింహాలు, గర్జించే పులులు అనే రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు బిగ్ బాస్. హౌస్ మేట్స్ రెండు టీములుగా విడిపోయి బిగ్ బాస్ సమయానుసారం ఇచ్చే టాస్క్ లలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన ప్రోమోలో అమర్ దీప్, శోభా శెట్టికి బ్రేక్ ఫాస్ట్ అనే టాస్క్ ఇవ్వగా ఈ టాస్క్ లో సుత్తి సహాయంతో గ్లాస్ బ్రేక్ చేయాలి. ఆ తర్వాత చెక్క బోర్డులో ఉన్న స్లాట్ లో బుల్లెట్ ఫిల్ చేయాలి. అయితే ఈ టాస్క్ లో అమర్ బాగా పెర్ఫామ్ చేశాడు. శోభా కంటే చాలా స్పీడ్ గా టాస్క్ కంప్లీట్ చేసి గంట మోగించాడు. దీంతో తన టీం ని గెలిపించాడు.
ఇక తాజాగా బిగ్ బాస్ నుంచి మరో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మరోసారి రెండు టీమ్స్ హాల్ ఆఫ్ బాల్ టాస్క్ ఆడారు. ఈ టాస్క్ లో పై నుంచి వస్తున్న బాల్స్ ని పట్టుకొని బిగ్ బాస్ ఇచ్చిన సంచుల్లో దాచుకోవాలి. ఇక తాజాగా విడుదలైన ప్రోమోని గమనిస్తే.. రెండు టీమ్స్ బాల్స్ ని ఏరుకొని తమ సంచుల్లో నింపుకుంటున్న సమయంలో బిగ్ బాస్, "మీలో గోల్డెన్ బాల్ ఎవరి దగ్గర ఉంది?" అని అడిగారు. దాంతో వీర సింహాలు టీంలో ఉందని గౌతమ్ ‘బిగ్ బాస్’తో చెప్తాడు. దాంతో బిగ్ బాస్.. "మీ టీంలోని ఒక వీకేస్ట్ పర్సన్ ని మీరు కోరుకున్న ఒకరితో స్వాప్ చేసుకోవాల్సి ఉంటుంది" అని ఆదేశించడంతో, "బిగ్ బాస్ మేము భోలే అన్నని అర్జున్ అన్నతో స్వాప్ చేస్తున్నాం" అని గౌతమ్ చెప్తాడు.
అనంతరం బిగ్ బాస్.. "ఈరోజు టాస్క్ సమయం ఇంతటితో పూర్తయింది. తిరిగి టాస్క్ మొదలయ్యే వరకు మీ దగ్గర ఉన్న బాల్స్ జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత" అని ఆదేశించాడు. దాంతో తేజ.. "వాళ్ళ బ్యాగులు ఎక్కడున్నాయో తెలుసు, వాళ్ళ బంతులు ఎక్కడున్నాయో తెలుసు, ఈరోజు రాత్రి నిద్రపోకూడదు మనం" అని అర్జున్ తో అంటాడు. అప్పుడు శివాజీ.. "నా సంచి దగ్గరికి ఎవడైనా వస్తే తొక్క తీసేస్తాను" అంటూ ఫైర్ అవుతాడు. ఆ తర్వాత గౌతమ్, యావర్, రతిక అమర్ ని టార్గెట్ చేసి అతని సంచిని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. దాంతో అమర్.. "ఒక ప్రోటీన్ బాక్స్ ఖాళీగా ఉంది. దాన్ని ఎక్స్చేంజ్ చేసి పెట్టేస్తాను" అని శివాజీతో చెబుతాడు.
ఈ క్రమంలో శివాజీ, గౌతమ్ ల మధ్య డిస్కషన్ మొదలవుతుంది. "సంచులు అలా తీసి అన్ ఫెయిర్ గేమ్ ఆడొద్దు" అని శివాజీ గౌతమ్ తో అంటే, "అది అన్ ఫెయిర్ ఎట్లా అవుతుంది, మీకు ఇంకా కంప్లీట్ గా అర్థం కావట్లేదు ఇది" అని గౌతమ్ బదులిస్తాడు. దాంతో శివాజీ.. "నేను వదిలేస్తున్నా తీసుకోండి. నావి అందులోనే పెడతా, తీసుకోండి" అని చెబుతూ వెళ్ళిపోతాడు. "శనివారం రోజు నేను నాగార్జున సార్‌ను అడుగుతా, సార్ ఇది గేమ్ సర్.. తీసుకోవచ్చా?? లేదా అని అడుగుతా సార్ ని. ఓకేనా ఇది ఫిక్స్" అంటూ గౌతమ్ తో టేస్టీ తేజ చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి ఈ టాస్క్ లో ఎవరు విన్ అవుతారో అనేది తెలియాలంటే గురువారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read : షారుఖ్ బర్త్ డే ట్రీట్, ఓటీటీలోకి వచ్చేసిన 'జవాన్' - అదనపు సన్నివేశాలతో స్ట్రీమింగ్, ఎక్కడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial