షారుక్ ఖాన్ ఫ్యాన్స్, ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. షారుక్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'జవాన్'(Jawan) తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా కొన్ని స్పెషల్ సర్ప్రైజ్ లతో 'జవాన్' మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, నయనతార తొలిసారి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'జవాన్'(Jawan). రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో షారుక్ తండ్రి, కొడుకులుగా నటించి ఆకట్టుకున్నారు.


సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా సినిమాలో అట్లీ షారుక్ ని ఊర మాస్ లెవెల్లో ప్రజెంట్ చేసిన తీరుకి ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో షారుక్ కి మరో వెయ్యి కోట్ల సక్సెస్ దొరకడంతో పాటు నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఆడియన్స్ తో పాటు సినీ సెలబ్రిటీస్ ప్రశంసలు కురిపించిన 'జవాన్' తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా నవంబర్ 2 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.






హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. మరో విశేషమేంటంటే థియేటర్స్ లో చూపించని సీన్స్ ని ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అదనపు సన్నివేశాలతో ఓటీటీలో జవాన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ట్రిక్ తో థియేటర్లో చూసిన ఆడియన్స్ సైతం కొత్త సన్నివేశాల కోసం కచ్చితంగా మళ్ళీ ఓటీటీలో చూస్తారు. ఈ క్రమంలోనే జవాన్ మూవీకి థియేటర్లో ఉన్న రన్ టైం కంటే ఓటీటీ రన్ టైం ఎక్కువగా ఉంది. ఈ విషయం తెలిసి షారుక్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి జవాన్ లో ఎలాంటి కొత్త సన్నివేశాలు యాడ్ చేశారో తెలియాలంటే మరోసారి ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి.


ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ ప్లే చేయగా.. ప్రియమణి, సానియా మల్హోత్రా, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా కనిపించగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. 'జవాన్' సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ'(Dunki) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాకుండా ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతోంది. షారుక్ 'డంకి' డిసెంబర్ 21న విడుదల కానుండగా.. ప్రభాస్ 'సలార్' మరునాడు డిసెంబర్ 22న థియేటర్స్ లో సందడి చేయనుంది.


Also Read : 'ఈగల్' కోసం డోస్ పెంచుతున్న రవితేజ - అదే జరిగితే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial