మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యకాలంలో తన మార్క్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని వదిలేసి ప్రయోగాలు చేస్తున్నారు. అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో రవితేజ చేసిన 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడి', 'రావణాసుర' లాంటి సినిమాలన్నీ ఈ కోవకు చెందినవే. వీటి తరువాత వచ్చిన 'ధమాకా' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. డైరెక్టర్ త్రినాధరావు ఈ సినిమాలో రవితేజ మార్క్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించాడు. అందుకే ధమాకా లో స్టోరీ పెద్దగా లేకపోయినా రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తోనే సినిమా పెద్ద హిట్ అయింది.


రవితేజ సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే కచ్చితంగా ఆయన మార్క్ ఆఫ్ కామెడీ ఉంటుందని ఆడియన్స్ అంతా భావిస్తుంటారు. కానీ గత కొద్ది కాలంగా అది కనిపించడం లేదు. ఆ రీజన్ తోనే ఇటీవల విడుదలైన 'టైగర్ నాగేశ్వరావు' మూవీ కూడా అనుకునంత స్థాయిలో ఆకట్టుకులేకపోయింది. సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు కాబట్టి కలెక్షన్స్ కి కొదవలేదు. అది వేరే విషయం. కానీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ రవితేజ నుంచి కోరుకునే ఎంటర్టైన్మెంట్ సినిమాలో లేదు. అయితే తాజాగా ఈ విషయం తెలిసి రవితేజ అలర్ట్ అయ్యారట. దాంతో తన తదుపరి చిత్రంలో కామెడీ డోస్ కాస్త పెంచమని మూవీ టీం కి సూచనలు ఇచ్చినట్లు సమాచారం.


అంతేకాకుండా తరువాత అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ తో కామెడీ అండ్ యాక్షన్ మూవీస్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రవితేజ 'ఈగల్' బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతోంది. సినిమాటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడబోతుందని, జనవరి 26న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.


వీటిపై తాజాగా ఈగల్ టీం స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని, ముందుగా అనుకున్న తేదీకి సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' తో పాటు మహేష్ బాబు 'గుంటూరు కారం', వెంకటేష్ 'సైంధవ్' తేజ సజ్జా 'హనుమాన్', విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' తదితర సినిమాలు పోటీ పడబోతున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాయో చూడాలి.


ఇక 'ఈగల్' విషయానికొస్తే.. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నవదీప్, మధుబాల తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.


Also Read : షారుక్ బర్త్ డే గిఫ్ట్ - ఫన్ అండ్ ఎమోషనల్​గా 'డంకీ' టీజర్, మీరు చూశారా?