మాలీవుడ్ బ్యూటీ లక్ష్మీ మీనన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘కుంకీ’ మూవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తొలి సినిమాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తమిళ స్టార్ హీరో సినిమాల్లోనూ నటించే ఛాన్స్ దక్కింది. విశాల్, విజయ్ సేతుపతి, విమల్ సహా పలువురు హీరోలతో జోడీ కట్టింది. పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ’చంద్రముఖి 2’ సినిమాలో కనిపించింది. ఇందులో దివ్య పాత్రలో నటించింది. చంద్రముఖి ఆవహించినట్టుగా ఆమె చేసిన యాక్టింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ అవకాశాలు వస్తున్నాయి.
చదువు కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన లక్ష్మీ
హీరోయిన్గా బాగా రాణిస్తున్న సమయంలో సినిమాలు గ్యాప్ ఇచ్చింది లక్ష్మీ. కొంతకాలం పాటు చదువుల కోసం సినిమాలకు దూరం అయ్యింది. ఈ నిర్ణయం ఆమె కెరీర్‌కు చాలా డ్యామేజ్ చేసింది. హీరోయిన్గా వరుస అవకాశాలు వస్తున్న సమయంలో ఈ డెసిషన్ తీసుకోవడంతో ఆ తర్వాత అవకాశాలు కరువు అయ్యాయి. ఇంకా చెప్పాలంటే, ఆమెను ఇండస్ట్రీ మర్చిపోయినట్లు అయ్యింది. మళ్లీ నటించనున్నట్లు ఆమె స్టేట్మెంట్ ఇచ్చినా, ఎవరూ పట్టించుకోలేదు. చిన్నా చితకా అవకాశాలు వచ్చినా, ఆమె కెరీర్‌కు బూస్టింగ్ ఇవ్వలేకపోయాయి. రీసెంట్గా ‘చంద్రముఖి 2’లో తళుక్కున మెరిసింది. నిజానికి ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆమె ఈ సినిమాలో నటించినట్లు ఎవరికీ తెలియదు. వెండితెరపై సడెన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
యోగి బాబుతో జోడీ కడుతున్న లక్ష్మీ
తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి తమిళ స్టార్ కమెడియన్‌తో జోడీ కట్టనున్నట్లు సమాచారం. ప్రముఖ హాస్య నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో అతడికి జోడీగా లక్ష్మీ మీనన్ నటించనుందట. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
అప్పట్లో విశాల్, లక్ష్మీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు
గత కొద్ది కాలం క్రితం లక్ష్మీ మీనన్ వార్తల్లో నిలిచింది. విశాల్‌తో లవ్ లో ఉందంటూ ఊహాగానాలు వచ్చాయి. అంతేకాదు, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తా పత్రికలు కోడై కూశాయి. అయితే, ఈ వార్తలను విశాల్ తీవ్రంగా తప్పుబట్టారు. “లక్ష్మీ మీనన్ హీరోయిన్ కంటే ముందు ఒక అమ్మాయి. ఆమె వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా రూమర్స్ వస్తున్నాయి. అందుకే నేను స్పష్టత ఇస్తున్నాను. ఇక నా పెళ్లి ఎప్పుడు అనేది అనవసరమైన చర్చ. ఇకనైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు. విశాల్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఆయన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పడింది.
Read Also: బాబోయ్ మాళవిక, కొండమల్లిగా వణుకు పుట్టిస్తోందిగా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial