FSNL Jobs News: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయ్‌లోని ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్- ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 35


* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు


* జూనియర్‌ మేనేజర్‌ పోస్టులు


 * అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


➥ ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్: 09
అర్హత: యూజీసీ/ఏఐసీటీఈ ఆమోదించిన లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఓపెన్ & డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ నుంచి డిగ్రీ(మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / మైనింగ్ / మెటలర్జికల్ / ప్రొడక్షన్ ఇంజినీర్‌), డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

➥ మెయింటెనెన్స్‌ డిపార్ట్‌మెంట్: 11
అర్హత: యూజీసీ/ఏఐసీటీఈ ఆమోదించిన లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఓపెన్ & డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ నుంచి డిగ్రీ(మెకానికల్/ ఆటోమొబైల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌), డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

➥ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌: 05 
అర్హత: యూజీసీ/ఏఐసీటీఈ ఆమోదించిన లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఓపెన్ & డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, కనీసం రెండేళ్ల ఎంబీఏ/పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌తో పాటు మెటీరియల్స్ మేనేజ్‌మెంట్/లాజిస్టిక్స్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్/మార్కెటింగ్/ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

➥ ఫైనాన్స్‌&అకౌంట్స్‌: 07 
అర్హత: యూజీసీ/ఏఐసీటీఈ ఆమోదించిన లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఓపెన్ & డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ నుంచి సీఏ/ఐసీఎంఏ/ఎంబీఏ(ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

➥ పర్సనల్‌&అడ్మినిస్ట్రేషన్‌: 03
అర్హత: యూజీసీ/ఏఐసీటీఈ ఆమోదించిన లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఓపెన్ & డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా రెండేళ్ల ఎంబీఏతో పాటు పీజీడీబీఏ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 25.11.2023 నాటికి ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 28 సంవత్సరాల లోపు, జూనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 28 సంవత్సరాలలోపు, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 34 సంవత్సరాల లోపు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


జీతం: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.30,000-1,20,000, జూనియర్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.40,000-1,40,000, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000-1,60,000.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 25.11.2023.


రాతపరీక్ష, ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు తీసుకురావాల్సిన సర్టిఫికేట్లు..


➥ పదోతరతి సర్టిఫికేట్/ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం. 


➥ ఆధార్ కార్డు, ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు.


➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు)


➥ ఎక్స్-సర్వీస్‌మెన్ - డిశ్చార్జ్ సర్టిఫికేట్


➥ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇన్-కమ్ సర్టిఫికేట్


➥ డిగ్రీ అన్ని సెమిస్టర్ల సర్టిఫికేట్లు


➥ ప్రభుత్వ ఉద్యోగులైతే 'NOC' సర్టిఫికేట్ అవసరం.


➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, లేటెస్ట్ పే స్లిప్స్


Notification


Website


ALSO READ:


➥ సిడ్బీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, ఎంపికైతే నెలకు రూ.90 వేల వరకు జీతం


➥ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...