Trigrahi Yoga in September 2024: ఈ నెలలో బుధుడు, శుక్రుడు ఎదురెదురుగా వస్తున్నాయి...వీటితో పాటూ కుజుడు కూడా అదే అమరికలోకి రావడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది.. ఈ యోగం మూడు రాశులవారికి రాజయోగాన్నిస్తుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది...ఊహించని విధంగా ఆర్థిక లాభాలు సాధిస్తారు...
గ్రహాలు రాశి పరివర్తనం చెందిన ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశులవారిపై ఉంటుంది. సెప్టెంబరు నెలలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశులవారికి రాజయోగాన్నిస్తుంది. సెప్టెంబరులో శుక్రుడు, బుధుడు ఎదురెదురుగా రాబోతున్నాయి..వీటితో పాటూ కుజుడు కూడా ఇదే క్రమంలో ఉంటాడు. ఈ మూడు గ్రహాల అమరిక మూడు రాశులవారికి మంచి చేస్తోంది..
Also Read: వినాయకచవితి సహా భాద్రపదమాసం (సెప్టెంబర్) లో వచ్చే పండుగల లిస్ట్ ఇదే!
తులా రాశి (Libra)
కుజుడు - బుధుడు కలయిన తులా రాశివారికి శుభఫలితాలనిస్తోంది. ఈ సమయంలో న్యాయపరమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆస్తివివాదాల్లో చిక్కుకున్నవారు దాన్నుంచి బయటపడతారు..ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమబంధం బలపడుతుంది. అవివాహితులకు వివాహ యోగం. కళా రంగంలో ఉండేవారు ఉత్తమ ఫలితాలు పొందుతారు.
ధనస్సు రాశి (Sagittarius)
మూడు గ్రహాల కలయిక ధనస్సు రాశివారికి ఊహించని ఆర్థిక లాభాన్నిస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల ఫలిస్తుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యక్తిగతజీవితంలో ఉండే చికాకులు తొలగిపోతాయి. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు.
Also Read: తారక్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ దర్శించుకున్న 'శ్రీ కేశవనాథేశ్వర' గుహ ఆలయం విశిష్టత ఇదే!
కుంభ రాశి (Aquarius)
త్రిగ్రాహి యోగం కుభం రాశివారికి అదృష్టాన్నిస్తుంది. అనుకోని ఆర్థికలాభం పొందుతారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో ఏర్పడే నూతన పరిచయాలు లాభిస్తాయి. స్టాక్ మార్కెట్, లాటరీల్లో పెట్టుబడి పెట్టినవారు లాభపడతారు. నూతన విషయాలు నేర్చుకునేందుకు శ్రద్ధచూపిస్తారు. కెరీర్లో అడుగు ముందుకు పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో రిస్క్ తీసుకుంటేనే శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగులు, విద్యార్థులు శుభఫలితాలు పొందుతారు.
త్రిగ్రాహి యోగం వల్ల ఆయా రాశులవారికి సృజనాత్మకత పెరుగుతుంది.. మెరుగైన బంధాలు ఏర్పడతాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్యలో పురోభివృద్ధి ఉంటుంది. నూతన విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అదృష్టం కలిసొస్తుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: సెప్టెంబరు 2024 లో ఈ రాశులవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తారు - ఆర్థికాభివృద్ధి ఉంటుంది !