Monthly Horoscope September 2024: సెప్టెంబరు నెలలో ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి...ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి...
మేష రాశి
సెప్టెంబరు నెల మేష రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. కుటుంబంలో ఉండే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇదే సరైన సమయం. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి
ఈ నెల వృషభ రాశికి చెందిన వారు ఏ రంగంలో ఉన్నా దూసుకెళతారు. శుభకార్యాలల్లో పాల్గొంటారు. విందులకు హాజరవుతారు. వస్తు, వాహన సౌఖ్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మిథున రాశి
సెప్టెంబరు నెల మిథునరాశివారి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. ప్రశాంత వాతావరణం ఉంటుంది. దైవ దర్శనాలకు వెళతారు. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు మంచి చేస్తుంది. చేపట్టిన పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తిచేస్తారు. పాతబాకీలు వసూలవుతాయి.
Also Read: సముద్ర నురుగుతో గణేషుడు.. దర్శించుకున్నారా ఎప్పుడైనా!
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి సెప్టెంబరు నెలలో మనోధైర్యం పెరుగుతుంది. దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారాలలో లాభాలొస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. పాత స్నేహితులను కలుస్తారు.
సింహ రాశి
సింహ రాశివారికి సెప్టెంబరు నెల మంచి యోగకాలం. ఆదాయం పెరుగుతుంది..ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. ఆరోగ్యం బావుంటుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. దైవసంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్యా రాశి
ఈ నెలలో కన్యారాశివారికి అనుకూల ఫలితాలు లేవు. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు తప్పవు. మీ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడం కోసం ప్రయత్నించండి. అనుకోని దుస్సంఘటనలు జరుగుతాయి. ఇతరుల సమస్యల వల్ల మీరు ఇబ్బందిపడతారు. నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కొన్నిరోజులు వాయిదా వేసుకోవడం మంచిది.
తులా రాశి
సెప్టెంబరు నెల తులారాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు రావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులుంటాయి. కుటుంబంలో మాటపట్టంపులు తప్పవు. శ్రమ పెరుగుతుంది
Also Read: ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి ఈనెల అద్భుతంగా ఉంటుంది. అన్నింటా మీదే పైచేయి అవుతుంది. అన్ని రంగాల వారు అభివృద్ధి చెందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారు మంచి పేరుప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశివారికి సెప్టెంబరు నెల అన్ని విధాలుగా కలిసొస్తుంది. వృత్తి, వ్యాపారాలలో రాణిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. అయితే అనవసర విషయాలపై ఎక్కువ స్పందించడం తగ్గించుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదాయానికి లోటుండదు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు
మకర రాశి
సెప్టెంబరు నెల మకర రాశివారికి మిశ్ర ఫలితాలున్నాయి. ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదర మూలకంగా ఆదాయం పెరుగుతుంది. వాహన ప్రమాదాలున్నాయి జాగ్రత్త. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
Also Read: ఈ 8 ఆలయాలను రెండు రోజుల్లో చుట్టేయవచ్చు.. వినాయకచవితికి ప్లాన్ చేసుకోండి!
కుంభ రాశి
కుంభ రాశివారికి సెప్టెంబరు నెలలో అనారోగ్య సమస్యలుంటాయి. వృత్తి, వ్యాపారాలలో పరిస్థితులు అంతగా కలసిరావు. కుటుంబంలో అనుకోని తగాదాలు జరుగుతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి భయపడతారు.
మీన రాశి
మీన రాశివారికి ఈ నెలలో మంచి-చెడు ఫలితాలు సమానంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో మొదట్లో అడ్డంకులు ఎదురైనా కానీ చివరి నిముషంలో విజయం సాధిస్తారు. ఆదాయానికి లోటుండదు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుంటాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.