Brahmamudi Serial Today Episode: ఈ నేరాన్ని బలవంతంగా నా కొడుకుపై మోపడానికి నేను ఒప్పుకోను అని రుద్రాణి అంటుంది. నేను రెండు రోజుల నుంచి మాత్రమే కంపెనీని చూసుకుంటున్నాను. ఇంతలో నేను ఇలాంటి ఫ్రాడ్ ఎలా చేస్తాను అని రాహుల్ అంటాడు. అయితే నేనే నైతిక బాధ్యత వహించి పోలీసులకు కోపరేట్ చేస్తాను అని రాజ్ అనడంతో… అంతా షాక్ అవుతారు. దీంతో రాహుల్‌, రుద్రాణి హ్యాపీగా ఫీలవుతారు.  అపర్ణ మాత్రం కొడుకును వెనకేసుకోస్తుంది. దీంతో పోలీసులు స్వరాజ్‌ చైర్మన్‌‌ ను అరెస్ట్‌ చేయమని కోర్టు నుంచి తమకు ఆర్డర్‌ వచ్చిందని పోలీసులు చెప్తారు. అయితే మా కంపెనీ లీగల్‌ అడ్వైజర్‌ తో మాట్లాడండి అని సుభాష్‌ చెప్పగానే  


లేదు సార్. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్. కోర్టులోనే తేల్చుకోవాలి అని ఎస్సై అంటాడు.


రాజ్‌: ఇట్స్ ఓకే. నేనేం తప్పు చేయలేదు. కోర్టులోనే రుజువు అవుతుంది.


రుద్రాణి: ఇంకా ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నావు రాజ్ తాతయ్య ఆశయాలను తుంగలోకి తొక్కి ఇలాంటి ఫ్రాడ్ చేసి ఎలాగు రాహుల్ ఆఫీస్‌కు వెళ్తున్నాడు కాబట్టి దొరికినా వాడి మీద తోసేయాలని అనుకున్నావు  కదా


అపర్ణ: రుద్రాణి మనిషిలా మాట్లాడు. రాహుల్‌ మీద తోసేయాలని ఉంటే వీడెందుకు పోలీసులకు లొంగిపోతాడు.


స్వప్న: ఎస్సై గారు మీరు ఒక నిర్దోషిని తప్పుపడుతున్నట్లు ఉంది. ఇది రాహులే చేసి ఉంటాడు. ఇతను తప్పా ఇంట్లో ఎవరు తప్పు చేసేవాళ్లు లేరు.


రాజ్‌: స్వప్న నాకోసం నీ అత్త, భర్త దగ్గర చెడుకావొద్దు. నేను తప్పు చేయలేదు. నిజం ప్రూవ్ అవుద్ది


 అని చెప్పి రాజ్‌, పోలీసులతో వెళ్లిపోతుంటాడు. ఇంతజరిగినా కావ్య కనపడట్లేదేంటి అని స్వప్న అనుకుంటుంది. ఇంతలో కావ్య ఎంట్రీ ఇస్తుంది.


కావ్య: నా భర్త ఈ నేరం చేయలేదు. కంపెనీ పేరు మీద నకిలీ అగ్రిమెంట్, నకిలీ స్టాంప్‌లు ఎవరు చేయించారో, ఆ దొంగ బంగారం కాంట్రాక్ట్ పైన ఎవరు సైన్ చేశారో అన్ని వివరాలు ఈ ఫైల్‌లో ఉన్నాయి.


ఎస్సై: సారీ సర్. ఇప్పటివరకు కంపెనీ ఛైర్మన్‌గా మీరే ఉన్నారు అనుకున్నా. కానీ ఫ్రాడ్ ఎవరు చేశారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇందులో మీకు ఏ సంబంధం లేదనేది అర్థమైంది.


కావ్య: మరి ఎవరికి సంబంధం ఉంది.  అతని పేరు కూడా చెప్పేసేయండి


ఎస్సై: మొత్తం చేసింది ఆ రాహులే


స్వస్న: చెప్పానా వీడే అని చెప్పానా ఇప్పటికైనా అర్థమైంది కదా. వాడిని నడిరోడ్డుమీద కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లండి


 అని స్వప్న చెప్పగానే రుద్రాణి ఇదంతా నా కొడుకుని ఇరికించడానికి ఎవరో కావాలని  కుట్ర చేశారు అంటుంది. సాక్ష్యాలన్ని క్లియర్‌గా ఉన్నాయని ఎస్సై చెప్పినా వినకుండా ఈ కావ్యే నాపై కుట్ర చేస్తుంది. నేను నిర్దోషిని అని రాహుల్ అంటాడు. దాంతో కోపంగా వెళ్లి రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. ఇప్పటివరకు ఎంత అమాయకుడిలా నటించావు. పైగా రాజ్‌ను అరెస్ట్ చేస్తుంటే మౌనంగా ఉంటావా అని తిడుతుంది. పోలీసులు రాహుల్‌ను తీసుకెళ్తారు. అయితే కావ్య రాహుల్‌ బండారం ఎలా బయట పెట్టింది అందరికీ చెప్తుంది.  మరోవైపు కల్యాణ్  చేసిన ఉప్మా చూసి బంటి, అప్పు నవ్వుకుంటారు. ఉప్మా చేశావా? సాంబారు చేశావా? వెటాకారంగా నవ్వుకుంటారు.   


       మరోవైపు రాజ్‌కు కాఫీ తీసుకొస్తుంది కావ్య. అక్కడ తగలబెట్టు అని రాజ్ అంటే.. నేను చేసింది రాహుల్ లాంటి తప్పు కాదు తగలబెట్టడానికి అని కావ్య అంటుంది. మధ్యలో రాహుల్‌ను ఎందుకు తీసుకొస్తున్నావ్. వాడు తప్పు చేసి ఉంటే మాకు ముందు చెప్పొచ్చు కదా అని రాజ్ అంటాడు. ముందు చెబితే మీరు నమ్మారా. ఫైల్ మార్చాడంటే విన్నారా.. నన్ను, అక్కను ఫూల్స్ చేశాడని అంటే నమ్మారా అని కావ్య అంటుంది. ఇల్లు ముక్కలు అయిపోతుందని తాతయ్య ఆందోళనలో పడతారు అని కావ్య అంటుంది. మరోవైపు సీతారామయ్య  దగ్గరకు వెళ్లిన రుద్రాణి ఎమోషనల్‌ గా ఫీలవుతూ.. రాహుల్‌ ను బయటకు తీసుకురావాలని కోరుతుంది. అయితే అందుకు సీతారామయ్య ఒప్పుకోడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.