Karthika Deepam Idi Nava Vasantham Serial Episode పారిజాతం నిన్ను మార్చేసిందని నువ్వు పని మనిషి కూతురివని దాసు జ్యోత్స్నతో చెప్తాడు. జ్యోత్స్న నమ్మదు. దాంతో దాసు నమ్మకపోతే వెళ్లి పారిజాతానికి అడుగు అని చెప్తాడు. నేనే నీ తండ్రి అని కల్యాణి నీ తల్లి అని కాశీ నీ సొంత తమ్ముడు అని చెప్తాడు. ఇప్పటికైనా పద్ధతిగా ఉండకపోతే నీ బండారం బయట పడిన రోజు దాసు కూతురిగా మిగిలిపోతావని అంటాడు.
దాసు: నీకు ఇంకో నిజం చెప్పనా నువ్వు ఎవరి స్థానంలో పెరుగుతున్నావో ఆ బిడ్డ బతికే ఉంది. కానీ ఎక్కడుందో తెలీదు. నువ్వు నేను అనుకున్నట్లు నీ బుద్ది ఉండి ఉంటే నీకు ఈ నిజం చెప్పేవాడిని కాదు. కానీ నువ్వు అలా లేవమ్మా అందుకే నువ్వు నాకు నచ్చేలేదు. అవును నీ స్థాయి నీకు తెలిసింది కాబట్టి కాలు నేల మీద పెట్టు నేల మీద నడువు.
జ్యోత్స్న: నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను.
దాసు: వెళ్లు మా అమ్మని అడుగు నేను చెప్పింది నిజమో కాదో నీకే తెలుస్తుంది.
దీప, అనసూయలు ఇంటికి వస్తారు. దీప స్వామిజీ మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్, శౌర్య బయట నుంచి వస్తారు. ఇక శౌర్య సైకిల్ తీసుకొని వెళ్లిపోతుంది. కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. ఉదయం దాసు, కాశీ వచ్చారని దీప కార్తీక్తో చెప్తుంది. వాళ్లు నీకు ముందే తెలుసా అని అడుగుతుంది. ఈరోజే తెలిసిందని కార్తీక్ అంటాడు.
కార్తీక్: మా తాతయ్య పారుని రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఈయనకు కొడుకు కూతురు ఉన్నట్లు పారుకి అదే వయసు కొడుకు ఉన్నాడు. దాసు నాకు చిన్న మామయ్య అవుతాడు. కాశీ నాకు బామర్ది.
దీప: మరి ఇంటికి ఎందుకు దూరంగా ఉన్నారు.
కార్తీక్: ఇంటి పని మనిషితో ప్రేమ కథ. అది బయట పడి మా తాతయ్య దాసు మామయ్యకి కల్యాణి అత్తకి పెళ్లి చేసేసి ఇంటి నుంచి పంపేశాడు అప్పటి నుంచి వాళ్లు దూరంగా ఉన్నారు. చిన్నమామయ్య కాశీ మళ్లీ ఇన్నాళ్లుకు తిరిగి వచ్చారు. ఇప్పుడు సమస్య ఏంటో మీకు పూర్తిగా అర్థమైంది కదా.
దీప: అర్థం కావడం కాదు బాబు భయంగా ఉంది. స్వప్న కాశీల పెళ్లి అవ్వాలి అంటే స్వప్న తండ్రి ఎవరో దాసు బాబాయ్‌కి తెలియాలి కదా. దాసు బాబాయ్‌కి తెలిసింది అంటే మీ నాన్న గారి రెండో పెళ్లి గురించి మీ అమ్మకి తెలిసిపోతుంది. ప్రస్తుతానికి కాశీ, స్వప్నలని దూరంగా ఉండమని చెప్పండి.
కార్తీక్: అంత అవకాశం మనకి లేదు దీప. స్వప్న ప్రేమ గురించి మా నాన్నకి తెలిసి పోయింది. ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకోవచ్చు కానీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు. అందుకే మా ఆఫీస్‌లో పని చేసే అబ్బాయితో స్వప్న పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ పెళ్లి జరిగితే స్వప్న బతకదు. కాశీ స్వప్నలకు పెళ్లి చేయాలి అంటే మా అమ్మ బతకదు. నాకు ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ స్వప్న ఏడుస్తుంది. ఈ విషయం తెలిస్తే కాశీ ఏడుస్తాడు. వాళ్ల పెళ్లి నేను చేయాలి అది ఇప్పుడు సాధ్యం కాదు. పొరపాటున వాళ్లు లేచిపోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు.
దీప: ఏదో ఒకటి చేద్దాం మీరు కంగారు పడొద్దు బాబు.
జ్యోత్స్న: దశరథ్, సుమిత్రల కూతుర్ని నేను కాదా. ఈ ఇంటి వారసురాలి స్థానంలో పెరుగుతున్న పని మనిషి కూతుర్నా మరి ఎవరు ఆ వారసురాలు. అసలు ఇదంతా నిజం అని నేను ఎందుకు నమ్మాలి. ఎవరు దీనికి సాక్ష్యం. గ్రానీ నువ్వు ఇన్ని సంవత్సరాలు ఈ ఇంట్లో ఎవరికీ చిన్న అనుమానం కూడా రాకుండా కాస్తున్న నిజం నాకు తెలిసి పోయింది మా అమ్మ ఎవరు.
పారిజాతం: సుమిత్ర.
జ్యోత్స్న: నేను అడిగేద మా అమ్మ ఎవరు.
పారిజాతం: సుమిత్ర.
జ్యోత్స్న: మరి కల్యాణి ఎవరు. కల్యాణి ఏమవుతుంది.
పారిజాతం: ఆ పేరు నీకు ఎలా తెలుసు.
జ్యోత్స్న: కల్యాణికి ఒక కూతురు పుట్టింది కదా అది ఎక్కడు ఉంది.
పారిజాతం: పుట్టగానే చనిపోయింది.
జ్యోత్స్న: అబద్దం ఆ బిడ్డ బతికే ఉంది. ఇదిగో ఇలా నీ ముందు నిలబడి నీతో మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు అంటుంటావ్ కదా నువ్వు నా సొంత మనవరాలివి అని నేను నీ సొంత మనవరాలిని నీ కొడుకు దాసు కూతుర్ని.
పారిజాతం: మనసులో ఈ నిజం నాకు తప్ప ఎవరికీ తెలీదు కదా. ఇది నీకు ఎవరు చెప్పారు.
జ్యోత్స్న: ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో కాదు నిజం చెప్పు..
పారిజాతం: నన్ను క్షమించు నా స్వార్థం కోసం నేను ఇలా చేశా.
జ్యోత్స్న: క్షమాపణ కాదు గ్రానీ నువ్వు మంచి పని చేశావ్. ఈ పనికి నేను జీవితాంతం నీకు రుణ పడి ఉండే దాన్ని కాదు. నువ్వు ఆ పని చేయకపోయి ఉంటే ఇన్ని కోట్ల ఆస్తికి వారసురాలిని కాకుండా ఆ కాశీ గాడిలా బతికేదాన్ని. నువ్వు ఒక పని మనిషి కూతుర్ని అదే ఇంటికి యజమానిని చేశాను.
పారిజాతం: ఇది నాకు తప్పా ఇంకెవరికీ తెలీదు నీకు ఎవరు చెప్పారు.
దాసు: అది నన్ను అడుగు. అవును నేనే చెప్పాను. నేను అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటాను. సైదులు గాడు బిడ్డల్ని మార్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.