Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode హాస్పిటల్‌లో ఉన్న విహారి తల్లికి కనకం సేవలు చేస్తుంది. నువ్వు లేకపోతే ఈ కనీళ్లు నా కొడుకు పెట్టేవాడని విహారి తల్లి ఏడుస్తుంది. కనకం ఆమెను ఓదార్చుతుంది. కనకం నిటూర్పు, మెడలో తాళి నుదిటిన బొట్టు చూసి ఈ పెళ్లి బట్టలు ఏంటి ఎయిర్ పోర్ట్‌లో అర్థరాత్రి ఏం చేస్తున్నావ్ అని కనకాన్ని అడుగుతుంది. తన తల్లిదండ్రుల గురించి చెప్పడం కనకానికి ఇష్టం లేక తనకు ఎవరూ లేరని అనాథ అని కనకం చెప్తుంది. నన్ను పెళ్లి చేసుకున్న వాడు అని ఏడుస్తుంది.

 

కనకం: ఎన్నో ఆశలతో తనతో ఏడు అడుగులు వేశాను. ఇప్పుడు నా అడుగులు ఎటు వెయాలో తెలీడం లేదు.

యమున: బాధ పడకమ్మా నా అనే వాళ్లు పక్కన లేకపోతే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు నా ఇంటికి వచ్చేయ్. నా కొడుకు నీ సమస్యను దగ్గరుండి పరిష్కరిస్తాడు. నా కొడుకు ఎన్ని సార్లు ఫోన్ చేశాడో చూశావా వాడికి నేను అంటే ప్రాణం క్షణం కనిపించకపోయినా అల్లాడిపోతాడు. చూడు నా కోసం ఫోన్ చేస్తూనే ఉన్నాడు.

విహారి: అమ్మా ఎక్కడున్నావ్ అమ్మా రాత్రి నుంచి నిన్ను వెతుకుతున్నాను.

యమున: నాకు ఏం కాలేదు నాన్న నేను సేఫ్గా ఉన్నాను అని పద్మాక్షి అన్నదంతా చెప్తుంది. నువ్వు ముందు మీ అత్తయ్య ఇంటికి వెళ్లు. నువ్వు పూజకు రాలేదు అని గొడవ చేసింది నువ్వు వెళ్తే తన కోపం తగ్గుతుంది. 

విహారి: నేను రాకపోవడానికి కారణం వేరే ఉంది నేను చెప్పలేను.

యమున: నాన్న ముందు నువ్వు మీ అత్త దగ్గరకు వెళ్లు. నా మీద నింద పడినా పర్లేదు కానీ నీ మీద నింద పడకూడదు. నువ్వు అత్తయ్యని తీసుకురా. నేను ఇంటికి వచ్చేస్తా. నా కొడుకు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. 

 

విహారి తల్లి కనకాన్ని తీసుకొని తన ఇంటికి బయల్దేరుతుంది.  ఇక కనకం తన అసలు పేరు చెప్తే ఇబ్బంది అవుతుందని లక్ష్మీ అని విహారి తల్లికి చెప్తుంది. మరోవైపు అత్తయ్యని ఎలా అయినా ఒప్పించి తీసుకెళ్లాలని విహారి అనుకుంటాడు. విహారి ఇంటికి కనకం వస్తుంది. ఇంటికి వెళ్లగానే అందరూ కనకం గురించి ఎవరూ అని అడిగితే తన బంధువుల అమ్మాయి అని చెప్తుంది. కొన్నాళ్లు మన ఇంట్లో ఉంటుందని విహారి తల్లి చెప్తే అంభిక తన తల్లి  చాలా మాటలు అంటారు. విహారి తాత మాత్రం యమునను కాపాడిన ఆమె కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుందని గట్టిగా చెప్తాడు. ఇక విహారిని వదిన వాళ్ల ఇంటికి పంపానని యమున చెప్తుంది. 

 

కనకాన్ని మేడ మీద గదికి పని వాడు తీసుకెళ్తాడు. అక్కడ విహారి మామ కనకం నగలు దొంగిలించిన వ్యక్తి ఉంటాడు. ఆమెను కనకం చూడదు. ఇక కనకం గదిలోకి వచ్చి తన పెళ్లి తలచు కొని ఏడుస్తుంది. తాళిని పట్టుకొని తన తల్లిదండ్రులను గుర్తు చేసుకొని బాధ పడుతూ ఉంటుంది. ఇక అంబిక సహస్రకి కాల్ చేసి విహారి వస్తున్నాడని చెప్తుంది. సహస్ర వెళ్లి డోర్ తీస్తుంది. విహారి వచ్చిన విషయం తల్లికి చెప్తుంది. విహారి పద్మాక్షిని పలకరిస్తే పద్మా అరుస్తుంది. మాట తప్పి ఉన్న బంధాన్ని కూడా చంపేశారని అరుస్తుంది. విహారి ఎంత ఒప్పించాలని ప్రయత్నించినా పద్మాక్షి ఒప్పుకోదు. తల్లి కొడుకులు నాటకాలు ఆడి తమని జోకర్లు చేస్తున్నారని అరుస్తుంది. అనుకోని పరిస్థితుల వల్ల పూజకు రాలేకపోయానని అంటాడు. ఇక విహారి రెండు చేతులు జోడించి మోకాల మీద నిలబడి మీ పరువు నేను కాపాడతాను. మీ ప్రాణంగా ప్రేమిస్తున్న సహస్రని నేను పెళ్లి చేసుకుంటానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

 


 

A